విజయనగరం

జంఝావతి కాలువ పనులు నిలుపుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరుగుబిల్లి, జూన్ 6: జంఝావతి కాలువ నిర్మాణ నిమిత్తం భూములను ఇచ్చిన రైతులకు నేటి వరకు పరిహారం చెల్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో సి.పి.ఎం. ఆధ్వర్యంలో తులసిరామినాయుడువలస, గొల్లవానివలస గ్రామాల రైతులు మంగళవారం కాలువ పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సి.పి.ఎం జిల్లా కమిటీ సభ్యులు బి.వి.రమణ మాట్లాడుతూ పలు గ్రామాలకు సాగునీటిని అందించేందుకు కాలువ నిర్మాణం నిమిత్తం తులసిరామినాయుడువలస, గొల్లవానివలసకు చెందిన రైతులు 2008లో భూములను ఇచ్చినప్పటికీ నేటి వరకు వాటికి పరిహారం చెల్లించలేదన్నారు. ఈ పరిహారానికి రైతులు పలుసార్లు అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఈ జంఝావతి కాలువ నిర్మాణంలోనూ, రైతులకు పరిహారం చెల్లించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజాప్రతినిదులను నమ్మి కాలువ పనులు చేసుకునేందుకు అవకాశం ఇస్తే పరిహారం చెల్లించేందుకు మాత్రం అధికారులు చర్యలు చేపట్టలేదన్నారు. ఈమేరకు కాలువ నిర్మాణానికి భూములకు చెందిన రైతులకు పరిహారం చెల్లించేంతవరకు పనులను జరగనివ్వబోమని స్పష్టం చేశారు. తక్షణమే పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

రిబేటు లేనట్టే!
* ఖరీఫ్‌లో రూ.175 కోట్లు రుణాల పంపిణీ లక్ష్యం
* డిసిసిబి జనరల్ మేనేజర్ జనార్దన్

విజయనగరం, జూన్ 6: డిసిసిబిద్వారా దీర్ఘకాలిక రుణాలపై ప్రభుత్వం గతంలో 6 శాతం రిబేటు ఇవ్వగా, గత రెండేళ్ల నుంచి రిబేటు మంజూరు చేయకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో దాదాపు రూ.4.50 కోట్ల వడ్డ్భీరం రైతులపై పడింది. డిసిసిబి ద్వారా దాదాపు రూ.72 కోట్లు రుణాలు పంపిణీ చేశారు. వీటిపై రిబేటు వస్తుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ రెండేళ్లుగా ఎలాంటి రిబేటు రాకపోవడంతో రైతులపై వడ్డ్భీరం పడింది. ఈ ఏడాది కూడా దీర్ఘకాలిక రుణాలపై ఎలాంటి రిబేటు ఉండదని డిసిసిబి జనరల్ మేనేజర్ కె.జనార్దన స్పష్టం చేశారు.
ఖరీఫ్ లక్ష్యం రూ.175 కోట్లు : ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు రూ.175 కోట్లు రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డిసిసిబి జనరల్ మేనేజర్ కె.జనార్ధన చెప్పారు. ఖరీఫ్ రుణాలతోపాటు స్వల్పకాలిక రుణం కింద రూ.20 కోట్లు, దీర్ఘకాలిక రుణాల కింద రూ.30 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. స్వల్పకాలిక రుణాల్లో ఇప్పటి వరకు రూ.5కోట్లు పంపిణీ చేశామన్నారు. దీర్ఘకాలిక రుణాల్లో రూ.10 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఈసారి వాణిజ్య పంటలు పండించే వారికి స్వల్పకాలిక రుణాలు మంజూరు చేస్తున్నట్టు వివరించారు. వాణిజ్య పంటలకు ఒక్కో రైతుకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. ఖరీఫ్‌కు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.07 కోట్లు పంపిణీ చేసినట్టు చెప్పారు. మరో రూ.77 కోట్ల్లకు అప్‌లోడ్ చేసినట్టు వివరించారు.
త్వరలో మూడు ఎటిఎంలు ఏర్పాటు : డిసిసిబి పరిధిలో కొత్తగా నెల్లిమర్ల, చీపురుపల్లి, పార్వతీపురం ప్రాంతాల్లో మూడు ఎటిఎం సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు జనార్దన వెల్లడించారు.

