విజయనగరం

ఉపాధ్యాయుల పదోన్నతుల కౌనె్సలింగ్ 20కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, మే 16: జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, జిపి ఎస్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్‌జిటి, సమాన కేడర్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ ఈనెల 20 తేదీకి వాయిదా పడినట్టు జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్ విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించడానికి ఈనెల 17న జరగాల్సిన ప్రమోషన్ ప్రక్రియ పాలనాపరమైన కారణాల వల్ల ఈనెల 20వతేదీకి వాయిదా వేయడం జరిగిందని ఈ విషయం పదోన్నతులకు అర్హులైన ఉపాధ్యాయులు గమనించాలని డిడి కోరారు.
మహానాడుకు సర్వ సిద్ధం
చీపురుపల్లి, మే 16:తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో నిర్వహించనున్న మహానాడుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని మాజీ శాసనసభ్యుడు, మహానాడు వేదికా ప్రాంగణం కో కన్వీనర్ గద్దె బాబూరావు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన సమావేశ మందిరంలో సుమారు 20వేల కుర్చీలను వేదిక వద్ద ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. తాగునీరు, మజ్జిగ పేకట్లను సుమారు నాలుగు లక్షల వరకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మహానాడుకు తరలివచ్చే వాహనాల పార్కింగ్‌కు క్రీడామైదానం వద్ద 1500 వాహనాలు పెట్టేందుకు మూడు పార్కింగ్ స్థలాలు కేటాయించామని తెలిపారు. మైదానానికి వచ్చేందుకు ఆరు రహదారులతో పాటు మఖ్యమంత్రి వచ్చేందుకు ప్రత్యేక రహదారి కేటాయించినట్టు పేర్కొన్నారు. క్రీడామైదానంలో వేదిక పనులను ఆర్‌కె సంస్థకు అప్పగించామని వారు వేదికను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. మహానాడుకు హాజరయ్యేనాయకులు బసచేసేందుకు విశాఖపట్టణంలోని అన్ని హోటల్స్‌ను అద్దెకు తీసుకోవడం జరిగిందన్నారు. మహానాడు జరిగే మూడురోజులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు.