విజయనగరం

అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణం చెల్లింపులు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జనవరి 24: అగ్రిగోల్డు డిపాజిట్ దారులకు ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎపి అగ్రిగోల్డు కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రీలే దీక్షలు మంగళవారం రెండోరోజు కొనసాగాయి.
కస్టమర్ల సంఘం నాయకులు ఇ వినాయుడు మాట్లాడుతూ అగ్రిగోల్డు కస్టమర్లకు చెల్లించాల్సిన బకాయిల కంటే ఆస్థులు విలువ ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ దర్యాప్తు సంస్ధ చెప్పిన నేపధ్యంలో ఆస్తులను వేలం వేసి తక్షణం బాకాయిలు చెల్లింపు చేపట్టాలని డిమాండ్ చేసారు. వడ్డీతో సహా చెల్లించేలా చూడాలని కోరారు. వేలానికి ప్రభుత్వం, అప్పులు ఇచ్చిన బ్యాంకులు పూర్తిగా సహకరించాలని సూచించారు. ప్రతినెల వెయ్యినుండి రెండువేల కోట్ల రూపాయల ఆస్తులు వేలం వేసి చెల్లింపులు చేపట్టాలని అన్నారు. అగ్రిగోల్డు కస్టమర్ల జాబితా, సి ఐడి అధికారులు స్వాధీనం చేసుకున్న వివరాలు వెబ్‌లో ఉంచాలని కోరారు. కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేసి బినామీ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేసారు. చనిపోయిన కస్టమర్లు, ఏజెంట్ల కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. వీరి దీక్షలకు సిపి ఐ జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు సంఘీ భావం ప్రకటించారు. ఈదీక్షల్లో సూరి అప్పారావు, బాలక్రిష్ణ,శ్రీనివాసరావు, గౌతం తదితరులు పాల్గొన్నారు.

ఆటో కార్మికులపై మోపిన
రవాణా పన్ను భారం ఉపసంహరించాలి
విజయనగరం(టౌన్), జనవరి 24: కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాలు రోజువారీ జీవనం సాగించే ఆటో కార్మికులపై మోయలేని భారాలు మోపుతున్నాయని సిఐటియు డివిజన్ కార్యదర్శి రెడ్డి శంకరరావు ధ్వజమెత్తారు. పెంచిన రవాణా పన్ను భారాలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకులు జారీ చేసిన జి ఒ 894 ప్రతులను దగ్ధం చేసారు.
ఈ ఆందోళనను ఉద్ధేశించి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ రోడ్డు ట్యాక్స్, ఇన్సూరెన్సు ట్యాక్స్, ఇతర రవాణా పన్నులు దారుణంగా పెంచి ఆటో కార్మికులపై రవాణా అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లైసెన్స్‌ఫీజు ఆలశ్యం అయితే రోజుకు 50 రూపాయలు ఫైన్ విధించారని ఇటువంటి విధానాలతో ఆటోకార్మికులుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేఖ విధానాలపై యూనియన్లకు అతీతంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.
ఇప్పటికే డీజిలు ధరలు పెరిగి కష్టాలు పడుతున్న వారిపై జిఒ 894 పేరుతో మోపిన అదనపు పన్నుల భారాన్ని ఉపసంహరించాలని లేనిపక్షంలో ఈనెల 30న ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సి ఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివిరమణ, ఆటోయూనియన్ సంఘం కార్మికులు బొమ్మనపాపారావు, జి అప్పారావు,శ్రీనివాస్, కోట కూడలి స్టాండ్ నాయకులు రామారావు, భోగాపురం రాజు, జి బాబు, గౌరి తదితరులు పాల్గొన్నారు.