ఉపాధి కల్పనలో రాష్ట్రం ముందంజ
* ఎమ్మెల్యే గీత

విజయనగరం, జూన్ 6: యువతకు అవకాశాలు కల్పించడంలో రాష్ట్రం ముందంజలో ఉందని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. మంగళవారం ఆమె ఆనందగజపతి ఆడిటోరియంలో నవనిర్మాణ దీక్షల్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన భరోసాతో అనేక మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకోల్పేందుకు ముందుకు వచ్చారన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కంటే ప్రైవేటు రంగంలో అధిక మొత్తంలో జీతాలు చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. గత ఏడాది రూ.10వేల కోట్ల పెట్టుబడితో ఎనిమిది పరిశ్రమల స్థాపనకు, ఈ ఏడాది రూ.1100 కోట్ల పెట్టుబడితో 15 పరిశ్రమలు స్థాపనకు ముందుకు వచ్చారన్నారు. తద్వారా 10వేల మందికి పైగా ఉపాధి కల్పించేందుకు పారిశ్రామికవేత్తలు అంగీకరించారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి మానవ వనరులు కీలకమన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వలసల నివారణకు ఎన్‌ఆర్‌ఇజిఎస్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సోలార్ వినియోగం పెరిగిందన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎస్‌ఇ వేణుగోపాల్ మాట్లాడుతూ చంద్రన్నబాట కింద అన్ని గ్రామాలకు సిసి రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామరాజు మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి చేపట్టిన వినూత్న పథకాలు ఉపయుక్తంగా ఉన్నాయన్నారు. ఆసుపత్రులలో సైంటిఫిక్ శానిటేషన్ నిర్వహిస్తున్నామన్నారు. ఘోషాసుపత్రిని రూ.10 కోట్లతో ఆధునీకరించడంతోపాటు వంద పడకల నుంచి 150 పడకలకు విస్తృతపరిచామన్నారు. పెద్దాసుపత్రిని రూ.17.50 లక్షలతో అభివృద్ధి చేసినట్టు వివరించారు. గృహనిర్మాణశాఖ ఇఇ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ శాశ్వత గృహనిర్మాణ పథకాలు ప్రవేశపెట్టిరూ.70వేల నుంచి రూ.1.50 లక్షలు సబ్సిడీ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసమూర్తి, ఆసుపత్రి అభివృద్ధికమిటీ చైర్మన్ డాక్టర్ విఎస్ ప్రసాద్, ఎఎంసి చైర్మన్ సైలాడ త్రినాథ్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు పాల్గొన్నారు.

పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు
* కలెక్టర్ వివేక్ యాదవ్
విజయనగరం(్ఫర్టు), జూన్ 6: జిల్లాలో పిల్లల అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. కేసలి స్వచ్చంద సంస్థ స్వచ్చంద సంస్థ ప్రతినిధులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వేర సంస్థలు, సంఘాల సహకారంతో మానవ హక్కులకు భంగం కలిగించే మానవ అక్రమ రవాణాపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు. దీనిపై అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు. సమాజంలో గౌరవ ప్రథమైన జీవితాన్ని ఆనందంతో జీవించడానికి ఉపయోగపడే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. పట్టణ స్థాయిలో విద్యార్థులకు, మహిళా సంఘాలకు, కార్మికులకు మానవ అక్రమ రవాణాపై పూర్తిస్థాయిలో అవగాహన నిర్వహిస్తామని ప్రజ్వల సంస్థ ప్రతినిధి బలరామ్ కృష్ణమూర్తి తెలిపారు. గ్రామ, పట్టణ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటుచేస్తామని కలెక్టర్‌తో ఆయన చెప్పారు. కిశోరబాలికలు, కళాశాల విద్యార్థులు అనేక ప్రలోభాలకు లోనై కొంతమంది మోసపూరిత వ్యక్తుల చేతుల్లో బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేసలి సంస్థ అధ్యక్షుడు కేసలి అప్పారావు, వి.లక్ష్మి, మహేశ్వరరావు పాల్గొన్నారు.

