శ్రీకాకుళం

వస్త్ర వ్యాపారులు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూన్ 27: కేంద్ర ప్రభుత్వం జి ఎస్ టి విధానాన్ని జూలై 1 నుండి అమలుచేయనుంది. వస్త్రాలపై ట్యాక్స్ విధించడాన్ని నిరసిస్తూ వస్త్ర వ్యాపారులు ఈనెల 27 నుండి నాలుగు రోజులపాటు బంద్ ప్రకటించారు. ఈబంద్‌లో భాగంగానే మంగళవారం వస్త్ర వ్యాపారుల సంఘంభవనంలో నగర వస్త్ర వ్యాపారులంతా సమావేశాన్ని నిర్వహించుకొని తదుపరి కార్యక్రమాలను ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించారు. ఈసందర్భంగా సంఘంఅధ్యక్షుడుకోణార్కు శ్రీను మాట్లాడుతూ ఫుట్‌పాత్‌వ్యాపారం నుంచి షాపింగ్‌మాల్‌వరకు అందరూ వ్యాపారులు ఈబంద్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వస్త్రాలపై ఐదుశాతం ట్యాక్స్ విధించడాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నామన్నారు. తొలగించే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలియజేశారు. వస్తవ్య్రాపారుల ఐక్యత మరోవ్యాపారంలో లేదన్నారు. గతంలో వ్యాట్ విధించినప్పుడు 19 రోజుల పాటు బంద్ పాటించి వాటిని తొలగించడం జరిగిందన్నారు. వ్యవసాయం తరువాత బట్టల వ్యాపారం పరోక్షంగా దీనిపై ఆధారపడి జీవించే వారు ఎక్కువమంది ఉన్నారని తెలియజేశారు. ఈనెల 28న జిల్లా వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించి ర్యాలీగా కలెక్టరేట్‌కువెళ్లి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలియజేశారు. ఈసమావేశం స్థానిక ఏడురోడ్ల కూడలిలో వై ఎస్ ఆర్ కళ్యాణ మండపం వద్ద ప్రారంభమైన కలెక్టరేట్‌వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రధం చేయాలన్నారు. వస్తవ్య్రాపారులంతా ఐక్యంగా విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. జి ఎస్ ట పన్ను సామాన్యులపై పిడుగుపాటువంటిదని స్పష్టంచేశారు. జి ఎస్ టి రద్దయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు. ఈసమావేశంలో రఘు, చంద్ర, శిల్లా కాళీ, లక్ష్మణ్, శ్రీను, ముత్యాలరావు, మురళీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలపై దేశం పార్టీకి మార్పు రాకపోతే వినాశనం
ఆమదాలవలస, జూన్ 27: ప్రభుత్వ సంక్షేమపథకాల్లో జరుగుతున్న వైఫల్యాలపై ప్రభుత్వం తీరు మారకపోతే టిడిపికి వినాశనం తప్పదని వైకాపా నేత తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం ఆయన నివాస గృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్లసమావేశంలో మాట్లాడుతూ ప్లీనరీ సమావేశం నిర్వహించి వైకాపా కేడర్‌ను టీమ్‌లైజేషన్ చేశామని ఆయన తెలిపారు. ఈ నెల 28న జిల్లా స్థాయిలో జరగనున్న ప్లీనరీ సమావేశంలో వైకాపాకేడరంతాహాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుందని సీతారాం అన్నారు. ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు, విస్మరించిన హామీలపై ప్రధాన ప్రతిపక్షపార్టీగా వైకాపా టిడిపికి సూచిస్తున్నప్పటికీ పార్టీనేతలు స్పందించడంలేదన్నారు. జిల్లా,రాష్ట్ర స్థాయిలలో పలు తీర్మాణాలు చేసి ప్రభుత్వానికి అందిస్తామని సీతారాం అన్నారు. ఈసమావేశంలో వైకాపా నాయకులు బొడ్డేపల్లి రమేష్‌కుమార్, బొడ్డేపల్లి రమణ, చిరంజీవి నాగ్, అల్లంశెట్టి చిన్ని తదితరులు పాల్గొన్నారు.