విజయనగరం

పోరాటాలతోనే హక్కుల సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), మార్చి 26: కేంద్ర , రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక విధానాలపై నిరంతరం పోరాడుతూనే హక్కులు సాదించుకునేందుకు ఎ ఐ ఎఫ్ టియు కృషి చేస్తుందని రాష్ట్ర సమాయ కార్యదర్శి గణేష్ పండా వెల్లడించారు. ఆదివారం పట్టణంలోని తుపాకుల వీధిలోని యూనియన్ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వచ్చేనెల 11,12 తేదీల్లో విశాఖపట్టణంలో జరిగే రాష్ట్ర మహాసభల గోడపత్రికలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక పరి6శమలు మూతపడి కార్మిక కుటుంబాలు వీధిన పడుతున్నా పాలకులకు కనీసం పట్టక పోవడం దారుణమని విమర్శించారు. జూట్ పరిశ్రమలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూత పడి వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్య మంత్రి చంద్రబాబు సమస్యలు పట్టించుకోపోవడంపై ధ్వజమెత్తారు. ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయని, కొత్తగా ఎటువంటి పరిశ్రమలు రాలేదని విమర్శించారు. వ్యవసాయ ఆధార పరిశ్రమల మనుగడకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. మూపడిన పరిశ్రమలు తెరిపించి, కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక విధానాలపై రాష్టమ్రహాసభల్లో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటామని అన్నారు. ఈకార్యక్రమంలో యూనియన్ నాయకులు బెహరాశంకరరావు, రెడ్డి నారాయణరావు, ఎన్ అప్పలరాజురెడ్డి, బోడసింగి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.