విజయనగరం

కిడ్నీ వ్యాధులపై సిపిఐ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 12: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై సిపిఐ సర్వే చేపట్టనుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వెల్లడించారు. ఆదివారం రాత్రి ఇక్కడ అమర్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్దానంలో దాదాపు 40 శాతం మంది ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధ పడుతున్నారని అన్నారు. భూగర్భ జలాలలోని మూలకాల వల్లనే ఈ వ్యాధి కలుగుతుందని భావిస్తున్నామన్నారు. భూమిలోపల 40-50 అడుగులు దాటిన తరువాత వచ్చే నీటి వల్ల ఎక్కువ మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని తెలుస్తుందన్నారు. అయితే దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిపి కిడ్నీ వ్యాధులను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, దీనిపై డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. ఆ వ్యాధితో బాధపడే అవసాన దశలో ఉన్నవారికి కొద్ది రోజులు ఊరటనిస్తుందే తప్ప, మూలాలు వెతికి వాటిని అరికట్టడానికి డయాలసిస్ కేంద్రాలు ఏవిధంగా ఉపయోగపడవన్నారు. నిర్ధిష్ట ప్రణాళికతో కిడ్నీ వ్యాధులను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. పలాసాలో నెఫ్రాలజీ, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి పరిశోధనలు జరిపితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు సుందర్‌లాల్, బుగత సూరిబాబు, బుగత అశోక్, ఆల్తి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

చెట్టును ఢీకొన్న మోటారు బైకు..

