విజయనగరం

అంగన్‌వాడీ ప్రీస్కూళ్లల్లో వౌలిక సదుపాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 21: పట్టణంలో అంగన్‌వాడీ ప్రీస్కూళ్లలో వౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె.కనకమహాలక్ష్మి తెలిపారు. అంగన్‌వాడీ ప్రీస్కూళ్ల నిర్వహణపై గురువారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీ ప్రీస్కూళ్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. దాతల సాయంతో ప్రీ స్కూళ్లను ఆకర్షణీయంగా తయారు చేయాలని, ప్రీస్కూళ్లకు వచ్చే పిల్లలందరికీ అన్ని సౌకర్యాలను కల్పించాలని తెలిపారు. పట్టణంలో కణపాక, బూడివీధి, విటి అగ్రహారం, బిసి కాలనీ, ధర్మపురి, గాజులరేగ, అయ్యన్నపేట తదితర చోట్ల 19 అంగన్‌వాడీ ప్రీస్కూళ్లను ఏర్పాటు చేశామన్నారు. నర్సరీలో 400 మంది, ఎల్‌కెజిలో 495 మంది, యుకెజిలో 275 మంది చిన్నారులు చదువుతున్నారని చెప్పారు. వీరందరికీ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ డి.ఆనందరావు, అంగన్‌వాడీ ప్రీస్కూల్స్ కన్సల్టెంట్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ గేట్‌వద్ద
ఆక్రమణల తొలగింపు
విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 21: ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్‌గేట్‌లో మున్సిపల్, పోలీసు, ఆర్టీసీ అధికారుల ఆధ్వర్యంలో గురువారం ఆక్రమణల తొలగించారు. బస్సుల రాకపోకలకు ఇబ్బందికరంగా తయారైన వాటిని తొలగించారు. ఆక్రమణల తొలగింపును రోడ్డు సెఫ్టీ డిఎస్పీ గురుమూర్తి, మున్సిపల్ అసిస్టెంట్ సిటీప్లానర్లు శోభన్‌బాబు, హరిదాస్, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎన్‌విఆర్ వరప్రసాద్, డిపోమేనేజర్ ఎన్‌విఎస్ వరప్రసాద్, అసిస్టెంట్‌మేనేజర్ శర్మ పర్యవేక్షించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలలో రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపోవడంవల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటమే కాకుండా బస్సులు, వాహనాల రాకపోలకు కూడా ఇబ్బందికరంగా తయారైందని రోడ్డు సెఫ్టీ డిఎస్పీ గురుమూర్తి తెలిపారు.

చంద్రబాబుతోనే సంక్షేమం
* మాజీ మంత్రి మృణాళిని
చీపురుపల్లి, సెప్టెంబర్ 21: ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలతో లబ్దిచేకూరుతుందని శాసనసభ్యురాలు కిమిడి మృణాళిని అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం గురువారం మండలంలోని పత్తికాయవలసలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేసే దశగా ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారన్నారు. తోటపల్లి సాగునీరు చీపురుపల్లికి వచ్చిందని తెలిపారు. తోటపల్లి సాగునీటితో బీడుభూములు సైతం పంటపొలాలు అవుతున్న విషయాన్ని రైతులు గుర్తుంచాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పథకాలు అందని వారు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు ఆర్‌ఇసిఎస్ ఛైర్మన్ ధన్నాన రామచంద్రుడు, కిమిడి నాగార్జున పాల్గొన్నారు.