విజయనగరం

పడని బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 27: జిల్లాలో 2017-19 సంవత్సరానికి సంబంధించి 210 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ నేటి వరకు ఏ ఒక్కరు దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. కొత్త అమావాస్య ఉండటం వల్లనే ఎవరు దరఖాస్తు చేసుకోడానికి ముందుకు రాలేదని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాల కోసం ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగలక్ష్మి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంబుప్రసాద్‌లు తెలిపారు. విజయనగరం డివిజన్‌లో 141 మద్యం దుఖాణాలు, పార్వతీపురం డివిజన్‌లో 69 దుఖాణాలు ఉన్నాయి. మద్యం దుఖాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు గడువు విధించారు. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 31న పట్టణంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో లాటరీ పద్దతిలో వేలం నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న వారు ఆయా దుఖాణాలకు నిర్ధేశించిన విధంగా లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఐదువేలు లోపు జనాభా ఉంటే రూ.7.50 లక్షలు లైసెన్సు ఫీజు చెల్లించాలి. జనాభా 5వేల నుంచి పదివేల లోపు ఉంటే లైసెన్సు ఫీజు రూ.8.50 లక్షలు, జనాభా 10వేల నుంచి 25వేలు లోపు ఉంటే లైసెన్సు ఫీజు రూ.9.25 లక్షలు, జనాభా 25వేల నుంచి 50వేలు జనాభా ఉంటే రూ.10 లక్షలు, జనాభా 50వేల నుంచి 3 లక్షల వరకు లైసెన్సు ఫీజు రూ.11.25 లక్షలు, జనాభా 3 లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉన్న వాటికి లైసెన్సు ఫీజు రూ.12.50 లక్షలు, ఐదు లక్షలు పైబడి జనాభా ఉన్న వాటికి రూ.16.25 లక్షలు లైసెన్సు ఫీజు చెల్లించాలని డిప్యూటీ కమిషనర్ నాగలక్ష్మి వివరించారు. జిల్లాలో మొత్తం 210 మద్యం దుఖాణాలకుగాను 171 మద్యం దుఖాణాలు జాతీయరహదారికి ఆనుకొని ఉన్నాయన్నారు. కొత్త నోటిఫికేషన్‌లో ఆయా దుఖాణాలు మార్చుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికీ హైవేని ఆనుకొని ఉన్న వాటిలో 35 దుఖాణాలు మార్చుకోలేదన్నారు. అలా మార్చుకోని వాటిని రద్దు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

ఐదు మండలాల్లో
త్వరలో రిటైల్ మార్కెట్లు

విజయనగరం, మార్చి 27: జిల్లాలో స్వయం సహాయక సంఘాలు స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ డిల్లీరావు చెప్పారు. సోమవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఇప్పటికే రుణాల రికవరీలోను, చంద్రన్న బీమా పథకం అమల్లో రాష్ట్రంలో మొదటి స్ధానంలో నిలిచామన్నారు. మరోపక్క స్వయం సహాయక సంఘాలకు జీవనోపాధులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 38432 స్వయం సహాయక సంఘాలు, 1293 గ్రామైఖ్య సంఘాలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఐదు మండలాల్లో రిటైల్ మార్కెట్ కింద నోడా స్టోర్లు ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వీటిలో రామభద్రాపురం, దత్తిరాజేరు, మెరకముడిదాం, పాచిపెంట, గుమ్మలక్ష్మిపురం మండలాలు ఉన్నాయన్నారు. త్వరలోనే వీటిని ప్రారంభిస్తామన్నారు.
ఇదిలా ఉండగా స్ర్తి నిధి రుణాల రికవరీలో మొదటి స్ధానంలో నిలిచామన్నారు. స్ర్తి నిధి రుణాల రికవరీ కూడా 95 శాతం ఉందన్నారు.గ్రూపులకు వివిధ రంగాల్లో జీవనోపాధులు కల్పించడం, వివిధ వృత్తులలో శిక్షణనివ్వడం, వ్యవసాయం, వ్యవసాయేతర రంగాలు, వ్యాపార రంగాల్లో శిక్షణనివ్వడం ద్వారా గ్రూపుల ఆర్ధికంగా బలోపేతానికి అన్ని విధాల ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్ర్తి నిధి కింద వంద కోట్లు రుణ సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాలో జీవనోపాధుల కల్పనలో భాగంగా 14 అన్న సంజీవని యూనిట్లు, డ్వాక్రా బజార్లు, క్యాంటిన్ల ఏర్పాటు, తొమ్మిది ఫినాయిల్ యూనిట్స్, 15వేల వర్మి కంపోస్టు యూనిట్లు నెలకోల్పామన్నారు. మరోపక్క మత్స్యకార గ్రూపులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు చేపల కుంటలు నిర్మించామన్నారు. అలాగే పశుసంవర్ధకశాఖ సహకారంతో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు పాడి పశువుల పెంపకం, గొర్రెలు, మేకల పెంపకానికి రుణాలు మంజూరు చేసినట్టు చెప్పారు.
ఎఫ్‌పిఓ గ్రూపులు ఏర్పాటు
తెర్లాం మండలంలో పాడిపశువుల పెంపకం దారులతొ ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూపులను ఏర్పాటు చేశామన్నారు. మెరకముడిదాంలో జీడి మొక్కల పెంపకం దారులతో ఒక గ్రూపును ఏర్పాటు చేశామన్నారు. దత్తిరాజేరులో వరి పండించే రైతులతొ గ్రూపు ఏర్పాటు చేశామని, రామభద్రాపురంలో కూరగాయలు పండించే రైతులతో గ్రూపులను ఏర్పాటు చేసినట్టు వివరించారు. మరోపక్క వివిధ గ్రూపులకు అవసరమైన నైపుణ్యాలను కల్పించి వారికి ఉపాధి లభించే విధంగా జాబ్ మేళాలు నిర్వహించి వివిధ రంగాల్లో ఉపాధి కల్పించగలిగామని వివరించారు.
వైకాపాను
బలోపేతం చేస్తాం

