విజయనగరం

పట్టణవాసులకు పందుల బెడద ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 17: రాజరిక కాలంలో రాజధానిగా విలసిల్లిన విజయనగరం పట్టణం నేడు పందులకు ఆవాసంగా మారింది. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకుంటే పందులు అక్కడ తిష్టవేస్తున్నాయి. పందుల బెడద లేని వార్డు అంటూ ఏది లేదంటే అవి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక శివారు ప్రాంతాలు చెప్పాల్సిన అవసరం లేదు. పందులను నివారించాల్సిన మున్సిపల్ అధికారులు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారు. ప్రజల నుంచి ముక్కు పిండి పన్ను వసూళ్లు చేస్తున్న మున్సిపల్ శాఖ పందుల బెడదను నివారించేందుకు సరైన చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో నడిబొడ్డు నుంచి ఎక్కడ చూసినా పందులు దర్శనమిస్తుంటాయి. ప్రజల నివాసాలకు దూరంగా పందుల పెంపకం ఉండాలన్న కనీస విజ్ఞతను మరచిపోవడంతో పందుల పెంపకం దారులు విజృంభిస్తున్నారు. పట్టణంలో పందుల బెడదను నివారించాలని పట్టణ ప్రజలు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. మున్సిపల్ అధికారులు చేష్టలుడిగి చోద్యం చూస్తుండటంతో పందుల పెంపకందారులు విజృంభిస్తున్నారు. దీంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న వారు కూడా మెదడు వాపు వ్యాధి, ఇతర రకాల వ్యాధులకు గురవుతున్నారు. దీంతో అపార్ట్‌మెంట్లలో నివసించేవారు కూడా వ్యాధుల బారిన పడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
ఇదిలా ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలని పదేపదే చెబుతున్నప్పటికీ ఇక్కడి అధికారులు మాత్రం దానిని సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. దీంతో ఏతావాత అదే పంధాలో నడుస్తున్నారు. గతంలో మున్సిపల్ కమిషనర్లు పందుల బెడదను నివారించేందుకు పందులు కన్పిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేయడంతో పందుల పెంపకం దారులు వాటిని పట్టణానికి దూరంగా పెంచుకునేవారు. ఆ తరువాత నుంచి పందుల పెంపకం దారుల పట్ల మున్సిపల్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో వారు వాటిని పట్టణం నడిబొడ్డున విడిచిపెట్టడం గమనార్హం.

నెల రోజుల్లో నివారిస్తా: కమిషనర్

పట్టణంలో పందుల బెడదను నెల రోజుల్లో నివారిస్తాం. పందుల కోసం కొత్తపేట శివారు ప్రాంతంలో స్థలం కేటాయించి వాటిని అక్కడకు తరలించాలన్న యోచనలో ఉన్నాము. స్థలానికి ప్రహరీగోడ నిర్మించాల్సి ఉంది.
- నాగరాజు
మున్సిపల్ కమినర్
పోలీసు సహకారం అందిస్తా:ఎస్పీ

పందుల బెడదను నివారించడానికి తాను పూర్తి సహకారాన్ని అందిస్తానని జిల్లా ఎస్పీ ఎల్‌కెవి రంగారావు అన్నారు. చరిత్రలో పేరుగాంచిన విజయనగరం పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. గతంలో తాను పందుల బెడద నివారణకు షూటర్లను ఇప్పిస్తానని మున్సిపల్ అధికారులకు స్పష్టం చేసిన వారి నుంచి సరైన స్పందన రాలేదన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందిస్తే పట్టణ ప్రజలకు మేలు కలుగుతుంది.
-ఎల్‌కెవి రంగారావు
జిల్లాఎస్పీ

వంద రోజుల పనిదినాలు కల్పించాలి
* పిఆర్ కమిషనర్ రామాంజనేయులు

విజయనగరం, ఫిబ్రవరి 17: ఉపాధి కూలీలకు వంద రోజుల పని దినాలు కల్పించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఉపాధి హామీ అనుసంధానంతో చేపట్టిన పనులు, తాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పనుల ప్రగతి, గ్రామ పంచాయతీలలో పన్ను వసూళ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ ఆదా తదితర అంశాలపై ఆయన జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్‌తో కలసి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనుల కల్పనలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ఈఏడాది 1.53 కోట్ల పనిదినాలు కల్పించి రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జాబ్‌కార్డు ఉన్న వారందరికీ వంద రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. లేనిచో 90 రోజులైన పని కల్పించాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఫారం పాండ్స్ 12651 వెంటనే పూర్తి చేయాలన్నారు. 2257 పిట్ పనులు, 14635 ఇంకుడు గుంతలు, ఒడిఎఫ్‌లో 9059 వ్యక్తిగత మరుగుదొడ్ల పనులు పూర్తి చేయాలన్నారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్‌లో 3474 పనులను పూర్తి చేసి లబ్ధిదారుల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో రెండేళ్లలో 45 లక్షల మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారన్నారు. ఉపాధి హామీ పనుల వివరాలను ఎప్పటికపుడు అప్‌లోడ్ చేయాలన్నారు. ఎన్‌టిఆర్ జలసిరి-2 కింద దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ బోర్లు మంజూరు చేయాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐదువేల బోర్లు వేయాల్సి ఉండగా 1853 బోర్లు వేసి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచామని డ్వామా పిడి ప్రశాంతి తెలిపారు.

