విజయనగరం

సైకిలెక్కిన బొబ్బిలిరాజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 20: బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రంగారావుతోపాటు ఆయన సోదరుడు బేబీనాయన, నియోజకవర్గం పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బొబ్బిలి, తెర్లాం ఎంపిపిలు, బొబ్బిలి, తెర్లాం, రామభద్రాపురం జడ్పీటిసిలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. వీరితోపాటు పక్క నియోజకవర్గం పార్వతీపురం పరిధిలోని సీతానగరం జడ్పీటిసి, ఎంపిపి కూడా పచ్చకండువా కప్పుకున్నారు. నియోజకవర్గ స్థాయి నాయకులతోపాటు గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా టిడిపిలో చేరటంతో నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక్కడ ఖాళీ అయినట్లయింది. మంగళవారం రాత్రి నుంచే బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, పార్టీశ్రేణులు, పార్టీతరపున ఎన్నికైన ఎంపిటిసిలు, సర్పంచులు, బొబ్బిలి మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు విజయవాడకు తరలివెళ్లారు. సుమారు 700మంది ప్రజాప్రతినిధులు, నాయకులు విజయవాడకు తరలినట్లు నియోకవర్గ నాయకుల సమాచారం. వీరికోసం ఆయా మండలాల నుంచి ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేసారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, జిల్లామంత్రి మృణాళిని, టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జగదీష్, పలువురు ఎమ్మెల్యేలు, సమన్వయ కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్యనాయకులు కూడా ఈ కార్యక్రమానికి తరలివెళ్లారు. బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్యే రంగారావు, ఆయన సోదరుడు బేబీనాయన, నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు, ఆయన సోదరుడికి, పలువురు ముఖ్యనాయకులకు చంద్రబాబు పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివిధ స్థాయిల నాయకులను ఎమ్మెల్యే రంగారావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిచయం చేసారు.
సమన్వయంతో పనిచేయండి
పార్టీకోసం ఏళ్లతరబడిగా పనిచేస్తున్న నాయకులు, కొత్తగా పార్టీలో చేరుతున్న నాయకులు సమన్వయంతో వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు టిడిపిలో చేరిన సందర్భంగా చంద్రబాబు పార్టీనాయకులను ఉద్ధేశించి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సక్రమంగా జరగని కారణంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోందని, కేంద్రం నుంచి కూడా ఆశించిన సహాయం అందటం లేదని చెబుతూ. ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేసి రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలని సూచించారు. ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాను టిడిపిలో చేరానే తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని అన్నారు. వైఎస్ జగన్ అంటే తనకు ఇప్పటికీ గౌరవమేనని తెలిపారు.