విజయనగరం

సొంతింటి కలను సాకారం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(పూల్‌బాగ్), మార్చి 24: పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు వీలుగా ప్రధాన మంత్రి ఆవాస్‌యోజనను అమలు చేసేందుకు 45 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, 15 బ్యాంకులతోపాటు పలు ఆర్థిక సంస్థలు నేషనల్ హౌసింగ్ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని బిజెపి జిల్లా కార్యదర్శి బవిరెడ్డి శివప్రసాదరెడ్డి అన్నారు. శుక్రవారం సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రెడిట్ లింక్ సబ్జిడీ స్కీమ్ కింద 12లక్షల వరకు వార్షిక ఆదాయం కలవారు తీసుకునే గృహ రుణాలలో నాలుగు శాతం మేర సబ్సిడీ లభిస్తుందని చెప్పారు. మధ్యతరగతి ప్రజలు ఈ సబ్సిడీలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణశాఖ అధ్యక్షుడు అచ్చిరెడ్డి, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు విద్యాస్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

గురజాడ రచనలు చైతన్య కరదీపికలు

విజయనగరం(పూల్‌బాగ్), మార్చి 24: మహాకవి గురజాడ అప్పారావు రాసిన రచనలు నిత్య చైతన్య కరదీపికలని ప్రేమ సమాజం అధ్యక్షుడు డాక్టర్ బి. ఎస్. ఆర్.మూర్తి అన్నారు. శుక్రవారం గురజాడ గృహంలో తిరుమల తిరుపతి దేవస్థానం సౌట్స్, గైడ్స్ యూనిట్ ప్రతినిధులకు ఆయన గురజాడ రచనల అనువాద ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ గురజాడ రచనలను ఆంగ్లం, కన్నడం, హిందీ భాషలలో అనువధించిన ప్రతులను గురజాడ గృహంలో భద్రపరిచామని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన వేదగిరి కమ్యూనికేషన్స్ అధినేత వేదగిరి రాంబాబు ఈ ప్రతులను ముద్రించి పాఠకులకు అందుబాటులో ఉంచారని పేర్కొన్నారు. ముందుగా గురడా కాంశ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టిటిడి స్కౌట్స్ గైడ్స్ విభాగం కన్వీర్ జయదేవ్, కోశాధికారి మోహనరెడ్డి, గురజాడ ఇందిరా పాల్గొన్నారు.