తాగునీటి ఎద్దడి ఉంటే ఎఇలదే బాధ్యత

వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఎఇలదేనని పిఆర్ కమిషనర్ బి.రామాంజనేయులు స్పష్టం చేశారు. జిల్లా నీటిపారుదల ప్రణాళికలో తాగునటి ప్రాజెక్టులకు ప్రతిపాదనలుస గ్రామమీణ నటి ససరఫరా ఇంజనర్ల్లు కలెక్టర్‌కు అందజేయాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, స్వచ్ఛ్భారత్ మిషన్ ద్వారా చేపడుతున్న వ్యక్తిగత మపరుగుదొడ్ల పనుల వివరాలు మండల స్థాయిలో నిక్ష్పిత్తం చేయడానికి మండలానికి ఒక కంప్యూటర్ డేటా ఆపరేటర్‌ను నియమిస్తున్మాన్నారు. జిల్లాలో వచ్చే నెల 1 నుంచి క్రాష్ కార్యక్రమం చేపట్టి తాగునీటి పథకాలు, బోర్ల పరిస్థితిని తెలుసుకునేందుకు గ్రామీణ నటిసరఫరా ఇంజరుల్ల, బోరు మెకానిక్‌లు గ్రామాల్లో పర్యటిగంచి తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు.

పారిశుద్ధ్యం నిర్వహణ పంచాయతీలదే

జిల్లాలో 921 గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం నిర్వహణ పంచాయతీలదేనని కమిషనర్ రామాంజనేయులు స్పష్టం చేశారు. గ్రామాలభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న గ్రాంట్లు, 14వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో 175 గ్రామ పంచాయతీలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పనులు మంజూరయ్యాయని, పనులు పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా పిడి ప్రశాంతి, జెడ్పి సిఇఒ రాజకుమారి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రమణమూర్తి, ఇఇ గాయత్రిదేవి, డిఇఇలు, ఎఇలు పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు పకడ్భందీ చర్యలు

* ఈస్ట్‌కోస్ట్ రైల్వే జిఎం ఉమేష్‌సింగ్

గజపతినగరం, ఫిబ్రవరి 17: రైల్వే ప్రమాదాల నివారణకు పకడ్భందీగా చర్యలు తీసుకుంటున్నామని ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఉమేష్‌సింగ్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం గజపతినగరం రైల్వేస్టేషన్‌ను జిఎం ఉమేష్‌సింగ్ తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల కూనేరు వద్ద హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురికావడం దురదృష్టకరమన్నారు. దీనిపై సిఆర్‌ఎస్ దర్యాప్తు జరుపుతుందని, వారి నుంచి నివేదిక అందగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా రైల్వేలైన్ లింక్ ప్రాంతాలలో వెల్డింగ్‌లు లేకుండా సాంకేతిక సిబ్బంది సహకారంతో మరో సారి పర్యవేక్షణ చేయాలని రైల్వే సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రైల్వే క్వార్టర్స్‌ను నిశితంగా పరిశీలించారు. మంచినీటి సదుపాయం, కనీస వౌలిక వసతులు అందుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. తమకు ఎటువంటి సమస్యలు లేవని రైల్వే సిబ్బంది కుటుంబసభ్యులు తెలియజేయడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రైల్వే క్వార్టర్స్ ఆవరణలో ఏర్పాటుచేసిన పిల్లల పార్కును ఆయన ప్రారంభించారు. అనంతరం పార్కులో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ, జిఎం కార్యదర్శి పురోహిత్, సిఎఒ ఆర్‌ఎస్ పాత్రో, సిఒ మేనేజర్ జిసి రాయ్, సిపిఒ మంజురాయ్, రైల్వేస్టేషన్ మాస్టర్లు కె.మురళీకృష్ణ, కె.ఆనందకుమార్, ఎంఎస్‌వి నారాయణ, టిఎస్ రావు, జిఎ రాజు, ఆర్.ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జోరుగా భవనాల తొలగింపు పనులు

