విజయనగరం

స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుతాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 14: స్వచ్ఛ భారత్ మిషన్, ఉపాధి హామీ పథకాల ద్వారా జిల్లాలో వంద గంటల్లో 10449 మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ఈనెల 10న ఉదయం 6 గంటలకు ప్రారంభించిన ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 10 గంటలతో ముగిసింది. ఈ సందర్భంగా విజయనగరం మండలం మరిశర్ల పంచాయతీ సుంకరిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా వంద గంటల్లో 10449 మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయగలిగామన్నారు. దీనిని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదు చేసేందుకు ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు పరిశీలించారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరో 20వేల మరుగుదొడ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ దఫా ప్రతి మండలం నుంచి మూడు గ్రామాలను ఎంపిక చేస్తామన్నారు. వాటిలో రెండింటిని స్వచ్ఛ భారత్ మిషన్ నిధులతోను, మరో గ్రామాన్ని ఉపాధి హామీ నిధులతో చేపడతామని వివరించారు. ఈ విధంగా వచ్చే ఏడాది నాటికి జిల్లాను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దగలమని ధీమా వ్యక్తం చేశారు. కాగా, వందగంటల్లో పదివేల మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి తాపిమేస్ర్తిలు, కూలీలు కలిపి 20వేల మంది వరకు పనిచేశారన్నారు. అలాగే మూడు వేల మంది అధికారులు, సిబ్బంది పనిచేశారని తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లాలో 34 మండలాల్లో ఒక్కొ మండలంలో రెండు గ్రామాలను ఒడిఎఫ్‌కు ఎంపిక చేసి ఆయా గ్రామాల్లో పదివేల మరుగుదొడ్లను నిర్మించినట్టు తెలిపారు. ఆ విధంగా 71 గ్రామాలు ఒడిఎఫ్ జాబితాలో చేరాయన్నారు. కాగా, ఒడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించినప్పటికీ ప్రజల్లో వాటిని వినియోగించేందుకు ఆయా గ్రామాల్లో నిఘా కమిటీలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. లబ్ధిదారులకు ప్రోత్సాహకాలను సకాలంలో అందజేసేందుకు స్ర్తి నిధి రుణాలు ఎంతగానో దోహదపడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ఏన్ వి రమణమూర్తి, ఒడిఎఫ్ నోడల్ అధికారి రాజకుమారి, జెసి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.