విజయనగరం

కొత్త నియోజక వర్గాలపై కోటి ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 24: త్వరలో జిల్లా రాజకీయ ముఖచిత్రం మారబోతోంది. జిల్లాలో మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు తెరపైకి రానున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, తాజాగా మరో రెండు నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. వీటిలో విజయనగరం డివిజన్‌లోని విజయనగరం-2, పార్వతీపురం డివిజన్‌లో తెర్లాం అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సరిపడా జనాభా నిష్పత్తి కూడా సరిపోవడంతో విభజన సులభతరం కాగలదని భావిస్తున్నారు. ప్రస్తుతం విజయనగరం అసెంబ్లీ ఉండగా, తాజాగా విజయనగరం రూరల్ ప్రాంతాలను కలిపి విజయనగరం-2 అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా బొబ్బిలి అసెంబ్లీలోని తెర్లాంను విడదీసి దాని చుట్టుపక్కల మండలాలతో కలిపి తెర్లాం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయనున్నారు. 2007లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముందర ఉన్న తెర్లాం అసెంబ్లీ నియోజకవర్గాన్ని యధాతధంగా తెరపైకి తెచ్చారు. ఈ విధంగా జిల్లాలో మరో రెండు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాల నుంచి 225కు పెంపుదల చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముమ్మరంగా ప్రయత్నిస్తున్న విషయం విధితమే. ప్రస్తుతం ఈ ఫైలు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. 2026 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగదని కేంద్ర హొం మంత్రిత్వశాఖ చెబుతున్నప్పటికీ, అవసరమైతే రాజ్యాంగంలోని 170(1) చట్టానికి సవరణ చేయడం ద్వారా అసెంబ్లీ నియోజకవర్గాలను పెంపుదల చేసుకునే వెసులుబాటు ఉందని విశే్లషకులు చెబుతున్నారు. ఇదే విషయమై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇటీవల దీనిపై మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాలను పెంపుదల చేసి తీరుతామని స్పష్టం చేశారు. అదే జరిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో మరో 50 అసెంబ్లీ స్థానాలు తెరపైకి రానున్నాయి. అందులో భాగంగానే జిల్లాలో కూడా మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని వివిధ పార్టీల నేతలు విశే్లషిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలు పెరుగుదల రాజకీయ నేతలకు పండుగనే చెప్పవచ్చు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నేతలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తాము ఏ స్థానం నుంచి పోటీ చేయాలనే విషయమై తలలు పట్టుకుంటున్నారు. కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే మరికొంత మంది రాజకీయ నేతలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం దక్కనుంది.

జోరుగా ఆస్తిపన్ను వసూలు
విజయనగరం (్ఫర్టు), మార్చి 24: పట్టణంలో ఆస్తిపన్ను, నీటి చార్జీల వసూలు జోరుగా జరుగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువుకేవలం ఆరురోజులు మాత్రమే ఉండటంతో పన్ను వసూలులో మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. పెద్దమొత్తంలో బకాయిపడిన వారిపై ఒత్తిడి తీసుకువస్తున్న అధికారులు మొండి బకాయిదారుల నుంచి కూడా పన్ను వసూలు చేస్తున్నారు. పట్టణంలో పన్ను వసూళ్లను మున్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.సోమన్నారాయణ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సహాయ కమిషనర్ కనకమహాలక్ష్మి నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు పన్ను వసూలులో నిమగ్నమయ్యాయి. సంవత్సరాల తరబడి పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నవారికి రెడ్ నోటీసులను జారీ చేశారు. నోటీసులు అందుకున్నవారు ఆస్తిపన్ను, నీటిఛార్జీలు చెల్లించకపోతే మంచినీటికుళాయి కనెక్షన్‌లను తొలగిస్తున్నారు. ఇంతవరకు 100 వరకు కుళాయి కనెక్షన్‌లను తొలగించినట్లు తెలిసింది. మున్సిపాలిటీలో ఈ ఆర్థిక సంవత్సరంలో 27.18 కోట్ల రూపాయల పన్నును వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, 13 కోట్ల రూపాయల వరకు పన్ను వసూలు చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగానికి, పట్టణ ప్రణాళిక విభాగానికి రెండు కోట్ల రూపాయల ఆస్తిపన్ను వసూలు చేయాలని మున్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.సోమన్నారాయణ లక్ష్యంగా నిర్థేశించారు. ఒక్కొక్క విభాగం కోటి రూపాయలు వసూలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మున్సిపల్ మేనేజర్ ఆనందరావుతోపాటు మున్సిపల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఎల్.గోవిందరావు, కె.కిరణ్, చిన్నంనాయుడు, శంకరరావువారికి కేటాయించిన ప్రాంతాలలో బిల్లుకలెక్టర్లు ద్వారా పన్ను వసూలు చేస్తున్నారు.
ఎస్సీ,ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట

