విజయనగరం

వినియోగదారునికి ‘చింత’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్కువ, ఏప్రిల్ 19: చింతపండు ధర పెరగడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల్లోనే కిలో చింతపండు ధరపై 9 రూపాయలు పెరగడంతో 28 నుంచి 37 రూపాయలకు కిలో ధర చేరింది. ఈ ఏడాది చింతపండు దిగుబడి తక్కువగా ఉండడంతో ధరలు పెరుగుతున్నట్టు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని నంద, దుగ్గేరు, కేశలి తదితర వారపు సంతల్లో గిరిజనులు చింతపండును విక్రయిస్తుంటారు. చింతపండు విక్రయాలు చేపట్టిన మొదటిలో కిలో 20 రూపాయల చొప్పున కొనుగోలు చేసేవారు. ఇటీవల కాలంలో ధరలు పెరగడంతో నాలుగు రూపాయల డబ్బులు కళ్లజూస్తున్నామని గిరిజనులు అంటున్నారు. అయినప్పటికీ వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా మారి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గర కొన్న చింతపండు ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు సంతలకు వస్తుండడంతో అమాంతంగా ధర పెరిగిందని తెలిపారు. గిరిజన ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన జిసిసి అధికారులు మాత్రం కిలో చింతపండును ఇప్పటికీ 22 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో గిరిజనులు కూడా దళారులు, బయట వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు నేరుగా గిరిజన గ్రామాలకే వెళ్లి చింతపండు కొనుగోలు చేయడంతో సామాన్యులకు అందడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.