విశాఖ

రాష్ట్భ్రావృద్ధే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాతవరం, ఆగస్టు 28: రాష్ట్రంలో మూడువేల కోట్లతో ఐదువేల కిలో మీటర్ల సిమ్మెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆదివారం మండలంలోని మన్యపురట్ల, గునిపూడి,తాండవ జంక్షన్, యర్రవరం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గల 13 వేల పంచాయతీల్లో శ్మాసన వాటికల అభివృద్ధికి ఒక్కొక్క పంచాయతీకి 10 లక్షల రూపాయలు మంజూరు చేసామన్నారు. రాష్ట్రంలో పంచాయతీ కార్యాలయాలు లేని పంచాయతీలకు లక్షా 30వేలు చెల్లిస్తే 13 లక్షల 50వేల రూపాయల నిధులను మంజూరు చేస్తామన్నారు . నర్సీపట్నం నియోజకవర్గంలో 86 పంచాయతీల్లో రానున్న ఏడాది కాలంలో పూర్తి స్థాయిలో సిమ్మెంట్ రోడ్ల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు. ప్రస్తుతం మూడు కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. నీరు - చెట్టు కార్యక్రమంలో 25 కోట్లు మంజూరు చేసామన్నారు.
* పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
తాండవ జంక్షన్‌లో 16లక్షల 80 వేల రూపాయలతో మంచినీటి పథకం, గునిపూడిలో సుమారు మూడు కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. చిక్కుడుపాలెంలో 3.60 కోట్లతో వంతెన ప్రారంభించారు. డి.యర్రవరంలో 80 లక్షలతో సిమ్మెంట్ రోడ్లు, పంచాయతీ భవనం ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఎం.పి.పి.దేవుడు, జెడ్పిటిసి సత్యనారాయణ, నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీచైర్మెన్ అబ్బారావు, తాండవ చైర్మెన్ కొండబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.