* పరిశీలకుడు ధర్మాన కృష్ణదాస్

విజయనగరం, మార్చి 27: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలను అపహాస్యం చేస్తుందని వైకాపా పరిశీలకుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీటి సంఘాల ఎన్నికల విషయంలో కూడా ఎంపిటిసి, జెడ్పీటీసీలకు ధనాన్ని ఆశచూపి ఎన్నికల వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. వైకాపాలో అన్ని విభాగాలను పటిష్టం చేసి రాబోయే ఎన్నికల్లో వైకాపా విజయానికి కృషి చేస్తామన్నారు. 8న జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాల నాటికి అన్ని విభాగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో వైకాపా నేతలు పి.సాంబశివరాజు, మజ్జి శ్రీనివాసరావు, పి.జైహింద్‌కుమార్ పాల్గొన్నారు.
చేతులెత్తేసిన జిసిసి
* చింతపండు కొనుగోలులో
ప్రైవేట్ వ్యాపారుల హవా
సాలూరు, మార్చి 27: ఈ ఏడాది చింతపండు కొనుగోలు నుంచి జిసిసి పూర్తిగా తప్పుకుంది. మార్కెట్ ధర కన్న బాగా తక్కువ ధర నిర్ణయించడంతో గిరిజనులు ఎవరూ జిసిసి చింతపండును విక్రయించడం లేదు. సంతల్లో కూడా జిసిసి చింతపండును కొనుగోలు చేయడం లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా రంగప్రవేశం చేశారు. జిసిసి కన్న ఎక్కువ ధర చెల్లిస్తున్నప్పటికీ తూనికలు, కొలతల్లో మాత్రం మోసం చేస్తున్నారు.జిసిసి కిలో చింతపండు 18 రూపాయలు కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. అయితే మార్కెట్‌లో మాత్రం నాణ్యత లేని చింతపండు కిలో 35 రూపాయలుగా, నాణ్యతతో కూడిన చింతపండు కిలో 45 రూపాయలకు పలుకుతుంది. మార్కెట్ ధరలో సగం ధరకు జిసిసి కొనుగోలు చేయడంతో గిరిజనులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. తోణాం, నేరళ్లవలస, నంద, వేటగానివలస, పూడి సంతల్లో ప్రైవేటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. కొండలపైకి వెళ్లి గిరిజనులను మభ్యపెట్టి కొనుగోలు చేస్తున్నారు. మండలంలో తోణాం ప్రాంతానికి చెందిన వై.సి.పి. గిరిజన నాయకుడు ఇష్టారాజ్యంగా చింతపండును కొనుగోలు చేస్తున్నాడు. గిరిజనులకు మేలు చేయడానికే కొనుగోలు చేస్తున్నామని చెబుతూ అడ్డగోలుగా దోపిడి చేస్తున్నారు. తోణాం గిరి శిఖర గ్రామాల నుంచి తీసుకువచ్చే చింతపండును గిరిజన నాయకుడు అడ్డగించి కొనుగోలు చేస్తున్నాడు. నాణ్యత లేని చింతపండుకు 25 రూపాయలు, నాణ్యత ఉన్నచింతపండుకు 30 రూపాయల ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నాడు. గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన ధరకంటే అధికంగా 10 నుంచి 15 రూపాయల లాభానికి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఐటిడిఏ పిఓ అనుమతితోనే చింతపండును కొనుగోలు చేస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. . జిసిసి కొనుగోలు చేయకపోవడంతో కొంతమంది సేల్స్‌మేన్ ప్రైవేటు వ్యాపారులతోకుమ్మకై వ్యాపారాలు సాగిస్తున్నారు. అటవీ ఉత్పత్తులన్నీ ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లి గిరిజనులకు అందని ద్రాక్షగా మిగిలిపోతుంది.
ఎస్సీ కాలనీల నిధులు ఏమయ్యాయి..?
* సిపిఐ నేత అశోక్ ప్రశ్న