ఇద్దరు విద్యార్థులు మృతి

గుమ్మలక్ష్మీపురం, ఫిబ్రవరి 12: మండలంలోని తాడికొండ గ్రామంలో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఎల్విన్‌పేట పోలీసులు అందించిన వివరాల మేరకు శనివారం రాత్రి తాడికొండ గ్రామంలో జరుగుతున్న అర్థనారీశ్వరి యాత్రను తిలకించేందుకు ఎల్విన్‌పేట గ్రామం నుంచి బిడ్డిక లోకేష్, గంటా డానియేల్, బిడ్డిక రంజిత్‌కుమార్‌లు ఆర్టీసి బస్సులో తాడికొండ వెళ్లారు. అక్కడ యాత్రను చూసుకుని ఆదివారం వేకువజామున తన స్నేహితుని వద్ద ఉన్న మోటారుబైకును తీసుకుని తాడికొండ నుంచి స్వగ్రామమైన ఎల్విన్‌పేట గ్రామానికి మోటారుబైక్‌పై వస్తుండగా తాడికొండ గ్రామసమీపంలో ఉన్న చింతచెట్టును ఢీకొట్టారు. ఈ సంఘటనలో బిడ్డిక లోకేష్ (12), జి.డానియేల్ (15)లు అక్కడికక్కడే మృతిచెందగా బైకు నడుపుతున్న బి.రంజిత్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన రంజిత్‌కుమార్‌ను 108వాహనంలో భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మృతిచెందిన బిడ్డక లోకేష్ 7వ తరగతి, డానియేల్ 10వ తరగతి గుమ్మలక్ష్మీపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. బిడ్డిక రంజిత్‌కుమార్ తండ్రి రెండేళ్లక్రితం మృతిచెందాడు. గంటా డానియేల్ తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే మృతిచెందడంతో అతని మేనత్త సరళ వద్ద నివాసం ఉంటున్నాడు. యాత్రకువెళ్లి మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదం సంఘటనను తెలుసుకున్న ఎల్విన్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. ఎల్విన్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పురిటిలోనే శిశువుకన్నుమూత
* ఘోషాలో ఘటన
విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 12: జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్యకేంద్రంలో డెలివరీ సమయంలో వైద్యులు సరైన చర్యలు తీసుకోకపోవడం వలనే తమ బిడ్డ పురిటిలోనే చనిపోయిందని బందువుల ఆరోపణలతో ఆదివారం ఉదయం ఘోషాసుపత్రి వద్ద కొంత సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లా రామభద్రపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన గర్భిణీ కర్రి పద్మావతిని ఆమె భర్త ఈనెల ఆరవ తేదీన ఘోషాసుపత్రిలో జాయిన్ చేసారు. ఆమెకు ఈనెల 10న డెలివరీ డేట్‌గా డాక్టర్లు తెలిపారు. ముందుగానే ఆమె ఆసుపత్రిలో చేరడం నాలుగురోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంది. 10న ఆమెకు నొప్పులు రాకపోవడంతో 11న పురిటి నొప్పులు రావడానికి ఇంజక్షన్ చేసారని నొప్పులు మొదలవడంతో ఆమెకు డెలివరీ చేయడానికి ఏర్పాట్లు చేసి నొప్పులు డెలివరీకి తగినంతగా లేవని మూడుమార్లు డెలివరీ రూమునుండి వెనక్కి తీసుకువచ్చారని బాధితులు ఆరోపించారు. మధ్యాహ్నం వరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ పర్యవేక్షణ చేసి ఆ తరువాత ఉషా అనే డ్యూటీ డాక్టర్ చూసారని చెప్పారు. అయితే రాత్రి మూడు గంటలకు బిడ్డ ఉమ్మనీరు తాగిందని అప్పటికపుడు సిజేరియన్ చేసారని అయినా బిడ్డ బతకలేదని వాపోయారు. ముందుగానే సరైన వైద్యం అందించి ఉంటే తమ బిడ్డ బతికే వాడని బాధితురాలి భర్త మాధవరావు వాపోయాడు. ఈవిషయం తెలుసుకున్న సిపిఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి శంకరరావు, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు రమణమ్మలు అక్కడకు చేరుకుని వైద్యుల నిర్లక్ష్యం వలనే బిడ్డ చనిపోయిందని ఆరోపించారు. ముందుగా స్పందించి ఉంటే బిడ్డ బతికేదని పేర్కొన్నారు. నార్మల్ డెలివరీ వస్తుందని చెప్పారని అయితే నొప్పులు అంతగా లేవని చెప్పారని ఆరోపిస్తూ సరైన వైద్యం అందించలేదని ఆందోళనకు దిగారు. డ్యూటీ డాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. బంధువులు, ప్రజాసంఘాల నాయకుల ఆందోళనతో కొంతసేపు ఆసుపత్రి ఆవరణలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. కాగా కొద్దిసేపటి తరువాత అక్కడికి చేరుకున్న ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ విఎస్ ప్రసాద్ సంఘటనపై ఆరా తీసారు. బంధువులు, భర్త మాధవరావుతో మాట్లాడారు. సంఘటన చోటుచేసుకోవడం వెనుక కారణాలు తెలుసుకుంటామని కమిటీ వేసి విచారణ చేస్తామని చెప్పారు. లేదా పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. విచారణకు బంధువులు, భర్త అంగీకరించడంతో వారి ఫిర్యాదు తీసుకున్నారు. విచారణలో వెలుగుచూసిన నిజాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.

