హైదరాబాద్

ఉద్యోగ పరీక్షకు సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జాబుల కోసం పోటాపోటీ పుస్తక పఠనం
* ఉద్యోగాల నోటిఫికేషన్‌తో అభ్యర్థుల్లో ఉత్సుకత
* రీడర్లతో కిక్కిరిసిన నగర కేంద్ర గ్రంథాలయం
* రీడింగ్ రూంలకూ పెరుగుతున్న ఆదరణ

హైదరాబాద్, మార్చి 13: విజ్ఞానాన్ని పంచే గ్రంథాయాలకు మళ్లీ పూర్వవైభవం వచ్చింది. కొద్దిరోజుల క్రితం వరకు పాలకులు, ప్రజల నిరాదరణకు గురైన నగరంలోని పలు గ్రంథాలయాలు, రీడింగ్ రూంలు ఇపుడు తెలంగాణ జాబుల జాతర కారణంగా రీడర్లతో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా ఇంజనీర్ల పోస్టుల భర్తీ చేయగా, తాజాగా పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్‌ఐ పోస్టుల భర్తీగా మరో నోటిఫికేషన్ రావటంతో ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు భారీగా విద్యార్థులు చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయానికి తరలివస్తున్నారు. నోటిఫికేషన్లు లేని సమయాల్లోనూ ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులు ముందుచూపుతో జనరల్ నాలెడ్జి, తెలంగాణ చరిత్ర, ఉద్యమ నేపథ్యం వంటి అంశాలపై పట్టు సాధించేందుకు సమయం దొరికినపుడల్లా గ్రంథాలయాల్లో గడుపుతున్నారు. కాలనీలు, బస్తీల్లోని కమ్యూనిటీ హాళ్లలో ఏర్పాటు చేసిన రీడింగ్ రూంలకు సైతం క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అలాగే అఫ్జల్‌గంజ్‌లోని గ్రంథాలయం, బజార్‌ఘాట్, సిటీలైట్ హోటల్ సమీపంలోని రీడింగ్ రూంలలో గతంలో ఎన్నడూ లేని విధంగా పుస్తక పఠం చేస్తున్న వారు దర్శనమిస్తున్నారు. ఇక చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయానికి విద్యార్థుల తాకిడి వరనాతీతం. ఉదయం ఏడు గంటలకు దినపత్రికలు మొదలుకుని ఎన్నో కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించి పుస్తకాలను ఈ లైబ్రరీలో అందుబాటులో ఉంచారు. ఈ లైబ్రరీ రీడర్లతో నిండిపోయింది. సౌకర్యాలు సరిపోకపోయినా, నలుగురైదుగురు విద్యార్థులు ఓ గ్రూప్‌గా మెట్లపై కూర్చుని పుస్తకాలు చదువుతున్నారు. మున్ముందు తెలంగాణ సర్కారు మరిన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లను జారీ చేయనుండటం, ఉద్యోగ నియామకాల పరీక్షల్లో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర అంశాలను ఓ భాగం చేయటంతో విద్యార్థులు తెలంగాణ ఉద్యమ, సంస్కృతి, సంప్రదాయ సంబంధిత పుస్తకాలను ఎక్కువగా చదువుతున్నట్లు కన్పిస్తుంది. సబ్జెక్టుల వారీగానే గాక, జనరల్ నాలెడ్జి పరంగా విద్యార్థులు ప్రస్తుతం పోటిపోటీగా పుస్తక పఠనం చేస్తున్నారు. శివార్లు, కాస్త దూర ప్రాంతాల నుంచి ఈ లైబ్రరీలకు వచ్చే విద్యార్థులకు మహానగర పాలక సంస్థ కేవలం అయిదు రూపాయలకే మధ్యాహ్నం భోజనాన్ని కూడా అందుబాటులోకి తేవటంతో విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
పట్టాలు పుచ్చుకుని కొండంత ఆశతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని బోగస్ శిక్షణ సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రసార, ప్రచార మాధ్యమాల్లో విపరీతంగా ప్రకటనలు గుప్పిస్తూ నిరుద్యోగ యువతీయువకులను ఆకర్షిస్తున్నాయి. ఆపై తమ మాయమాటలే పెట్టుబడిగా సదరు వ్యక్తుల నుంచి అందినంత దండుకుని ముఖం చాటేస్తున్నారు.