రహదారుల అనుసంధానంతో అభివృద్ధి

గజపతినగరం,జూన్ 6: రహదారుల అనుసంధానంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం విద్య, వైద్య, వనరుల విభాగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని పలు కీలకమైన రహదారులు నిర్మించామని చెప్పారు. గజపతినగరం మండలంలోని పట్రువాడ, మర్రివలస గ్రామాల వద్ద చంపావతి నదిపై కల్వర్టులు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత పదేళ్లలో అభివృద్ధి చెందని గ్రామాల్లో అభివృద్ధి బాటలు వేశామని అన్నారు. ఇటీవల ఫలితాలలోప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్ధులు మంచి ప్రతిభ కనబరిచారని చెప్పారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు బృందం కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. మైనారిటీలు, ఎస్సీలలో వెనుకబడిన వారిని గుర్తించి వారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం పూర్తిగా అయ్యే ఖర్చును భరించటానికి కొత్తపథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర విద్యాలయాలన్ని తెలంగాణకు వెళ్లిపోయాయని చెప్పారు. రాష్ట్రానికి ఇఎంఎం, గిరిజన యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ, వ్యవసాయ యూనివర్సిటీలతోపాటు ఎన్నో ముఖ్యమైన యూనివర్సిటీలు వస్తాయన్నారు. త్వరలో వీటిని పూర్తి చేయటం ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు ఇక్కడే మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఉన్నత విద్యను విదేశాలలో అభ్యసించాలనుకునే విద్యార్ధులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి కృష్ణ, ఎంపిపిలు గంట్యాడ శ్రీదేవి, బెజవాడ రాజేశ్వరి, జెడ్పీటిసిలు మక్కువ శ్రీ్ధర్, బండారు బాలాజీ, ఎంపిడిఓ కృష్ణవేణమ్మ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మితిరెడ్డి వెంకటరమణ, ఎంఇవో విమలమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు అప్పలనాయుడు, తహశీల్దార్ శేషగిరి పాల్గొన్నారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత

