విజయనగరం

నగదు లోటు భర్తీకి నగదు రహిత లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 5: నగదు లోటు భర్తీ చేసేందుకు నగదు రహిత లావాదేవీలు జరపడం ఉత్తమమైన మార్గమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి మృణాళిని చెప్పారు. చిన్న నోట్లు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చన్నారు. సోమవారం సాయంత్రం ఆమె కలెక్టరేట్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు మండల, గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సులో మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, వివిధ రకాల వాలెట్ల వినియోగంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాలో ఎస్‌హెచ్‌జిలు, ఉపాధి కూలీలు 13.75 లక్షల మంది ఉన్నారని, వారికి కూడా అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాలో 5.69 లక్షల మందికి జన్‌ధన్ ఖాతాలు ఉండగా, వారిలో 3.52 లక్షల మందికి రూపేకార్డులు జారీ అందజేశామన్నారు. దాంతోపాటు 1398 చౌక ధరల దుకాణాలకు బిజినెస్ కరెస్పాండెంట్లను ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రంలో ఐదు రకాలుగా నగదు రహిత లావాదేవీలు జరపవచ్చన్నారు. ఇంటర్నెట్ లేకున్నా యుఎస్‌ఎస్‌డి ద్వారా సాధారణ మొబైల్ నుంచి లావాదేవీలు జరపవచ్చని తెలిపారు. యుపిఐ ద్వారా స్మార్ట్ ఫోన్, సాధారణ ఫోన్‌ల ద్వారా లావాదేవీలు జరపవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. డెబిట్ కార్డు, మొబైల్ వాలెట్ల ద్వారా 20 రూపాయల వరకు నగదు రహిత లావాదేవీలు జరపవచ్చన్నారు. ఎస్‌హెచ్‌జిలకు అవసరమైన శిక్షణనిచ్చి వారికి అవగాహన కల్పిస్తామన్నారు. పింఛనుదారులకు అవగాహన కల్పిస్తామన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాకు రూ.160 కోట్లు వచ్చినప్పటికీ రూ.2000 నోట్లు, రూ.500 నోట్లు కొంత మేర వచ్చినప్పటికీ డిమాండ్‌కు సరిపడినంతగా లేనందున చిల్లర సమస్య నెలకొందన్నారు. జిల్లాలో 289 బ్యాంకుల శాఖలు, 267 ఎటిఎం కేంద్రాలు ఉన్నప్పటికీ జిల్లావ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు సరిపోవడం లేదన్నారు. అందువల్లనే 921 గ్రామ పంచాయతీల్లో బ్యాంకింగ్ సేవలకు బిజినెస్ కరెస్పాండెంట్లు, బ్యాంకు మిత్రలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జగదీష్, పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు, డిఆర్‌డిఎ పిడి డిల్లీరావు పాల్గొన్నారు.