విజయనగరం (్ఫర్టు), మార్చి 24: ఎస్సీ,ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎస్సీ,ఎస్టీసబ్‌ప్లాన్ జిల్లా మోనటరింగ్ కమిటీ సభ్యుటు శీర రామారావు(కువైట్ రాము) తెలిపారు. శుక్రవారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ రాష్టబ్రడ్జెట్‌లో ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతి కోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించిందని చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీలను వ్యాపారులుగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంకణం కట్టుకున్నారని, వారి జీవనస్థితిగతులను మెరుగుపర్చేందుకు పలు పథకాల ఆర్థికసాయం అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ,ఎస్టీలు నివసించే ప్రాంతాలలో వౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుంటుందని చెప్పారు. దీనిలోభాగంగా ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా రోడ్డు, కాలువలు, కల్వర్టుల నిర్మాణంతోపాటు విద్యుత్, విద్య, వైద్యం తదితర సదుపాయాలను కల్పిస్తుందన్నారు. జిల్లాలో విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలలోఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సకాలంలో ఖర్చు చేయాలని మున్సిపల్ కమిషనర్లను కోరామని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా ఓటింగ్ శాతం పెరిగింది
విజయనగరం(టౌన్), మార్చి 24: ఉత్తరాంద్ర పట్ట్భద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్ధి అజశర్మ ఓటమి చెందినా ఓటింగ్ శాతం పెరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. శుక్రవారం సిపిఎం పార్టీ కార్యాలయం ఎల్ బిజి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రెడ్డిశంకరరావుతో కలిసి మాట్లాడుతూ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయింనంత మాత్రాన వామపక్ష శక్తులను తక్కువగా అంచనా వేయవద్దని పాలక పక్ష పార్టీలను హెచ్చరించారు. ప్రజావ్యతిరేక చర్యలను ఎపుడు ఎండగడుతూనే ప్రజల తరపున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు. పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్ధికి గత రెండు ఎన్నికల్లో 25వేలు, 34వేలు, ఈ ఎన్నికల్లో 37వేల ఓట్లు వచ్చాయని చెపుతూ తాము చేస్తున్న పోరాటాలను ఓటరులు గుర్తించారని పేర్కొన్నారు. చెల్లని ఓట్లుకూడా కొంత ప్రభావం చూపాయని అన్నారు. సాంకేతిక కారణాలువలన వెనుక బడ్డామని అన్నారు. ఉద్యమాలద్వారా ప్రజల్లోకి వెళ్లి అనేక సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేసారు. వామపక్షాలకు ఓటరులు బుద్ధి చెప్పారని టిడిపి- బిజెపిలు సంబరాలు చేసుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వామపక్షాలను తక్కువగా అంచనా వేయవద్దని గరికలాంటివారని స్పష్టంచేసారు. ఉత్తరాంధ్ర పట్ట్భద్రులకు ఈ ఎన్నికల్లో టిడిపి- బిజెపిలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసారు. జిల్లాలో సమస్యలపై ఎప్పటికపుడు పోరాటాలు చేస్తూ పాలకులను నిలదీస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోపోతే ప్రజలే తగిన బుద్ధి చెపుతారని హెచ్చరించారు.
అధికారులు జవాబుదారీగా
పనిచేయాలి: కలెక్టర్

విజయనగరం, మార్చి 24: జిల్లాలో అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన వివిధ శాఖలతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పనుల ప్రగతిపై ఆరా తీశారు. 24 పనులు అంచనాల స్థాయిలో ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల పురోగతిపై ఎస్‌ఇ పర్యవేక్షించాలన్నారు. మజ్జిగౌరమ్మ వీధిలో పనులు ప్రారంభించని కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇవ్వాలన్నారు. వెంకటలక్ష్మి నుంచి మయూరి జంక్షన్ వరకు రోడ్ల విస్తరణపై ఆరా తీశారు. జనతా బజారు దగ్గర షాపింగ్ కాంప్లెక్స్‌ను వేగవంతం చేయాలన్నారు. మురికివాడల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం రూ.94 లక్షలు మంజూరు చేసిందని ఇఇ వివరించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. నారాయణపురం వంతెన నిర్మాణం ఆలస్యంగా జరగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వెటర్నరీ పోలి క్లినిక్ భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు.