విజయనగరం

గృహ నిర్మాణ ప్రగతిపై ఎమ్మెల్యే గీత సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 29: విజయనగరం టౌన్, రూరల్ ప్రాంతాలలో అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మిస్తామని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మీసాల గీత ఆదేశించారు. నియోజకవర్గంలో గృహ నిర్మాణ ప్రగతిపై గృహ నిర్మాణశాఖ అధికారులతో గురువారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గీత మాట్లాడుతూ విజయనగరం మండలంలో మంజూరైన 350 ఎన్‌టిఆర్ గృహాలు, ప్రధానమంత్రి అవాజ్ యోజన పథకం కింద మంజూరైన 72 ఇళ్ల ప్రగతిపై ఆరా తీశారు. కుల ప్రాతిపదికలో ఎస్సీలకు 59 ఇళ్లకు గాను 33 ఇళ్ల జాబితాను అందజేశారని, అందువల్ల 294 ఇళ్లను ఎన్‌టిఆర్ పథకంలో జిల్లాకలెక్టర్ మంజూరు చేశారని ఎమ్మెల్యే దృష్టికి గృహ నిర్మాణశాఖ అధికారులు తీసుకువెళ్లారు. విజయనగరం అర్బన్ పరిధిలో స్థలం ఉన్న 4,510 ఇళ్ల మంజూరు విషయమై ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రజాప్రనిధులతో సహకారంతో జియో ట్యాగింగ్ ద్వారా ఇంటి నిర్మాణం ప్రారంభించేలా చూడాలని ఎమ్మెల్యే గీత ఆదేశించారు. స్ధలం లేనివారికి మంజూరైన 4,160 ఇళ్లను ఎపి టౌన్ షిప్,. ఇన్ప్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణాలు చేపడతామని తెలిపారు. రోడ్డు విస్తరణ పనులలో ఇళ్లు కోల్పోయిన అర్హులైన వారి జాబితాను చేర్చాలని గృహ నిర్మాణశాఖ అధికారులను ఆమె ఆదేశించారు.