విజయనగరం

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, మార్చి 20: చెల్లెలను చూసేందుకు వెళుతున్న అన్నయ్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంఘటన విజయనగరం మండలం ఆర్‌కె టౌన్‌షిప్ సమీపంలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. బలిజిపేట మండలం నూకలపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వావిలాపురాంబాబు(30) ద్విచక్ర వాహనంపై నూకలపాడు నుంచి విశాఖపట్నం వెళుతుండగా విజయనగరం మండలం ఆర్‌కె టౌన్‌షిప్ సమీపంలోకి చేరుకునే సరికి విశాఖపట్నం నుండి పార్వతీపురం వెళుతున్న ఎక్స్‌ప్రెస్ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో రాంబాబు తల భాగం హెల్మెట్‌లో ఉండిపోగా మిగిలిన భాగం బస్సు కిందకు వెళ్లిపోయింది. ఈ సంఘటన చూపరులను కలచివేసింది. విశాఖలో గల చెల్లెలను చూసేందుకు వెళ్తూ రాంబాబు మృత్యువాత పడ్డాడు. మృతుడురాంబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మృత దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయనగరం రూరల్ ఎస్సై ఎస్.ఎస్. నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘కోడ్’ ముగిసింది!

విజయనగరం, మార్చి 20: ఉత్తరాంధ్ర పట్ట్భద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సోమవారంతో ముగిసింది. ఎన్నికల ఫలితాలు వెలువడటంతో కోడ్ ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. గత నెల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మరోపక్క నిధులు మంజూరైనప్పటికీ కొత్త పనులు చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో వివిధ విభాగాలకు గత నెలలో మంజూరైన నిధులను వినియోగించుకోలేని స్థితిలో ఉన్నారు. మరో పది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో అధికారులు హైరానా పడుతున్నారు.
ఇప్పటికే 13వ ఆర్థిక సంవత్సరం నిధులకు మార్చి నెలాఖరు వరకు గడువు విధించడంతో మున్సిపల్ సిబ్బంది నిధులు ఖర్చు చేయలేక చేతులెత్తేసే పరిస్థితి కన్పిస్తుంది. అలాగే పంచాయతీరాజ్ విభాగానికి మంజూరైన నిధులలో కొన్నింటికి ఈ నెలాఖరు వరకు గడువు విధించారు. ఈ విధంగా కేంద్రం మంజూరు చేసిన ఆ నిధులను ఖర్చు చేయలేని పక్షంలో వెనక్కి మళ్లించాలని స్పష్టం చేయడంతో అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఈ పరిస్థితిలో కోడ్ కూడా అడ్డంకిగా మారింది. ఎట్టకేలకు కోడ్ ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.