విజయనగరం

మత్స్యశాఖ డిడిపై సభ్యుల ధ్వజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 21: జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు వాడిగావేడిగా జరిగాయి. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో వైస్‌చైర్మన్ బలగం కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మత్స్యశాఖ, ఆర్టీసీ ఇతర శాఖల పనితీరుపై సభ్యులు ధ్వజమెత్తారు. పూసపాటిరేగ జెడ్పీటిసి ఎ.ప్రసాదరావు మాట్లాడుతూ జిల్లాలో మత్స్యశాఖకు ఎస్‌డిపి కింద ఎంత మొత్తంలో నిధులు వచ్చాయి? ఎంత ఖర్చు చేశారని డిడి కనకరాజును అడగ్గా ఆయన నోరు మెదపలేదు. ఆ శాఖకు ఎంత నిధులు వచ్చాయి, ఎంత ఖర్చు చేశారో తెలియనప్పుడు సమావేశానికి రావడం ఎందుకని డిడిని నిలదీశారు. గత సమావేశంలో అడిగిన ప్రశ్నలకు కూడా నేటి వరకు సమాధానం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై డిడి మత్స్యశాఖకు రూ.4 కోట్లు వచ్చాయని తెలుపగా, జెడ్పీటిసి ప్రసాదరావు ఆ శాఖకు రూ.10కోట్లు వచ్చాయని సమాధానమిచ్చారు. ఇటీవల మంత్రి లోకేష్ వచ్చినప్పుడు ఆయన చేతుల మీదుగా కిట్లు పంపిణీ చేద్దామంటే మా దగ్గర నిధులు లేవని చేతులెత్తేశారని ఆయన మండిపడ్డారు. బోట్లు, వలలు కొనుగోలు విషయంలో అధిక ధరలను కోట్ చేయడం వల్ల కలెక్టర్ వివేక్‌యాదవ్ దానిపై మళ్లీ టెండర్ పిలవాలని ఆదేశించారని జెడ్పీటిసి ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి డిడి కనకరాజు వౌనంగా ఉండటంతో ఉత్సవ విగ్రహంలా ఉండటం వల్ల ఉపయోగం లేదని, తాము అడిగిన ప్రశ్నలకు వచ్చే సర్వసభ్య సమావేశంలో తెలపాలన్నారు.
డుమ్మా కొట్టిన అధికారులకు నోటీసులు
జెడ్పీ స్థాయి సంఘ సమావేశానికి డిఆర్‌డిఎ పిడి, ఆర్టీసీ ఆర్‌ఎం, సిపిఒ, జిల్లా మలేరియా అధికారి హాజరుకాకపోవడంతో డుమ్మా కొట్టిన జిల్లా స్థాయి అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై జెడ్పీ సిఇఒ వేంకటేశ్వరరావు మాట్లాడుతూ చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ అనుమతితో నోటీసులు జారీ చేస్తామన్నారు.
బ్యాంకుల కోసమా పథకాలు?
జిల్లాలో వివిధ పథకాల కింద లబ్దిదారులను ఎంపిక చేసినప్పటికీ బ్యాంకర్లు మాత్రం లబ్ధిదారుని పేరున ఖాతాలు తెరవకపోవడం వల్ల యూనిట్లు గ్రౌండ్ కావడం లేదని సభ్యులు తెలిపారు. జిల్లాలో 2016-17కు 727 మందికి యూనిట్లు మంజూరు చేయగా, 10 మంది మాత్రమే యూనిట్లు నెలకొల్పారని, బ్యాంకర్లు లబ్ధిదారులకు ఖాతాలు తెరవకపోవడం వల్ల మిగిలిన యూనిట్లు గ్రౌండ్ కాలేదని పేర్కొన్నారు. సబ్సిడీలు మంజూరు చేయగా అవి బ్యాంకుల్లో మూలుగుతున్నాయని, నేటివరకు లబ్ధిదారునికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయలేదని ఎస్సీ కార్పొరేషన్ ఇడి రాజును సభ్యులు నిలదీశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఇక ముందు బ్యాంకులను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవాలని ఇటీవల జిల్లా కలెక్టర్ డిసిసి సమావేశంలో నిర్ణయించారన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, జెడ్పీటిసిలు పాల్గొన్నారు.