విజయనగరం

పేదలకు ఉచిత వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 18: నిరుపేదలకు ఎన్‌టిఆర్ వైద్యసేవా పథ కం కింద గుర్తించిన 1044 శస్తచ్రికిత్సలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా ఉచిత వైద్యసేవలను ప్రభుత్వం అందిస్తుందని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తెలిపారు. పట్టణంలో ఏడో వార్డు బుక్కవీధి రామమందిరం వద్ద ఎన్‌టిఆర్ వైద్యసేవ హెల్డ్‌కార్డులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూఈ పథకం ద్వారా తెలుపురేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వైద్యసేవల నిమిత్తం సంవత్సరానికి 2.50 లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని అందిస్తుందని చెప్పారు. అదేవిధంగా పూర్తిగా చెవుడు కలిగిన రెండేళ్ల లోపుపిల్లలకు కాక్లియర్ శస్త్ర చికిత్స కోసం 6.5లక్షల రూపాయల మేరకు ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. ఉచిత మెడికల్ క్యాంప్‌ల ద్వారా గాని, ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులలో ఉన్న వైద్యమిత్ర ద్వారా గాని రెఫరల్ కార్డు పొందవచ్చునని తెలిపారు. అందువల్ల ఈ సదుపాయాన్ని అర్హులైన వారందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏడువ వార్డు అధ్యక్షుడు అప్పారావుతదితరులు పాల్గొన్నారు.