విజయనగరం

వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 29: విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం బాధ్యతా యుతంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. అక్టోబర్ 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజులు జరిగే ఈ ఉత్సవాలలో కమిటీలకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని స్పష్టం చేసారు. విజయనగరం ఉత్సవాలు, అనంతరం జరిగే శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలు సందర్భంగా పట్టణం సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించాలని అన్నారు. చారిత్రక భవనాలు, ప్రాంతాలు సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. విజయనగరం చరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలను మేళవించి ఈ ఉత్సవాలు నిర్వహించే ఈ ఉత్సవాలు జిల్లా చారిత్రక వైభావాన్ని చాటే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, రంగోలి పోటీలు, ఫుడ్ ఫెస్టివల్, డ్వాక్రా బజార్, ఫ్లవర్ షో, గ్రామీణ సంపద, కళాకారుల ప్రదర్శనలు, నాటకాలు, సాహితీ కళారంగాలకు చెందిన ప్రముఖులకు సన్మానాలు ఉండాలని చెప్పారు. డాగ్ షో, పక్షుల ప్రదర్శన, పుస్తక ప్రదర్శన, సైన్స్ ఫేర్ నిర్వహణ ఆయా వర్గాల వ్యక్తులను, చిన్నారులను, మహిళలను ఆకట్టుకునే విధంగా ప్రతిబింబించాలని చెప్పారు. ఉత్సవాల సందర్బంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఉండాలని సూచించారు. పర్యాటకులకు అనువుగా శానిటేషన్, ఇతర సౌకర్యాలు, ప్రచారం, మెమోంటోలు ముగింపు కార్యక్రమం మ్యూజికల్ నైట్‌లో తీసుకోవలసిన చర్యలపై ఆయన సంబంధిత కమిటీలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జిల్లాలోని నాటక సమాజాలను, కళాబృందాలను, సాహితీ వేత్తలను ఈ ఉత్సవాల్లో ప్రోత్సహించాలని చెప్పారు. చిత్రలేఖనం, రంగోలి, తెలుగు అమ్మాయి. వంటల పోటీలలో భాగస్వామ్యం చేయాలని చెబుతున్నారు. ఈ ఉత్సవాలు తిలకించేందుకు ఇతర దేశాలలోని జిల్లా వాసులను, ప్రముఖులను ఆహ్వానించి తగు రీతిలో వారిని గౌరవించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏ జె సి నాగేశ్వరరావు, డిఆర్‌ఓ జితేంద్ర, ఆర్‌డిఓ శ్రీనివాస మూర్తి, జడ్పీ సిఇఓ రాజకుమారి, డిఆర్‌డిఎ, డ్వామా, ఐసిడి ఎస్ ప్రాజె క్టు డైరెక్టర్లు ఢిల్లీరావు, ప్రశాంతి, రాబర్ట్స్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి రాజు, టూరిజం అధికారి అనిత, డిఇఓ అరుణకుమారి, డిఎస్‌ఓ శాంతి కుమారి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.