విజయనగరం

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, సెప్టెంబర్ 4: విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మాజీమంత్రి, వైకాపా కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. మండలంలోని పారసాం గ్రామంలో నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవాలలో ముఖ్యఅతిథిగా సాంబశివరాజు పాల్గొని ప్రసంగించారు. సమితి అధ్యక్షునిగా ఉన్న కాలంలో 1966లో గ్రామంలో ప్రాథమిక పాఠశాల స్థాపించామని గుర్తు చేశారు. పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ పాఠశాలలో స్వర్ణోత్సవాలను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. పూర్వ విద్యార్థుల వలె ప్రస్తుత విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులను, ముఖ్య అతిథులను సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి ఆనంద్ ఫౌండేషన్ తరపున 20వేల రూపాయల విరాళాన్ని ఎయిమ్స్ గ్రూపు ఆఫ్ సంస్థల అధినేత కడగల ఆనంద్‌కుమార్ ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మాజీ ఎంపిపి మత్స విజయ, సత్యనారాయణ, నాపెడ్ డైరెక్టర్ కె.వి.వి.సూర్యనారాయణరాజు పాల్గొన్నారు.