పేదల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

సి.పి.ఐ. జాతీయ కార్యదర్శి నారాయణ

రామభద్రపురం, ఫిబ్రవరి 12: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తు భూస్వాములకు కొమ్ము కాస్తున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. విజయనగరం జిల్లా రామభద్రపురంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. టిడిపి అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్న ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. భూసేకరణ పేరుతో బూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కొని రైతుల నడ్డివిరిచిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. ఎన్నో ఏళ్ల నుంచి భూములను సాగుచేస్తున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వకుండా సంపన్నవర్గాలకే కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. గిరిజనుల సాగుచేస్తున్న భూములకు చట్ట్భద్రత కల్పించి వెంటనే పట్టాలు ఇవ్వకపోతే సిపిఐ ఆద్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. రామభద్రపురం రొంపల్లివలస గిరిజన గ్రామంలో 362 సర్వేనెంబరు 100 ఎకరాలు రిజర్వు ఫారెస్టు భూమిని ఎన్నో ఏళ్లు నుంచి గిరిజనులు సాగుచేస్తున్నప్పటికీ వీటికి పట్టాలు ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు భూస్వాములతో కుమ్మక్కై గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఈ సమస్యలను జిల్లా అధికారులు పరిష్కరించకపోతే రెవెన్యూ కార్యాలయం ఎదుట సి.పి.ఐ. నాయకులు ఆందోళన చేపడతారని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్‌పై సీతకన్ను చూపిస్తున్నారని, ప్రత్యేక హోదా విషయంపై వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడులు తీవ్ర అన్యాయం చేశారని, వీరు మోదీ జపం చేస్తు పదవుల కోసం తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టారన్నారు. ప్రత్యేక హోదా కోసం సి.పి.ఐ. ఎంతటి పోరాటాలకైన వెనుకాడబోమని తెలిపారు. ఇప్పటికైన ఎన్.డి.ఏ. ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో సంక్షోభానికి కేంద్రప్రభుత్వం భారతీయ జనతాపార్టీ లబ్ధికోసం సమస్యలు సృష్టిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైన రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఆ సంక్షోభానికి తెరదించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లాకార్యదర్శి కామేశ్వరరావు, జిల్లా నాయకులు కృష్ణంరాజు, అప్పలనాయుడు, బుగత అశోక్, ఆనందరావు, ఒమ్మిరమణ, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు అందుబాటులోకి సరకు రవాణా సేవలు
* ఆర్టీసీ కమర్షియల్ మేనేజర్ రమేష్

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 12: ఆర్టీసీలో సరకు రవాణా,పార్శిల్, కొరియర్ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ విజయనగరం రీజియన్ కమర్షియల్ మేనేజర్ కె.రమేష్ తెలిపారు. ఆదివారం ఇక్కడ విలేఖరులతో ఆయన మాట్లాడుతూ అతి తక్కువ ఖర్చుతో భద్రంగా, వేగంగా సరకు రవాణా చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడికైనా 24 గంటలలో సేవలు అందుతాయని చెప్పారు. ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులు తిరుగుతున్న ఇతర రాష్ట్రాలకు సరకు రవాణా చేస్తామన్నారు. అదేవిధంగా నిర్ణయించిన ప్రాంతాలకు డోర్ డెలివరీ సదుపాయం కూడా ఏర్పాటు చేశామన్నారు. విజయనగరం రీజియన్ పరిధిలో పార్శిల్ రవాణా ద్వారా ఇంతవరకు 60 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించామని తెలిపారు. దీనిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయనగరం, ఎస్.కోట, సాలూరు, పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం డిపో-1, శ్రీకాకుళం డిపో-2, టెక్కలి, పలాస డిపోల నుంచి ఇతర ప్రాంతాలకు సరకు రవాణాతోపాటు పార్శిల్, కొరియల్ సేవలను అందిస్తున్నామని తెలిపారు. పార్వతీపురం నుంచి కాకినాడ, విజయవాడ, అమలాపురం తదితర ప్రాంతాలకు కాంట్రాక్ట్ పద్ధతిలో లగేజి కోసం బస్సులను అనుమతి ఇస్తామన్నారు. ఆల్ట్రాడీలక్స్, సూపర్‌లగ్జరీ, ఇంద్రబస్సులలో కూడా సరకు రవాణా చేసుకోవచ్చునని తెలిపారు. గుమ్మలక్ష్మీపురం పరిసర ప్రాంతాల ప్రజానీకం కోసం గుమ్మలక్ష్మీపురంలో బుకింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్‌ఎం కార్యాలయం పర్సనల్ అధికారి ముత్తిరెడ్డి సన్యాసిరావుతదితరులు పాల్గొన్నారు.

