విజయనగరం

ప్రత్యేక హోదాపై బిజెపి, టిడిపి ద్వంద్వ వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 29: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ద్వంద్వవైఖరి అవలంభిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కన్వీనర్, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావుఅన్నారు. పట్టణంలో అమర్‌భవన్ వద్ద గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టవ్రిభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని తెలిపారు. రాష్టవ్రిభజన సమయంలో రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఉన్న ప్రస్తుత కేంద్రమంత్రి వెంకటయ్యనాయుడు రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వవలసిందేనని డిమాండ్ చేశారని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకయ్యనాయుడు మాట మార్చారని చెప్పారు. విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుండా ప్రత్యేక ప్యాకేజిలతో సరిపెట్టే ఆలోచనలో కేంద్రప్రభుత్వం ఉందని అన్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి వ్యతిరేకించవలసిన తెలుగుదేశం ప్రభుత్వం వౌవనం వహించిందని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీకి పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు.
రాష్టవ్రిభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్నివిధాలా నష్టం జరిగిందని, రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయడంతో ప్రజా సంక్షేమం కుంటుపడిందని, ఎన్నో సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని తెలిపారు. అందువల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేవరకు పోరాటం సాగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు వి.కృష్ణంరాజు, సిపిఐ నాయకులు బుగత సూరిబాబు, బుగత అశోక్, ఆల్తి మారయ్య, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బి.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.