పాచిపెంట, జూన్ 6: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని గనులు, భూగర్భశాఖామంత్రి ఆర్.వి.సుజయ్‌కృష్ణరంగారావు అన్నారు. మండలంలోని కర్రివలస సమీపాన పోతులగెడ్డపై కోటి 60 లక్షల రూపాయలతో నిర్మించనున్న వంతెనకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ముందుగా భూమి పూజ నిర్వహించారు. అంతకుముందు టి.డి.పి. నాయకులు శ్యామలగౌరీపురం నుంచి మంత్రికి స్వాగతం పలికేందుకు బైక్‌ర్యాలీని చేపట్టారు. ఈసందర్భంగా బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రోడ్లు సదుపాయాలను కల్పిస్తేనే విద్య, వైద్య, ఇతర వౌలిక సదుపాయాలు వారికి చేరువ అవుతాయని, ఆ దిశగా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. మండలాన్ని మలేరియా జోన్‌గా ప్రకటించాలని ప్రజలు కోరిన మేరకు ఈ విషయంపై అధికారులతో చర్చించి అవసరమైతే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామన్నారు. గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. సాలూరు నియోజకవర్గం పరిధిలో అటవీ అడ్డంకులు, ఇతర అడ్డంకులు 30 రోడ్లుకు క్లియరన్స్ వచ్చిందని, జిల్లాలో మరో 75 రోడ్ల్లకు క్లియరన్స్ రావల్సి ఉందని తెలిపారు. ఇక్కడ వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలన్నారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ స్వాతిరాణీ మాట్లాడుతూ రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ చేశారని, అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు. గిరిజనులకు చదువుకోసం విదేశాలకు వెళ్లేందుకు కూడా ఒక్కొక్క విద్యార్థికి 10లక్షల చొప్పున కేటాయిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మంత్రి దృష్టికి సమస్యలు : మంత్రి సుజయ్‌కృష్ణ దృష్టికి పలు సమస్యలను స్థానికులు తీసుకువచ్చారు. కేరంగి, తుమరావిల్లి, నెలియకంచూరు పరిధిలో గ్రామాల్లో లింకురోడ్ల ఏర్పాటుతోపాటు వౌలిక సదుపాయాలను కల్పించాలని ఎంపిటిసి సభ్యులు కొర్రజన్నిసింహాచలం, సోముల లచ్చయ్య కోరారు. మోసూరు వట్టిగెడ్డవద్ద వంతెనను నిర్మించాలని ఎంపిటిసి అలజంగి శారద కోరారు. పాచిపెంట ఆసుపత్రి పరిధిలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తక్షణమే వాటిని భర్తీచేయాలని, అదనపు భవనాలు నిర్మించాల్సి ఉందని ఆసుపత్రి అభివృద్ది కమిటీ ఛైర్మన్ ప్రసాదబాబు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భంజుదేవ్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పి.ఈశ్వరరావు, ఏ.ఎం.సి. వైస్ ఛైర్మన్ ముఖి సూర్యనారాయణ, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు పారమ్మ, టి.డి.పి. నాయకులు పాల్గొన్నారు.

‘చదువుకు సార్థకత చేకూర్చాలి’
కురుపాం, జూన్ 6: ప్రతీ ఒక్కరూ తాను చదువుకున్న చదువుకు సార్థకత చేకూరేలా కృషి చేయాలని పార్వతీపురం ఐటిడిఏ పిఓ లక్ష్మీషా కోరారు. మంగళవారం హైస్కూల్లో జరుగుతున్న నవనిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ పెద్దపెద్ద చదువులే చదువుతూ ఉద్యోగాల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారన్నారు. తాము చదువుకున్న చదువుకు సొంతంగా ఉపాది మార్గం అనే్వషించుకుంటే మరో నలుగురికి ఉపాది కల్పించవచ్చునన్నారు. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్‌కోర్సులు చదివిన వారు తమవద్దకు వచ్చి ఉద్యోగాలు అడుగుతున్నారని, చదివిన ప్రతీ ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదన్నారు. తామే స్వయం ఉపాధి పథకాలను స్థాపించుకోవాలన్నారు. దీని కోసం రుణాల మంజూరుతోపాటు వాటినైపుణ్యాలపై శిక్షణ అందిస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఏడాది మలేరియా కేసులతో ఒక్కరూ చనిపోవడానికి వీలు లేదన్నారు. మలేరియా నిర్మూలన కోసం ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చిన్నతరహా పరిశ్రమలను గిరిజన యువత ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మరుగుదొడ్లు నిర్మాణాలను చేపట్టిన ప్రతీ ఒక్కరూ వాటిని వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలను అందుకోవడమే తప్ప వాటిని వినియోగించే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే వి.టి.జనార్థన థాట్రాజ్ మాట్లాడుతూ 8వతేదీన జరిగే మహాసంకల్ప సభకు ప్రజలు తరలిరావాలన్నారు. అనంతరం గృహాలు మంజూరైన లబ్ధిదారులకు మంజూరుపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సి. ఛైర్మన్ కోలా రంజిత్‌కుమార్, దేశంపార్టీ నాయకులు ఏ.కోటేశ్వరరావు, బి.రామకృష్ణ పాల్గొన్నారు.