శిథిలావస్థలో మున్సిపల్ ఉద్యోగుల భవనం

విజయనగరం (్ఫర్టుం), ఫిబ్రవరి 12: విజయనగరం మున్సిపల్ ఉద్యోగుల సంఘ భవనం దిక్కులేని అనాథలా ఉంది. శిధిలావస్ధకు చేరుకున్న ఈ భవనాన్ని గత కొనే్నళ్ల నుంచి వినియోగించడంలేదు. నిరుపయోగంగా ఉన్న ఈ భవనం కూలడానికి సిద్ధంగా ఉంది. ఉద్యోగ సంఘ కార్యకలాపాలకు స్వంత భవనం లేకపోవడం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ప్రకాశం పార్కులో చాలా ఏళ్ల క్రితం సంఘ భవనాన్ని నిర్మించారు. అయితే భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో దీనిని వినియోగించడంలేదు. మున్సిపల్ గెస్ట్‌హౌస్ లేకపోవడం వల్ల ఇప్పటికే అధికారులు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే సంఘ భవనం కూడా లేకపోవడం బాధాకరమని వారు వాపోతున్నారు. ఈ నేపధ్యంలో పాడైన భవనాన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలని విజయనగరం మున్సిపల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.అప్పయ్యశెట్టి, ఉపాధ్యక్షుడు అప్పలరాజు కొద్దిరోజుల క్రితం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణను కోరారు. ఈ మేరకు చైర్మన్‌తోపాటు మున్సిపల్ కమిషనర్ నాగరాజుకు వినతిపత్రాలను అందజేశారు. ఇప్పకైనా భవన నిర్మాణ పనులు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.

బార్ అండ్ రెస్టారెంట్‌కు అనుమతి ఇస్తే

ఆందోళన

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 12: పట్టణంలో వుడాకాలనీ అయ్యన్నపేట రోడ్డులో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణకు అనుమతులు ఇస్తే ఆందోళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బాయి రమణమ్మ హెచ్చరించారు. మద్యం షాపుల ఏర్పాటుకు నిరసనగా ఆదివారం వుడాకాలనీ పార్కులో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమణమ్మ మాట్లాడుతూ జనావాసాల మధ్య మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తే ఒప్పుకునే ప్రసక్తిలేదని చెప్పారు. ఇప్పటికే కాలనీ ప్రవేశంలో రోడ్డు పక్కన ఒక మద్యం షాపు ఉందని, దీనివల్ల మహిళలు, విద్యార్థినులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనికితోడు ఇదే ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే మరిన్ని అవస్థలు పడతారని తెలిపారు. ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆమె హెచ్చరించారు. అందువల్ల జిల్లా యంత్రాంగం తక్షణమే ఈ ఆలోచనను విరమించుకోవాలన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ నివాస ప్రాంతాలలో మద్యం షాపులను ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల జీవన విధానానికి భంగం కలుగుతుందన్నారు. బార్ అండ్ రెస్టారెంట్ వల్ల వుడాకాలనీ ఫేజ్-3, 4లలో వందలాది మహిళలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, దీనికితోడు అదే ప్రాంతంలో కళాశాలల బస్సులకు బస్ట్ఫా ఉండటం వల్ల విద్యార్థినులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వన్‌టౌన్ సిఐ శోభన్‌బాబుకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

మహిళాశక్తిని చాటిన సదస్సు

* జిల్లా నేతలు

విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 12: మూడురోజులుపాటు రాజధాని నగరంలో నిర్వహించిన జాతీయ మహిళా సదస్సులో అనేక అంశాలు చర్చకు వచ్చాయని ఇటువంటి సదస్సులు పాల్గొనడం గొప్పవిషయమని జిల్లా మహిళా నేతలు హర్షం వ్యక్తం చేసారు. ఎందరో మహిళలు వారు ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్న తీరును తెలుసుకో గలిగామని, ఈ సదస్సు మంచి స్ఫూర్తిని ఇచ్చిందని ముగింపు వేడుకల్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుచేతులమీదుగా సత్కారం అందుకున్న జడ్పీచైర్‌పర్సన్ స్వాతిరాణి అన్నారు. ఈసదస్సుకు జిల్లా నుండి హజరైన వారిలో ఎమ్మెల్సీ సంధ్యారాణి, ఎమ్మెల్యేలు కోళ్లలలితకుమారి, మీసాలగీత తదితరులు ఉన్నారు.