విజయనగరం

బొబ్బిలిలో ‘అన్నదాత సుఖీభవ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, సెప్టెంబర్ 21: అన్నదాతల సమస్యల పరిష్కారానికి పెద్ద మనస్సుతో ప్రభుత్వాలు ముందుకు రావాలని, లేనిపక్షంలో వారి జీవనాలు దుర్భరం అవుతాయని ప్రముఖ సినీనటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ అనే చలనచిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను గురువారం పట్టణంలోని పలుప్రాంతాల్లో చిత్రీకరించారు. ప్రధానంగా తప్పిటగుళ్ల్లకు సంబంధించిన కళాకారుల సమస్యలు, వారి జీవనవిధానాల అంశాలపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈసందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు సంబంధించిన పలు అంశాలను ఇతివృత్తంగా చేసుకుని ‘అన్నదాత సుఖీభవ’ అనే చలనచిత్రాన్ని చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని, నవంబర్‌లో వరికి సంబంధించిన ఉభాలు, కోత, ఇతర అంశాలను చిత్రీకరిస్తామని, ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. అన్నదాతలకు మద్ధతు ధర లేకపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన ధర రాక కష్టాలు పడుతున్నారని నారాయణమూర్తి తెలిపారు. వీరి సమస్యలపట్ల ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పంట పెట్టుబడులకు, మద్ధతు ధరకు మధ్య వ్యత్యాసం చాలా ఉందని, దీని ద్వారా వారికి ప్రయోజనం చేకూరడం లేదన్నారు. ఈనేపథ్యంలో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి జీవన విధానం, వారి సమస్యలపై ఈ చిత్రంలో ఎక్కువగా చిత్రీకరించామని తెలిపారు.

పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు
* మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ
విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 21: పట్టణంలో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మున్సిపల్‌చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తెలిపారు. ఒక్కొక్క వార్డు అభివృద్ధికి కోటి రూపాయల మేరకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా గురువారం 26వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. పట్టణంలో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని, మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విఎస్‌ప్రసాద్ మాట్లాడుతూ రాష్టవ్రిభజన తర్వాత ఆర్థికపరిస్థితి దిగజారినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమమార్గంలో నడిపిస్తున్నారని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం అర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నప్పటికీ రైతు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ సైలాడ త్రినాథరావు, వార్డు కౌన్సిలర్ బొబ్బాది త్రినాధరావు, మాజీ కౌన్సిలర్ బొబ్బాది విజయలక్ష్మి, పార్టీ నాయకులు తోలాపి మోహనరావు, పసగాడ రామకృష్ణ పాల్గొన్నారు.