విజయనగరం

ప్రత్యేక హోదా కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుపాం, జనవరి 26: ఏ.పి. ప్రత్యేక హోదా కోరుతూ వై.కా.పి., సి.పి.ఎం. పార్టీల ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. వై.కా.పా. యువనేత పరిక్షిత్ రాజు, జడ్పిటీసి పద్మావతి, మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తిల ఆధ్వర్యంలో రావాడ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి వ్యాన్‌లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు ర్యాలీలో పాల్గొనకుండా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణీని గృహనిర్భందంలో ఉంచారు. అరెస్టు చేసిన నాయకులను, కార్యకర్తలను వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా రావడం వలన ఎన్నో రాయితీలు వస్తాయని, అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందన్నారు. ఆంద్రుల ఆత్మాభిమానాన్ని బి.జె.పి వద్ద దేశంపార్టీ తాకట్టుపెట్టి ప్యాకేజిలంటూ మాయమాటలు చేబుతుందన్నారు. ప్యాకేజి సొమ్ములను దిగమిగ్గేందుకు, స్కాంల నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్ర ఇది అన్నారు. హోదాకోసం యువత ముందుకు వస్తే అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజల నుంచి వచ్చే ఉద్యమాన్ని ఎవరూ అడ్డుకోలేరని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వి.కృష్ణ, సి.పి. ఎం. నాయకులు తిరుపతిరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.