కృష్ణ

జూన్ 4, 5న ప్రొగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ జాతీయ మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 7: ప్రొగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఇండియా జాతీయ మహాసభల జూన్ 4, 5న హోటల్ ఐలాపురంలో నిర్వహించనున్నట్లు సంఘ జాతీయ కన్వీనర్ డా. హిప్నో కమలాకర్ తెలిపారు. శనివారం సాయంత్రం నిర్వహించిన పత్రికా విలేఖర్ల సమావేశంలో ఆయన సభల వివరాలు వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 300కుపైగా సైకాలజిస్ట్‌లు హాజరవుతారన్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలతోపాటు మరిన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు కూడా ఈ మహాసభకు హాజరుకానున్నారన్నారు. అసలు ఈ మహాసభ ఈ నెల 28, 29న నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడ్డాయని తెలిపారు. గుంటూరుకు చెందిన ప్రముఖ విద్యావేత్త, కౌనె్సలింగ్ సైకాలజిస్ట్ ప్రత్యుషా సుబ్బారావును ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ - ఇండియా ఆంధ్రప్రదేశ్ సంఘ కన్వీనర్‌గా నియమిస్తున్నట్లు డా. హిప్నో కమలాకర్ తెలిపారు.

సర్పంచ్ చక్రపాణి హఠాన్మరణం
మోపిదేవి, మే 7: మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ కొల్లి చక్రపాణి(55) శనివారం ఉదయం గుండెపోటుతో హఠాన్మర ణం చెందారు. ఆయన ఆకస్మిక మృతి తో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చక్రపాణి భౌతికకాయాన్ని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, జిల్లా టిడిపి అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, జెడ్పీటిసి సభ్యులు ఎం మల్లిఖార్జునరావు, ఎంపిపి ఎం జయలక్ష్మి, తదితరులు సందర్శించి నివాళులర్పించారు. సాయంత్రం చక్రపాణి అంతిమయాత్ర భారీ ప్రజానీకం మధ్య సాగింది. కుమారులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దివి మార్కెట్ యార్డు ఛైర్మన్ మండవ బాలవర్ధనరావు, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు వేములపల్లి రవిచంద్ర, కోడూరు జెడ్పీటిసి సభ్యులు బండే శ్రీనివాసరావు, చల్లపల్లి ఎంపిపి యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్, ఎంపిటిసిలు యక్కటి హనుమాన్ ప్రసాద్, మేరుగు సురేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.