విజయనగరం

మాన్సాస్ చైర్మన్‌ను కాను..మున్సిపల్ చైర్మన్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 10: తొలగించిన చోటే బడ్డీలు పెట్టుకోవడానికి నేను మాన్సాస్ చైర్మన్‌ను కాదు..మున్సిపల్ చైర్మన్ని..మీ కోర్కెలు నేను తీర్చలేను. మున్సిపల్ స్థలాలలో మాత్రం ఉపాధి చూపగలనని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. పట్టణంలో రంజనీధియేటర్ ఎదురుగా మాన్సాస్ స్థలంలో బడ్డీల తొలగింపుతో ఉపాధి కోల్పోయి నిరాశ్రయులైన బాధితులు శుక్రవారం మున్సిపల్ చైర్మన్‌ను కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ జనతాబజారుతోపాటు కొత్తగా రాజీవ్ క్రీడామైదానం వద్ద షాపులను నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని తెలిపారు. అక్కడ అందరికీ షాపులను కేటాయిస్తామని చెప్పారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్‌ను కలుసుకున్న బాధితులు తమ ఉపాధికి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ నాగరాజుతో చర్చలు ఏర్పాటు చేయాలని ఆర్డీఒను ఆదేశించారు. దీనిలో భాగంగా మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ, కమిషనర్ నాగరాజుతో ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు కె.సన్యాసిరావు, ఇతర నేతలు బోని సన్యాసిరావు, బొడ్డు అప్పలరాజు, కె.శ్రీను మాట్లాడారు. కూల్చివేసిన ప్రాంతంలోనే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని బాధితులు కోరగా...నేను మాన్సాస్ చైర్మన్‌ను కాను..మున్సిపల్ చైర్మన్ని అంటూ తప్పించుకున్నారు. అంతకు ముందు జైలు నుంచి విడుదల అయిన సందర్భంగా ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు కె.సన్యాసిరావుబాధితులతో కలిసి ప్రకాశం పార్కులో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బాధితులను ఐక్యం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. మూడురోజులు జైలులో ఉంచి బడ్డీలను తొలగించడం దారుణమన్నారు. రోడ్ల విస్తరణ చేయగా మిగిలిపోయిన స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని ఆయన కోరారు. మాన్సాస్‌కు బడ్డీల పన్ను చెల్లిస్తున్నా, ముందస్తు సమాచారం లేకుండా బడ్డీలు తొలగించడం అన్యాయమని బాధితులు వాపోయారు.
గోమాంసం అక్రమ రవాణాపై
చర్యలు తీసుకోవాలి

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 10: విజయనగరం పట్టణంలో గో మాంసం అక్రమ రవాణా జరుగుతుంటే కనీసం పట్టించుకోకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య పట్టణ అధ్యక్షుడు మద్దిల సోంబాబు అన్నారు. మండల జంతు సంక్షేమ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మండల తహాశీల్దార్ స్పందించకపోవడం దారుణమని చెప్పారు. ఈ మేరకు మండల తహాశీల్దార్ కోరాడ శ్రీనివాసరావుకు శుక్రవారం ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సోంబాబు మాట్లాడుతూ పట్టణంలో ఎత్తుబ్రిడ్జి వద్ద ట్రాఫిక్ ఎస్సై దేవుడుబాబు ఆవుమాంసం లారీని పట్టుకుని వన్‌టౌన్‌కు అప్పగించారని తెలిపారు. అయితే వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేయకుండా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు తిరిగి పంపారని చెప్పారు. ఈ మధ్యలో లారీలో ఉన్న మాంసం మాయమైందన్నారు. అందువల్ల దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గో సంరక్షణ సమాఖ్య నాయకులు ఎం.బి. అప్పారావుదొర, పి.నారాయణస్వామి, పనస బంగార రాజు తదితరులు పాల్గొన్నారు.
పౌరహక్కుల పరిరక్షణలోప్రజల భాగస్వామ్యం అభినందనీయం

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 10: పౌర హక్కుల పరిరక్షణలో పౌరులను భాగస్వామ్యం చేయడం అభినందనీయమని దళిత బహుజన శ్రామిక్ యూనియన్ (డిబిఎస్‌యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబు అన్నారు. జిల్లా ఎస్పీ ఎల్‌కెవి రంగరావుపౌర హక్కుల పరిరక్షణలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవడం మంచి పరిణామమని చెప్పారు. డిబిఎస్‌యు కార్యాలయంలో శుక్రవారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ యువతీ యువకులకు ప్రబోద కేంద్రాలు, పోలీస్ యంత్రాంగానికి ఎస్సీ,ఎస్టీ చట్టాలు, ఇతర చట్టాలపై శిక్షణలు, స్నేహపూర్వక పోలీస్ వ్యవస్థగా మార్చే ప్రయత్నాలు చేయడంతోపాటు ప్రజల భాగస్వామ్యంతో పోలీసుమిత్ర ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు సమైక్యంగా ఉంటే శాంతిభద్రతలు శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాకుండా సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

నేత్రపర్వంగా శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకలు

విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 10: కంటోనె్మంట్‌లోని వివేకానంద కాలనీ శ్రీవేంకటేశ్వర ధ్యానమండలిలో కొలువుదీరి భక్తుల నీరాజనాలు అందుకుంటున్న కోనేటిరాయుని షష్టాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. శుక్రవారం ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా మలయప్పస్వామికి 108 కలశాలతో అభిషేకం, క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం వంటి విశేష క్రతువులను స్వామివారి మూలవిరాట్‌కు రంగవిఠల్ సారధ్యంలో స్ధానాచార్యులు పీసపాటిరామానుజార్యులు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ అభిషేక సేవలను చూసి తరించేందుకు భక్తులకు రెండు కనులు చాలనంతగా వేడుకగా జరిపించారు. ముందుగా 108 కలశాలను మంగలవాయిద్యాల నడుమ అర్చకులు రామానుజార్యులు ఆలయంలోకి తోడ్కొని వచ్చి మండపారాధన నిర్వహించారు. అనంతరం విశేష అభిషేక సేవలు ఉభయ దేవేరులతో కూడిన స్వామివారికి జరిపారు. అభిషేక జలలాలను భక్తుల శిరసులపై జల్లి, ఊరేగింపుగా స్వామివారి శ్రీచక్రాన్ని శిరసుపై ధరించి స్నానం ఆచరించారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులు, మహిళా భక్తులు, పూజారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం పవళింపుసేవతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసాయి. ఈ ఉత్సవాలను భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించామని ఆలయకమిటీ తెలిపింది.

నేటి నుంచి నంది నాటకోత్సవాలు
* రెండో విడత ప్రారంభం

విజయనగరం, ఫిబ్రవరి 10: పట్టణంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో రెండో విడత నంది నాటకోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి విడతలో 44 ప్రదర్శనలు జరగ్గా, రెండో విడతలో 34 ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11 నుంచి 15 వరకు ఐదు రోజులపాటు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ నాటికలను ప్రదర్శిస్తారు. మొదటి రోజున ‘పెళ్లి చూపులు, ఒకే ఒక్కడు, పుణ్యఫలం, స్నేహమేరా శాశ్వతం’ అనే సాంఘీక నాటికలను ప్రదర్శించనున్నారు.