విజయనగరం

ప్రజాబలంతో టిడిపిని ఎండగట్టాలి: కోలగట్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 13: వైకాపాకు అధికారం, ధనబలం లేదని కేవలం ప్రజాబలంతోనే టిడిపి అవినీతిని ఎండగట్టాలని ఉత్తరాంధ్ర వైకాపా కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మంగళవారం జగన్నాధస్వామి కల్యాణ మండపంలో విలేఖరుల సమావేశంలో ఆయన జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ వచ్చే నెల 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్లీనరీకి జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ టిడిపి ప్రజాధనంతో మహానాడు నిర్వహిస్తే, వైకాపా కార్యకర్తలు, నాయకుల అండదండలతో ప్లీనరీ నిర్వహించనుందన్నారు. ఈ నెల 24వతేదీన జిల్లా ప్లీనరీ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ హాజరవుతారన్నారు. జిల్లా ప్లీనరీలో పలు తీర్మానాలు చేయనున్నామన్నారు. ఈ సమావేశంలో పి.సాంబశివరాజు, బొత్స అప్పలనర్సయ్య పాల్గొన్నారు.

అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం
* ఐటిడిఏ పిఓ లక్ష్మీషా
కురుపాం, జూన్ 13: ఉపాధి హామీపథకంలో అవకతవకలకు పాల్పడిన వారిపైచర్యలు తీసుకుంటామని పార్వతీపురం ఐటిడిఏ. పిఒ లక్ష్మీషా వెల్ల్లడించారు. మండలంలో గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన 6కోట్ల 78లక్షల రూపాయల పనులను సామాజిక తనిఖీ బృందం విచారణ చేపట్టింది. మంగళవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజావేదిక జరిగింది. ప్రాజెక్టు అధికారి ఒక్కొక్క పంచాయతీ వారీగా తనిఖీ వివరాలను తెలుసుకుని పలు అంశాలపై ఉపాధి హామీ సిబ్బంది, కార్యదర్శులపై చర్యలు తీసుకున్నారు. లక్షలాది రూపాయల రికవరీలను రాశారు. ఇంకుడు గుంతలు లేకుండానే బిల్లులు రాసి ఇవ్వడం, చనిపోయిన వారి పేరిట పెన్షన్లు అందించడం, ఉపాధి కూలీ అందించడం, బినామీ పేర్లుతో ఉపాధి పనులు చేయించడం వంటి పలు అవకతవకలను గుర్తించి వాటికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పి.ఓ. మాట్లాడుతూ మండలంలో అవకతవకలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఉన్నతస్థాయి సిబ్బంది సక్రమంగా పర్యవేక్షించక పోవడంతో కిందిస్థాయి సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్నారన్నారు. ఎక్కువగా బినామీ పేర్లతో పనులు చేయడం గుర్తించామన్నారు. లేని ఇంకుడు గుంతలకు బిల్లులు చెల్లించడం వాటిపై చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. గుమ్మిడిగూడ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ అప్పారావును సస్పెండ్ చేశామన్నారు. సిబ్బందికి రాసిన రికవరీ సొమ్మును పూర్తిస్థాయిలో రాబడతామన్నారు. పంచాయతీ కార్యదర్శులకు సోకాజ్ నోటీసులను జారీచేస్తున్నామని, వీరిపై సర్వీసు రిజిస్టర్‌లో అవకతవకలకు పాల్పడినట్లు రాస్తామన్నారు.
ఎవరైన సరే ఉపాధి హామీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పిఓ అన్నారు. ఇప్పటికే పలు మండలాల్లో కొంతమంది సిబ్బందిని సస్పెండ్ కూడా చేశామన్నారు. ఉపాధి హామీ వేతనదారులకు పనుల్లో అవగాహన లేదని, దశలవారీగా శిక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. అధికారులకు, కిందిస్థాయి సిబ్బందికి, వేతనదారులకు శిక్షణ ఇవ్వడం ద్వారా రోజువారీ వేతనం పెరిగేలా చూస్తామన్నారు. కురుపాం పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలకు పాల్పడినట్లుగా ఆధారాలతో సహా గ్రామస్థులు పి.ఓ.కు లిఖిత పూర్వకంగా అందించారు. కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ మద్ధతుదారులు గందరగోళం సృష్టించడంతో సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి. ఇందిరాకుమారి, జెడ్పీటిసి పద్మావతి, మండల ప్రత్యేక అధికారి కిరణ్‌కుమార్, ఎం.పి.డి.ఓ. పైడితల్లి, ఏ.పి.ఓ. వెంకటరమణ, సామాజిక తనిఖీబృందం, కార్యదర్శులు పాల్గొన్నారు.