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 17: పట్టణంలో రోడ్ల విస్తరణలో భాగంగా భవనాల తొలగింపుచురుకుగా జరుగుతోంది. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలతోపాటు నిర్థేశించిన మేరకు భవనాలను కూడా తొలగిస్తున్నారు. పట్టణంలో గత రెండేళ్ల నుంచి రోడ్ల విస్తరణ, అభివృద్ధిపనులు నిలిచిపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఎట్టకేలకు రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. పట్టణంలో కోట జంక్షన్ నుంచి లయన్స్ కమ్యూనిటీ హాలు మీదుగా ఐస్ ఫ్యాక్టరీ వరకు, సింహాచలం మేడ నుంచి బాలాజీ జంక్షన్ వరకు, అంబటిసత్రం జంక్షన్ నుంచి కొత్తపేట నీళ్లట్యాంకు వరకు, కోట జంక్షన్ నుంచి గుచీ మీదు దాసన్నపేట రైతుబజారు వరకు, మయూరి జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు, నాయుడు ఫంక్షన్‌హాలు నుంచి కంటోనె్మంట్ హోల్‌సెల్ బట్టల మార్కెట్ మీదుగా కలెక్టరేట్ జంక్షన్ వరకు, మయూరి జంక్షన్ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా నాయుడు ఫంక్షన్ హాలు వరకు రోడ్ల విస్తరణ, అభివృద్ధిపనులు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఆర్ అండ్ బి, ట్రాన్స్‌కో,వుడా, మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో రోడ్ల విస్తరణ పనులు ముందుకు సాగలేదు. ఈ నేపధ్యంలో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, ఎమ్మెల్యే మీసాల గీత, జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ ఎప్పటికప్పుడు సమీక్షించడంతో రోడ్ల అభివృద్ధిపనులకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా ప్రతి నిత్యం రద్దీగా ఉండే కోట జంక్షన్ నుంచి ఐస్ ఫ్యాక్టరీకి వెళ్లే రోడ్డులో భవనాల తొలగింపుజరుగుతుండటంతో విస్తరణపనులకు మార్గం సుగమం ఏర్పడినట్లయింది. శిథిలాల తొలగింపును మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్లు వి.శోభన్‌బాబు, కె.హరిదాస్ తదితరులు పాల్గొన్నారు.

చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం
* జెడ్ సర్ట్ఫికెట్ అవగాహన సదస్సులో జి ఎం భాస్కర్

విజయనగరం(టౌన్),్ఫబ్రవరి 17: కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నతరహా పరిశ్రమలను అన్ని విధాల ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నాయని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ భాస్కర్ వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ ప్రైవేటు హోటల్‌లో ఎపి ఛాంబర్ ఫెడరేషన్, విజయనగరం వాణిజ్యమండలి ఆధ్వర్యంలో సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల యజమానులతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన జెడ్ సర్ట్ఫికెట్ నిబంధనలు, వాటివలన చిన్నతరహా పరిశ్రమలకు చేకూరే ఆర్ధికప్రోత్సాహకాలు అనే అంశంపై పరిశ్రమల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఈసదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చిన్న తరహా యూనిట్ల ఉత్పత్తులకు తగు ప్రాధ్యాన్యత కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిన్న పరిశ్రమలకు అవసరమైన ప్రోత్సహకాలు అందించాలని ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసారు. ఇందులో భాగంగా ఇతర ప్రాంతాల్లో తయారైన ఉత్పత్తులకు కాకుండా స్ధానికంగా ఉత్పత్తులు ప్రోత్సహించడానికి తగు చర్యలు చేపడతామని అన్నారు. ప్రధానిమోడీ ఆలోచలనలతో రూపుదాల్చిన జెడ్ సర్ట్ఫికెట్ ఇక నుండి సూక్ష్మ, మధ్యతరహా, చిన్న తరహా పరిశ్రమలకు ముఖ్యమని చెప్పారు. ఇందులో ఐదు కేటగిరిల్లో గుర్తింపు ఇస్తారని తెలిపారు. కనీసం 2.2 పాయింట్లు వస్తేనే మొదటి కేటగిరిలో రజత కేటగిరి, రెండో కేటగిరిలో వెండి, మూడో కేటగిరిలో ఉన్న వారికి బంగారు, ఆతరువాత డైమండ్, ఐదవ కేటగిరిలో ఉన్న వారికి ప్లాటినం గుర్తింపు ర్యాంకు ఉంటుందని చెప్పారు. 50 పారామీటర్‌లు ఇందుకు జెడ్ సర్ట్ఫికెట్ విభాగం నిర్ధేశించిందని చెపుతూ కనీసం 30 నిబంధనలు పాటించాలని , ఇందులో 20 నిబంధనలు భధ్రత, పర్యావరణం ఇతర అంశాలు తప్పనిసరిగా పరిశ్రమల యాజమాన్యాలు పాటించాలని చెప్పారు. కేటగిరిలో ముందు ఉన్న వారికి పోటీ రంగంలో వ్యాపారం అందిపుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాగే చిన్నతరహా పరిశ్రమలకు పలు రాయితీలు లభిస్తాయని వివరించారు. ఆన్ లైన్‌లో ఉద్యోగ్ యూనిక్ ఐ డి నెంబర్ ద్వారా నమోదు చేసుకుని స్వంతంగా ఏ ర్యాంకులో ఉన్నదీ బేరీజు వేసుకునే అవకాశం ఇందులో ఉందని క్వాలిటీ కౌన్సిల్ డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. 494 కోట్ల రూపాయలు వచ్చే ఏడాదిలో 22,222ల యూనిట్లు జెడ్ సర్ట్ఫికెట్‌లోకి తీసుకరావాలని భావిస్తున్నామని చెప్పారు. వచ్చే పదేళ్లలో 1.25 లక్షల పరిశ్రమలు ఇందులోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో ఈ జెడ్ (జీరో డిఫెక్ట్- జీరో ఎఫెక్టు ) సర్ట్ఫికెట్ అన్ని పరిశ్రమలకు తప్పనిసరని తెలిపారు. ఈసదస్సులో వాణిజ్యమండలి అధ్యక్షుడు ఎం విచలం, ఎపి ఛాంబర్ ఫెడరేషన్ డైరెక్టర్ జి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

