విజయనగరం

జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు చర్యలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 10: ప్రతి ఏటా వేసవి వస్తుందంటే గ్రామీణులు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. జిల్లా కేంద్రమైన విజయనగరం మున్సిపాల్టీలో కూడా వేసవిలో రెండు రోజులకోమారు నీటిని సరఫరా చేసే దుస్థితి నెలకొంది. ఇక గ్రామాల్లో పరిస్థితి చూస్తే గిరిజన గ్రామాల్లో చెలమల ద్వారా నీటిని తీసుకెళ్లడం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం అందరికీ రక్షిత మంచినీటిని సరఫరా చేస్తామని చెబుతున్నప్పటికీ అది అందని ద్రాక్షగానే మిగిలింది. నేటికి జిల్లాలో గ్రామాలు, కుగ్రామాలు కలిపి 29500 ఉండగా వాటిలో 1600 గ్రామాలకు రక్షిత దొరక్క అవస్థలు పడుతున్నారు. జిల్లాలో అత్యధిక జనాభాకు తాగునీరు అందిస్తున్నప్పటికీ ప్రజలందరికీ పూర్తి స్థాయిలో రక్షిత నీటిని అందించలేకపోతున్నారు.
దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు వేసవి వచ్చిందంటే బిందెలు నెత్తిన పెట్టుకొని కాలిబాటన దూరాభారానికి వెళ్లి నీళ్లు తెచ్చుకునే దుస్ధితి ఏర్పడింది. కాగా, ఈ ఏడాది మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని గ్రామీణ నీటి సరఫరాశాఖ ఎస్‌ఇ ఎన్‌వి రమణమూర్తి చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో జిల్లాలో 921 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 1360 సింగిల్‌విండో మంచినీటి పథకాలు, 29 మల్టీ విలేజీ స్కీమ్‌లు పనిచేస్తున్నాయి. వీటితోపాటు మరో 17280 చేతి పంపులు కూడా ఉన్నాయి. వీటి ద్వారా జిల్లాలోని వివిధ గ్రామ పంచాయతీలకు, కుగ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కాగా, ఇంకను 1600 గ్రామాలకు రక్షిత నీరు దొరక్క అవస్థలు పడుతున్నారు.వాటిలో 700 గ్రామాలు గిరిజన ప్రాంతంలో ఉండటం గమనార్హం. గత ఏడాది పాచిపెంట మండలంలోని మాలమామిడి, రొడ్డవలస గ్రామాల ప్రజలు నీటి కోసం ఇక్కట్లు పడ్డారు. గత ఏడాది నీటి ఎద్దడి నెలకొన్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని సరైన చర్యలు చేపట్టినట్టు ఎస్‌ఇ రమణమూర్తి తెలిపారు. మంచినీటి ఎద్దడి తలెత్తితే వెంటనే మోనిటరింగ్ సెల్‌కు సమాచారం అందించాలని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా జిల్లాలో నిర్మాణంలో ఉన్న సిపిడబ్ల్యు పథకాలను మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎస్‌ఇ ఎన్‌వి రమణమూర్తి చెప్పారు. ప్రస్తుతం నాలుగు పథకాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వాటిలో ఎస్‌కోట సిపిడబ్ల్యు పథకం ద్వారా 302 గ్రామాలకు తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ ఏడాది వేసవిలోగా నిర్మాణమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉండగా పాచిపెంట సిపిడబ్ల్యు పథకం ద్వారా 97 గ్రామాలకు, దత్తిరాజేరు సిపిడబ్ల్యు పథకం ద్వారా 65 గ్రామాలు, పార్వతీపురంలోని జమద సిపిడబ్ల్యు పథకం ద్వారా 18 గ్రామాలకు తాగునీరు అందించనున్నారు. ఈ పథకాలను ఈ ఏడాది మార్చిలోగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు ఎస్‌ఇ రమణమూర్తి వెల్లడించారు.
మంచినీటి ఎద్దడి ఉంటే సమాచారమివ్వండి
మంచినీటి ఎద్దడి తలెత్తితే సమాచారం అందిస్తే వెంటనే వాటిని సరిచేస్తామని ఎస్‌ఇ రమణమూర్తి తెలిపారు. జిల్లాలో ఎక్కడ మంచినీటి ఎద్దడి తలెత్తినా, చేతి పంపులు, సిపిడబ్ల్యు పధకాలు పనిచేయకపోయినా వెంటనే మోనిటరింగ్ సెల్ నెం.9100121711 సమాచారం అందించాలని ఆయన స్పష్టం చేశారు.

వృద్ధురాలిని హత్య చేసిన నిందితులను
పట్టుకుంటాం
* డిఎస్పీ ఎ.వి.రమణ

వేపాడ, ఫిబ్రవరి 10: మండలంలోని వేపాడ గ్రామంలో హత్యకు గురైన కనిమిరెడ్డి గౌరమ్మ(72) కేసులో నిందితులను పట్టుకొని తీరుతామని విజయనగరం డిఎస్పీ ఎ.వి.రమణ స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి మృతురాలి కుమారులు ఈశ్వరరావు, గోవిందలతోపాటు వారి భార్యలను కూడా శుక్రవారం వల్లంపూడి పోలీసు స్టేషన్‌లో విచారించారు. అనంతరం డిఎస్పీ రమణ , ఎస్.కోట సిఐ బండారు రమణమూర్తి స్థానిక ఎస్సై ఎస్. కృష్ణమూర్తి తదితరులతో దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు గౌరమ్మ నివాసముంటున్న ఇల్లంతా కలియతిరిగి నిశితంగా పరిశీలించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని శవాన్ని మూట గట్టి ఉంచిన బాత్‌రూమ్‌ను పరిశీలించారు. అలాగే దొంగిలించగా మిగిలి ఉన్న బంగారం, నగదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. హత్య జరిగిన ఇంటిలోకి దుండగులు ఏ విధంగా ప్రవేశించి ఉంటారు. లోపలకి రావడానికి ఉన్న దారులను, ఏ టైమ్‌లో హత్య జరిగి ఉంటుంది, ఎంత మంది ఈ హత్యకు కారకులై ఉంటారు, చివరి సారిగా మృతురాలు గౌరమ్మను ఎపుడు చూశారు. మృతి చెందినట్లు ఎప్పుడు ఎలా తెలిసింది అన్న కోణంలో డిఎస్పీ రమణ క్షుణ్ణంగా పోలీసుల నుంచి స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ స్థానికులే తెలివిగా ఈ హత్య చేశారు. తప్ప స్థానికేతరులు కాకపోయి ఉండవచ్చని అన్నారు.
మృతురాలికి ఎవరైనా బాకీ ఉన్నారా? కుటుంబ సభ్యులతో ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా ఈ ప్రాంతంలో ఇటీవల అపరిచిత వ్యక్తులెవరైనా సంచరించారా అన్న కోణంలో కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ వెల్లడించారు.
కాగా అదే వీధిలో హత్యకు నాలుగురోజుల ముందు జరిగిన వివాహ వీడియోలను స్టేషన్ సిసి కెమెరాల పోటోలను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అలాగే మృతురాలి బట్టలు ఉతికే చాకలి కుటుంబాన్ని కూడా విచారించి పలు అనుమానాలను పోలీసులు నివృత్తి చేసుకున్నారు.