విజయనగరం

వాయిదా మీరిన బకాయిల వసూళ్లకు చట్టపరమైన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జనవరి 13: జిల్లాలో వాయిదామీరిన బకాయిల వసూళ్లకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ టి.వెంకటేశ్వరరావుతెలిపారు. బకాయిల వసూళ్లకు సంబంధించి శుక్రవారం సమీక్షించారు. జిల్లాలో 39 కోట్ల రూపాయల వాయిదా మీరిన బకాయిలు వసూళ్లు కావాల్సి ఉందన్నారు. బకాయిలను చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోవడం లేదని, అందువల్ల చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించామన్నారు. బకాయిల వసూళ్ల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు. ఈ బృందాల ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ నుంచి బకాయిల వసూళ్లకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు.
బ్యాంకు డిప్యూటీ జనరల్‌మేనేజర్ కంది చంద్రరావుమాట్లాడుతూ రబీసీజన్‌లో 79.20 కోట్ల రూపాయల పంటరుణాలను రెన్యువల్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇంతవరకు 50 లక్షల రూపాయల రుణాల రెన్యువల్ చేశామన్నారు. మిగతా రుణాలను మార్చినెలాఖరులోగా రెన్యువల్ చేస్తామని, దీనికి సంబంధించి బ్యాంకుమేనేజర్లు, సహకార సంఘాల ముఖ్య కార్యనిర్వహణాధికారులకు ఆదేశామన్నారు. ఈ సమావేశంలో సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ నరసింగరావుతదితరులు పాల్గొన్నారు.