విజయనగరం

క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 6: జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు అందరు నడుం బిగించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ యుసిజి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఏటా 1.70 లక్షల మంది ఈ వ్యాధి బారినపడి చనిపోతున్నారని తెలిపారు. మన దేశంలో 60 శాతం మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారన్నారు. మన దేశంలోనే గాకుండా నైజీరియా, చైనా, పాకిస్తాన్ వంటి దేశాల్లో కూడా క్షయ వ్యాధిని కలిగించే క్రిమి అధికంగా విస్తరిస్తొందన్నారు. ప్రస్తుతం క్షయ వ్యాధికి హెచ్‌ఐవి తోడుకావడం వల్ల రక్తహీనత కారణంగా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. అయితే ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉండటంతో మరణాల రేటు గణనీయంగా తగ్గిందన్నారు. ఈ ఛికిత్సకు ప్రభుత్వం ఖరీదైన మందులను ఉచితంగా అందజేస్తుందన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలకు ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్నాయన్నారు. గతంలో క్షయ వ్యాధి గ్రస్తులను కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రానిచ్చేవారు కాదని గుర్తు చేశారు. నేడు ఈ వ్యాధిబారిన పడిన వారు క్రమం తప్పకుండా మందులు వాడితే జబ్బు నయం అవుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిసిహెచ్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉషశ్రీ మాట్లాడుతూ క్షయవ్యాధిపై ఈ ఏడాది యుద్ధం ప్రకటించడం జరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ‘యునైట్ టు ఎండ్ టిబి’ అని పిలుపునిచ్చాయన్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఒ డాక్టర్ పద్మజ మాట్లాడుతూ ఈ వ్యాధి మైకోబాక్టీరియా అనే క్రిమి వల్ల సంభవిస్తుందన్నారు. ఈ క్రిమి ప్రతి మానవ శరీరంలో కొంత ఉంటుందన్నారు. అందరికీ ఈ వ్యాధి సోకదని, రక్తహీనత వల్ల, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని వివరించారు. క్షయ నిర్మూలన కోసం అందరు పాటుపడతామని కోఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో బుచ్చిరాజు, ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కిశోర్‌కుమార్, డిప్యూటీ డిఎంహెచ్‌ఒలు రాఘవరావు, రవికుమార్, డెమో లక్ష్మినాయుడు, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు.