విశాఖపట్నం

ఎక్కడైనా రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 28: రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదాకు ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదని వైకాపా ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై బహిరంగంగా తెలుగుదేశంతో ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమని సవాల్ చేశారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా వల్ల పన్ను రాయితీలు వంటివి వస్తాయని, పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడుతుందన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వల్ల దాదాపు 10 వేల పరిశ్రమలు అక్కడ ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోందని, తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒత్తిడి తేవడంలో విఫలమైందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ రెండున్నర ఏళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. హోదా సాధించేంత వరకూ పోరాటం చేస్తామన్నారు. ప్రత్యేక హోదాను ఇవ్వాలనుకుంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇవ్వచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తే ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేనట్టు కనబడుతోందన్నారు. ఈ విషయమై మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న తమ పార్టీ అధినేత జగన్‌కు ప్రధాని అప్పాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. 14వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాకు సంబంధం లేదన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు తప్పని సరికాదని వివరించారు. మహారాష్టత్రో తెలంగాణ ప్రభుత్వం గోదావరి నీళ్లకు సంబంధించి ఒప్పందం చేసుకుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు కారణంగా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ద్రోహం చేయడం సమంజసమా? అని ప్రశ్నించారు. పోలవరం తదితర ప్రాజెక్టులు తాము అడ్డుకోవడం లేదని, కేవలం అక్కడ జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని, విభజన కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారని గుర్తు చేశారు. ప్రజలే ఆ పార్టీకి గుణపాఠం చెబుతారన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగుని ఆధారం చేసుకుని టిడిపికి చేరిన వైకాపా ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం వెనుకాడుతోందని విమర్శించారు. ప్రజల్లో తమ పార్టీపట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఎన్నికల నిర్వహణకు టిడిపి భయపడుతోందన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రైవేట్ మెంబర్ పిటీషన్ వేయనున్నట్టు వెల్లడించారు.