సమర్ధవంతమైన వైద్య సేవలకు కాయకల్ప గుర్తింపు

* రెండో సారి అవార్డు దక్కించుకున్న
జిల్లా కేంద్ర ఆసుపత్రి

విజయనగరం(టౌన్),్ఫబ్రవరి 17: కాయకల్ప అవార్డు గుర్తింపు రెండో విడత కూడా జిల్లా కేంద్ర ఆసుపత్రికి రావడం ద్వారా మరింత బాధ్యత పెరింగిందని జిల్లా ఆసుపత్రుల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ వి ఎస్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి లభించిన అవార్డును ప్రదర్శించారు. ఈ అవార్డుకింద జిల్లా కేంద్ర ఆసుపత్రికి 50 లక్షల రూపాయల ప్రోత్సాహక నిధులు అందుతాయని చెప్పారు. ఈ గుర్తింపు రావడానికి సమిష్టిగా కృషిచేసిన వైద్యులకు ఇతర సిబ్బందికి నిబంధనల మేరకు ప్రోత్సాహకాలు అందచేస్తామని తెలిపారు. కాగా గతంలో లభించిన ప్రోత్సాహక నిధులులో మిగిలిన మొత్తం బ్యాంకులో ఉందని అలాగే ఈ ఏడాది వచ్చే ప్రోత్సాహక నిధుల్లోంచి కూడా కొంత ప్రత్యేకించి నర్సింగ్ కాలేజి ఏర్పాటుచేయాలనే ఆలోచన ఉందని చెప్పారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని సూచనప్రాయంగా వెల్లడించారు. గత విడత అవార్డు రావడానికి పారామీటర్లలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి 94.5 పాయింట్లు వస్తే ఈ విడత 99.5 పాయింట్లు సాధించి మొదటి స్ధానం కైవసం చేసుకుందని ఈ అవార్డు దక్కడంలో అందరి భాగస్వామ్యం ఉందని కితాబు నిచ్చారు. పర్యావరణం,పారిశుధ్యం, ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి వైద్యసేవలు అందించంలో భాగంగా ఈగుర్తింపు లభించిందని వివరించారు. క్రిటికల్ కేర్ యూనిట్, ఎం ఆర్ ఐ సెంటర్ మంజూరు అయితే రిఫరల్ కేసులు లేకుండా అన్ని రకాల అత్యవసర వైద్య సేవలు అందించగలమని చెప్పారు. తక్కువ మంది డాక్టర్లు , సిబ్బంది ఉన్నప్పటికి మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతున్నామని అన్నారు. హుద్ హుద్ తుఫాను తరువాత ఆసుపత్రి రూపు రేఖలు మార్చి మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెట్టామని అవసరమై నిధులు మంజూరు చేయడంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లా మంత్రి మృణాళిని, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ వివేక్‌యాదవ్ పూర్తిగా సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈసమావేశంలో జిల్లా ఆసుపత్రులు సమన్వయాధికారి డాక్టర్ ఉషశ్రీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామరాజు, ఆర్ ఎం ఓ డాక్టర్ సత్యశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.