విజయనగరం

నియోజకవర్గానికి 1250 గృహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 11: ఎన్టీ ఆర్ గృహ నిర్మాణ పథకం కింద ప్రతీ నియోజకవర్గంలో 1250 గృహాలు నిర్మించనున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. సోమవారం డిఆర్‌డిఎ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ అధికారులతో ఆమె సమీక్షించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతినాడు ఈ గృహ నిర్మాణాలకు ఆయా నియోజకవర్గ స్థాయిల్లో శంకుస్థాపనలు చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఇంజనీర్లకు ఆదేశించారు. గతంలో మంజూరై వివిధ దశలలో గృహాలకు బకాయిలు చెల్లించేందుకు 1100 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ప్రతీ ఇంటిని జియోట్యాగింగ్ చేసి ఫొటోలు తీసి పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా గృహనిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అర్హత ప్రాతిపదికగా గృహ నిర్మాణ పథకాలు అమలు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే నారాయణస్వామినాయుడు, పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు, జడ్పీవైస్ చైర్మన్ కృష్ణమూర్తి, బొబ్బిలి మున్సిపల్ చైర్‌పర్సన్ అచ్యుతవల్లి, ఎ జెసి నాగేశ్వరరావు, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ మూర్తి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అంబేద్కర్ జయంతి నాడు
ఎన్టీఆర్ గృహాలకు శంకుస్థాపనలు
రాజ్యాంగ నిర్మాత 125వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాలో నిర్మించనున్న ఎన్టీ ఆర్ గృహాలకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టాలని గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. సోమవారం మంత్రి విజయనగరం నుండి 13 జిల్లాల గృహనిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ 14వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణాజిల్లా జగయ్యపేటలో ఎన్టీ ఆర్ గృహాలకు శంకుస్థాపన నిర్వహిస్తారని అన్నా రు. ఇందుకు ఏర్పాట్లు సిద్దంచేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఇళ్లనిర్మాణాలకు శంకుస్థాపనలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అర్హత ఆధారంగా ఈ నిధులు మంజూరు జరుగుతాయని వివరించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా గృహ నిర్మాణ కార్యక్రమం రాష్ట్రంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎన్టీ ఆర్ గృహనిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా అందరి భాగస్వామ్యంతో నిర్వహించాలని స్పష్టం చేసారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో గృహనిర్మాణ సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ఆయా జిల్లాల హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు పాల్గొన్నారు.

మెరుగైన వైద్య సేవల్లో ప్రథమంగా నిలవాలి
గజపతినగరం, ఏప్రిల్ 11: మెరుగైన వైద్య సేవలు అందించడంలో గజపతినగరం ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను జిల్లాలోనే నెంబర్ వన్‌గా నిలపాలని స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. సోమవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటరమణ సారధ్యంలోని నూతన కార్యవర్గం ఆసుపత్రి అభివృద్ధికి వైద్య సేవలు మరింత మెరుగుకు అహర్నిశలు శ్రమించాలని చెప్పారు. ఎమ్మెల్యేలకు బిజీ షెడ్యూల్ దృష్ట్యా ప్రభుత్వం చైర్మన్ పదవిని నామినేట్‌గా మార్చిందని, ఈ విధానం ఎంతో మేలు చేస్తుందని అన్నారు. కొత్త చైర్మన్ పూర్తి స్థాయిలో ఆసుపత్రిపై దృష్టి సారించి తద్వారా వైద్య సేవలు మెరుగు కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం గత బడ్జెట్‌లో వైద్యశాఖకే ఎక్కువ నిధులు కేటాయించిందని తెలిపారు. వైద్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆరోగ్య శ్రీ పేరిట భారీ దోపిడి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు జీవం పోసాడని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల మరిన్ని సౌకర్యాల కల్పనకు కోట్లాది రూపాయలు వ్యయం చేస్తుందని అన్నారు. గజపతినగరం సిహెచ్‌సిలో కొత్త భవనాల నిర్మాణానికి ఇప్పటికే మూడు కోట్ల రూపాయలు కేటాయించామని మరిన్ని నిధులు వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. అంతుకుముందు 11.30గంటలకు చైర్మన్‌గా మిత్తిరెడ్డి వెంకటరమణ సభ్యులందరు హర్షధ్వానాల మధ్య బాధ్యతలు స్వీకరించారు.
తనపై నమ్మకం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి మంచిపేరు తీసుకువస్తానని వెంకటరమణ అన్నారు. ఎమ్మెల్యే నాయుడు, జడ్పీటిసి మక్కువ శ్రీధర్‌కు రుణపడి ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపిలు గంట్యాడ శ్రీదేవి, బెజవాడ రాజేశ్వరి, పిరిడి ఎల్లమ్మ, జడ్పీటిసిలు మక్కువ శ్రీధర్, బండారు బాలాజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ చంటిరాజు, జిల్లా కార్యనిర్వాహక సభ్యుడు రావి శ్రీధర్, విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ వి సూర్యనారాయణమూర్తి, గజపతినగరం సర్పంచ్ నరవ ఆదిలక్ష్మి, ఎంపిటిసిలు కర్రి శ్రీదేవి, నగర ప్రసన్న కుమారి, మైథిలి ప్రియాంక, గొర్లె ఆదినారాయణ, వర్తక సంఘం అధ్యక్షుడు కొల్లా వెంకటసాంబమూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.