విజయనగరం

14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిధులు రెండో విడత కింద రూ.43.31 కోట్లు నిధులు విడుదలయ్యాయని ఇన్‌ఛార్జి డిపిఒ రాజకుమారి తెలిపారు. జిల్లాలో 29 సిపిడబ్ల్యుఎస్ పథకానికి, 16045 చేతి పంపుల నిర్వహణకు రూ.4.62 కోట్లు జిల్లా పరిషత్‌కు కేటాయించినట్టు తెలిపారు. మిగిలిన నిధులను గ్రామ పంచాయతీలకు ట్రెజరీల ద్వారా వారి వారి ఖాతాలకు సర్ధుబాటు చేశామన్నారు. సర్ధుబాటు చేసిన నిధుల్లో 50 శాతం నిధులను వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సరఫరాకు, పారిశుద్ధ్యం, ఎన్‌ఆర్‌ఇజిఎస్ కన్వర్జెన్సీ నిధులతో చేపట్టిన రోడ్ల నిర్మాణాలకు వెచ్చించాలన్నారు. మిగిలిన 30 శాతం నిధులు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామ పంచాయతీగా ప్రకటించిన తరువాత ఖర్చు చేయాలన్నారు. చెత్త నుంచి సంపద తయారు చేసుకున్న అనంతరం మిగిలిన 10 శాతం నిధులు వెచ్చించాలని ఆమె వివరించారు.

ఉగాది నాటికి మహిళా రుణాలు పూర్తి చేస్తాం

కొత్తవలస, మార్చి 24: ఉగాది పండగ నాటికి మహిళలకు అందజేయవలసిన రుణాలు వెలుగు ద్వారా అందజేస్తామని కొత్తవలస, ఎల్.కోట ఏపిఎంలు జి.శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావులు తెలిపారు. ఎస్.కోట నియోజకవర్గంలోని వేపాడ, ఎస్.కోట, జామి, ఎల్.కోట కొత్తవలస మండలాల్లోని సుమారు 2020 గ్రూపులకు 70కోట్ల మేర రుణాలు ఇప్పటి వరకు అందించామని చెప్పారు. గ్రూపు మొక్క సీనియర్టీని బట్టి ఉన్న పొదుపును బట్టి ఐదు లక్షల నుండి పది లక్షల వరకు రుణాలు అందిస్తున్నామని వారు తెలిపారు. బ్యాంకర్లు సహకరిస్తే శతశాతం రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీనివాసరావు తెలిపారు. బ్యాంకుల్లో నగదుకొరత ఏర్పడడంతో రుణాలు పంపిణీ లక్ష్యాన్ని చేరుకోలేక పోయామని చెప్పారు. చంద్రబాబునాయుడు అందించిన మహిళా పసుపుకుంకుమ సొమ్మును అప్పులకు జమచేయడంపై మహిళలు అభ్యంతరం తెలుపుతున్నారని మీడియా దృష్టికి వచ్చిందని ప్రశ్నించగా బ్యాంకుల్లో డబ్బు లేకపోవడంతో అలా జరిగిందని చెప్పారు. ఫిబ్రవరి 2017 వరకు వేపాడ మండలానికి 341 గ్రూపులకు 11.72 కోట్లు, ఎస్.కోటకు 493గ్రూపులకు 15.92కోట్లు, ఎల్.కోటకు 309గ్రూపులకు 11.76కోట్లు, జామి మండలానికి 431గ్రూపులకు 14.67కోట్లు కొత్తవలసకు 438గ్రూపులకు 14.97కోట్లు రుణాలు అందించామని చెప్పారు. మార్చి ఆఖరుకు రుణాలన్నీ పూర్తి చేస్తామని అన్నారు.