విజయనగరం

రైల్వే వంతెన పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్),సెప్టెంబర్ 29: విశాఖపట్టణం, రాయపూర్ 26వనెంబర్ జాతీయ రహదారిపై సుమారు 13 కోట్ల రూపాయల అంచనావ్యయంతో కేంద్ర ఉపరితల రవాణా శాఖ, రైల్వేలు సంయుక్తంగా నిర్మిస్తున్న రెండవ వంతెన నిర్మాణపనులు మరలా వేగం పుంజుకున్నాయి. ఇటీవల వరకు భారీ వర్షాలు కారణంగా నిర్మాణపనులు నిలిపివేసారు. తిరిగి ఈపనులు ప్రారంభం అయ్యాయి. ఈ వంతెనకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి సంతకాల వంతెనగా నామకరణం చేయడమే కాకుండా ఆమేరకు ఎత్తుబ్రిడ్జిపై ప్లెక్సీని కూడా నెలకొల్పడం విశేషం. నిత్యం వేలాది వాహనాలు ఈరహదారిపై ప్రయాణిస్తూ ఉంటాయి. ఒడిసా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు వెళ్లాలంటే 26వ నెంబర్ జాతీయ రహదారి ప్రధానమైంది. వాణిజ్యపరంగా, రావాణా పరంగా ఈరహదారికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒడిసా, ఛత్తీస్ ఘడ్‌లలో లభించే ఖనిజాలు, ఇంధనాలు వాణిజ్యకేంద్రం, పోర్టు పట్టణంమఅయిన విశాఖకు నిత్యం వందలాది ట్రక్కుల్లో చేరవేస్తారు. ఇతర సరుకు రవాణా వాహనాలు కూడా ఈరహదారి గుండా ప్రయాణించి ఢిల్లీకి చేరకుంటాయి. దీంతో సుమారు నాలుగవందల యాభై కిలోమీటర్ల పొడవుగలిగిన ఈరహదారిలో అతికీలకమైన కేంద్రం విజయనగరం. జిల్లా కేంద్ర పట్టణం కావడంతో స్ధానిక వాహనాలు, పట్టణంలోకి ప్రవేశించే ప్రయాణికుల వాహనాలు, ఆటోలు, ద్విచక్రవాహనాలు ఈరహదారిపై ప్రయాణించే వాటి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఒకవైపు నేషనల్ పర్మిట్ వెహికల్స్, రవాణా వాహానాల కారణంగా ఈరహదారిపై ఇటీవల కాలంలో విపరీతమైన రద్దీ పెరిగింది. దీంతో గతంలో నిర్మించిన వంతెన పాతది కావడంవలన వత్తిడి తట్టుకోలేక ఇరుకుగా మారింది. ప్రజలు పడుతున్న అవస్ధలు గమనించిన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న విజయనగరం శాసనసభ్యుడు ప్రస్తుత కేంద్ర మంత్రి పి.అశోక్‌గజపతిరాజు రెండవ వంతెన నిర్మాణం ఆవశ్యకతను గుర్తించి సంతకాల ఉద్యమం చేపట్టారు. ప్రజలనుండి ఈ ఉద్యమానికి మంచి స్పందన రావడంతో సేకరించిన సంతకాలను అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. అశోక్ చూపిన చొరవను ఆనాడు అధికారంలో పెద్దలు ఎద్దేవా చేసినా అవేమి పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. ఈనేపధ్యంలోనే ఈవంతెనకు ఆయన సంతకాల వంతెనగా నామరణం చేయడం పట్టణంలో చర్చనీయాంశం అయింది. కేంద్రంలో అధికారం మారండం ఎన్‌డి ఏ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో టిడిపి భాగస్వామ్యం అవడంతో కేంద్రలో మంత్రిపదవి చేపట్టిన అశోక్ తాను సంతకాలద్వారా చేపట్టిన ఉద్యమానికి కార్యరూపం ఇస్తూ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు లభించేలా కృషిచేసారు. కేంద్ర ఉపరితల రావణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీని ఒప్పించి 13కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు మంజూరు చేయించారు. ఈ ఏడాది వేసవిలో పునాదిరాయి పడిన ఈవంతెన నిర్మాణపనులు చురుగ్గా జరగుతున్నాయి.