‘చదువుకు సార్థకత చేకూర్చాలి
* ఐటిడిఏ పిఓ లక్ష్మీషా
కురుపాం, జూన్ 6: ప్రతీ ఒక్కరూ తాను చదువుకున్న చదువుకు సార్థకత చేకూరేలా కృషి చేయాలని పార్వతీపురం ఐటిడిఏ పిఓ లక్ష్మీషా కోరారు. మంగళవారం హైస్కూల్లో జరుగుతున్న నవనిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ పెద్దపెద్ద చదువులే చదువుతూ ఉద్యోగాల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారన్నారు. తాము చదువుకున్న చదువుకు సొంతం గా ఉపాది మార్గం అనే్వషించుకుంటే మరో నలుగురికి ఉపాది కల్పించవచ్చునన్నారు. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సులు చదివిన వారు తమవద్దకు వచ్చి ఉద్యోగాలు అడుగుతున్నారని, చదివిన ప్రతీ ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదన్నారు. తామే స్వయం ఉపాధి పథకాలను స్థాపించుకోవాలన్నారు. దీనికోసం రుణాల మంజూరుతోపాటు వాటి నైపుణ్యాలపై శిక్షణ అందిస్తామన్నారు.
ఏజెన్సీ ప్రాం తాల్లో ఈ ఏడాది మలేరియా కేసులతో ఒక్కరూ చనిపోవడానికి వీలు లేదన్నారు. మలేరియా నిర్మూలన కోసం ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చిన్నతరహా పరిశ్రమలను గిరిజన యువత ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మరుగుదొడ్లు నిర్మాణాలను చేపట్టిన ప్రతీ ఒక్కరూ వాటిని వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలను అందుకోవడమే తప్ప వాటిని వినియోగించే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే వి.టి.జనార్థన థాట్రాజ్ మాట్లాడుతూ 8వతేదీన జరిగే మహాసంకల్ప సభకు ప్రజలు తరలిరావాలన్నారు. అనంతరం గృహాలు మంజూరైన లబ్ధిదారులకు మంజూరుపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సి. ఛైర్మన్ కోలా రంజిత్‌కుమార్, దేశంపార్టీ నాయకులు ఏ.కోటేశ్వరరావు, బి.రామకృష్ణ పాల్గొన్నారు.

పారిశ్రామిక అభివృద్ధికి కృషి
* మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు
సాలూరు, జూన్ 6: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు అన్నారు. స్థానిక వెలమపేటలోని శ్రీసీతారాముల కల్యాణ మండపంలో నవనిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామన్నారు. పెట్టుబడిదారులు ముందుకు రావాలన్నారు. పరిశ్రమలవలన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమలు రాకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. రైతుల సహకారంతో భోగాపురం విమానాశ్రయం రావడంతో ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతున్నారు. నియోజకవర్గంలో జ్యూట్ పరిశ్రమ సంక్షోభంలో పడిందన్నారు. ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సటీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర విభజన కారణంగా కేంద్రం నుంచి రావల్సిన నిదులు రావడం లేదన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మెరుగైన విద్యాబోధనలు, వైద్య సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
గిరిజన ప్రాంతంలోని విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు, విద్యాబోధనలు, ఆశ్రమ పాఠశాలలో వౌళికసదుపాయాల కల్పనపై దృష్టిసారిస్తామన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్ స్వాతిరాణి మాట్లాడుతూ మూడేళ్లలో ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా ముందుకు తీసుకువెళుతుందన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మాణాలు, రన్నింగ్ వాటర్, పాఠశాలలోవౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో జిల్లాను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ ప్రోత్సాహాకాలను తెలియజేసిన ప్రతులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే ఆర్.పి.్భంజుదేవ్, ఛైర్‌పర్సన్ విజయకుమారి, జిల్లాప్రచార కార్యదర్శి గొర్లె మాదవరావు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.