విజయనగరం

విజయనగరానికి వనె్న తెచ్చిన ‘గురజాడ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(పూల్‌బాగ్) సెప్టెంబర్ 21:మహాకవి గురజాడ అప్పారావు విజయనగరానికి వనె్న తెచ్చారని జెసి కె.నాగేశ్వరరావు అన్నారు.్భషా సాంస్కృతిక శాఖ ఆధునిక తెలుగుదినోత్సవం పేరిట నిర్వహించిన గురజాడ జయంతిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని మూఢాచారాలను ఖండిస్తూ ఆయన రాసిన కన్యాశుల్కం అపురూపమైన గ్రంథమన్నారు. ముందుగా గురజాడ స్వగృహంలో గురజాడ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.గురజాడ పాఠశాలకు చెందిన విద్యార్థులు గురజాడ రాసిన దేశభక్తి గీతం ఆలపిస్తుండగా ఊరేగింపుగా మహారాజా కళాశాలవద్ద ఉన్న గురజాడ విగ్రహం వద్దకు చేరారు. అధికారులు,కళాకారులు, గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఊరేగింపు ఆనందగజపతి ఆడిటోరియంకు చేరింది. ఆడిటోరియం వేదికపై గురజాడ చిత్రపటంవద్ద జ్యోతి వెలిగించారు. డప్పు శ్రీనివాస్ బృందం ఆలపించిన ఎంతో చక్కని వాడా, ముందుచూపువాడా గీతం ఆహూతుల కరతాళ ధ్వనులను అందుకుంది.్భగవతీ నృత్యకళామందిర్ విద్యార్థినులు రమణకుమారి ఆధ్వర్యంలో స్వాగత నృత్యం ప్రదర్శించారు. లోక్‌సత్తా పార్టీరాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాజ్జీ మాట్లాడుతూ గురజాడ రాసిన దేశమును ప్రేమించుమన్నాగేయం ఏదేశానికైనా సరిపోతుందన్నారు. గురజాడ, గిడుగు, ఆదిభట్ల వంటి మహనీయులవల్ల విజయనగరం ఖ్యాతి దేశవిదేశాల్లో వెలుగొందిందని చెప్పారు. గురజాడ జయంతిని పురస్కరించుకుని వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ఆందజేశారు.అనతరం కవితాపఠనం జరిగింది. ఈకార్యక్రమంలో జిల్లావిద్యాశాఖాధికారిణి అరుణకుమారి, మున్సిపల్ కమీషనర్ అనిత, గురజాడ ఇందిర, గురజాడ ప్రసాద్ గురజాడ సాంస్కృతిక సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
విజయనగరం(పూల్‌బాగ్),సెప్టెంబర్ 21: శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పలు దేవీ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దేవీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయాలను దర్శించుకుని పూజలు జరిపారు.పట్టణంలోని బొండాడ వీధిలో ఉన్న కామాక్షి సమేత ఏకాంబరేశ్వరస్వామివారి ఆలయంలో కొలువైన కామాక్షి అమ్మవారికి ప్రత్యేక కుంకుమపూజలు నిర్వహించారు.వేకువజామున ఆలయ అర్చకులు అండలూరి గంగాధర్ కుంకుమపూజలు జరిపారు. అనంతరం అమ్మవారిని బాలాత్రిపుర సుందరిగా అలంకరించి కట్టు పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారికి పూజలు జరిపారు. వనంగుడిలో ని పైడితల్లి అమ్మవారు దుర్గామాతగా భక్తులకు దర్శనమిచ్చారు.వేదపండితులు శంభరశంకరం, తాతారాజేష్ ఆ ధ్వర్యంలో శ్రీచక్ర పూజలు భక్తులు ని ర్వహించారు. రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో కొలువైన సర్వకామదాంబ అమ్మవారికి, కన్యకాపరమేశ్వరి అమ్మవారికి విశేషపూజలు జరిపారు. భక్తులు అమ్మవారి ఆలయాలను సందర్శించి తమ గోత్రనామాలతో పూజలు జరిపించుకున్నారు.