విజయనగరం (్ఫర్టు), మార్చి 27: మున్సిపాలిటీ పరిధిలో ఎస్సీ,ఎస్టీ ప్రాంతాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఎస్సీ,ఎస్టీల ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధులు ఏమయ్యాయో అర్థం కావడం లేదని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. పట్టణంలో ఒకటవ వార్డు పరిధిలో ఉన్న సంజీవయ్యనగర్ కాలనీలో వౌలిక వసతులు లేకపోవడం వల్ల కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాలనీవాసులు అవస్థలు పడుతుంటే అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌గాని, మున్సిపల్ అధికారులుగాని కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద సంజీవయ్యకాలనీవాసులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిన పాలకులు కనీసం ఎస్సీ,ఎస్టీసబ్‌ప్లాన్ కింద విడుదల అయిన నిధులను ఖర్చుచేయలేని దుస్థితిలో ఉన్నారని ఆరోపించారు. మున్సిపాలిటీలో ఎస్సీ,ఎస్టీ ప్రాంతాల అభివృద్థి కోసం ఎస్సీ,ఎస్టీసబ్ ప్లాన్ కింద కోటి 50 లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తే ఇంతవరకు ఆ నిధులను ఖర్చు చేయకపోవడం వల్ల వెనక్కి వెళ్లిపోయాయని తెలిపారు. సంజీవయ్యనగర్‌కాలనీ రహదారులు సగం వరకు మాత్రమే వేసి మిగతా రహదారులను వదిలివేశారని చెప్పారు. ఫలితంగా కాలనీవాసులు నరకయాతనలు పడుతున్నారని అన్నారు. తక్షణమే జిల్లాకలెక్టర్ వివేక్‌యాదవ్ జోక్యం చేసుకుని కాలనీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్‌కు ఒక వినితపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గసభ్యులు బి.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
నవమి ఉత్సవాలకు సన్నాహాలు
నెల్లిమర్ల, మార్చి 27: పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థం లో కొలువుదీరిన శ్రీరామచంద్ర ప్రభువు సన్నిధిలో హేమలంబినామ సంవత్సర చైత్ర శుద్ద పాడ్యమి ఉగాది 29వ తేదీ నుంచి ఏఫ్రిల్ 5 శ్రీరామనవమి వరకు ఉత్సవాలు నిర్వహించడానికి దేవాదాయశాఖ సన్నాహాలు చేస్తోంది. ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు 40 మంది రుత్వికులచే మద్రామయణ పారాయణ పారాయణములు, సుందరాకాండ పారాయణలు, సుందరకాండ విశేష హవనములు అత్యంత వైభోపేతంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉగాది రోజు ఉదయం ఆరు గంలకు విశ్వక్సేనారాధనతో అంకురారోపణము, 7.30 నిమిషాలకు యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు పంచాంగ శ్రవణం 6.30 గంటలకు మంగళ స్నానం, 7 గంటల నుండి 12 గంటల వరకు శ్రీమద్రామాయణ పారాయణములు నిర్వహిస్తారు. లక్ష తులసి, కుంకుమార్చానలు యాగశాలలో రామాయణం, సంక్షీయప రామాయణం, సుందరకాండ హవనములు సాయంత్రం ఆరు గంటలకు యాగశాలలో ఆరాధన ప్రత్యేక పారాయణము జరుపుతారు. 5న శ్రీరామనవమి రోజున అష్టకలశ స్నపన మహోత్సవం అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి కల్యాణం మంచి ముత్యాలతో తలంబ్రాలు వైభవంగా కన్నుల పండువగా నిర్వహిస్తారు. 6న పట్ట్భాషేక మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం రుత్వికులకు సన్నాన కార్యక్రమం ఉంటుంది. నవమి ఏర్పాట్లుకు ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి పి. బాబూరావు పర్యవేక్షిస్తారు.