విజయనగరం

రాష్ట్రంలో నిరంకుశ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, జనవరి 26: ప్రత్యేక హోదాను కోరుతూ జిల్లాకేంద్రంలో కొవ్వుత్తుల ర్యాలీ చేయడానికి బయలుదేరుతున్న ఎమ్మెల్యే రాజన్నదొరతోపాటు 15మంది వై.సి.పి. నాయకులను పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. వై.సి.పి. అధిష్టానం పిలుపుమేరకు ప్రత్యేక హోదాను కోరుతూ కొవ్వుత్తులతో శాంతియుతంగా ర్యాలీ చేయడానికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యేతోపాటు వై.సి.పి. నాయకులు విజయనగరంలో నిర్వహించే శాంతియుత ఆందోళనలో పాల్గొనడానికి బయలుదేరిన ఎమ్మెల్యేను సి.ఐ. రామకృష్ణ అడ్డగించారు. గురువారం సాయంత్రం 4గంటల నుంచి పోలీసులు ఆయన ఇంటి వద్ద మోహరించారు. దీనిపై ఎమ్మెల్యే రాజన్నదొర విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో దేశం పార్టీ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వలన కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. పోలీసులతో ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని చూడటం తగదన్నారు. తాము కత్తులు, బాంబులతో ఉద్యమాలకు బయలుదేరలేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలన్న ఉద్దేశ్యం తమకు లేదన్నారు. శాంతియుత ఉద్యమాన్ని చేయడానికి వెళితే అడ్డుకోవడం తగదన్నారు. దేశం పార్టీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. ఎమ్మెల్యేతోపాటు వై.సి.పి. నాయకులు జర్జాపు సూరిబాబు, సువ్వాడ రమణ, గిరి రఘు, పువ్వల నాగేశ్వరరావు, వానపల్లి రామకృష్ణ, వి.కామరాజు, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.