ఆంధ్రప్రదేశ్‌

నూతన డిఇఒగా నాగమణి బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 13: జిల్లా విద్యాశాఖాధికారిణిగా జి.నాగమణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డిఇఒగా పనిచేసిన ఎస్.అరుణకుమారి విజయవాడకు బదిలీ కావడంతో ఆమె స్థానంలో నాగమణి ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి, పాఠశాలల్లో విద్యా బోధన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
* అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు * మంత్రి సుజయ్‌కృష్ణ

విజయనగరం, డిసెంబర్ 13: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర గనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. బుధవారం ఆయన జెడ్పీ సమావేశ మందిరంలో ప్రజాదర్భార్ నిర్వహించారు. గతంలో మూడుసార్లు ప్రజాదర్భార్ నిర్వహించగా ఇది నాల్గొవది. కాగా, ఈ దర్భార్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేశారు. ఈ సందర్భంగా జామిలోని ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పీర్లుగుండం చెరువు ఆక్రమణకు గురైందని ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అలాగే ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి కింద పెద్ద బంటుపల్లికి చెందిన ఎస్సీలు వాహనాల మంజూరు కోసం లబ్ధిదారుని వాటా చెల్లించినప్పటికీ నేటి వరకు వాటిని మంజూరు చేయలేదన్నారు. పట్టణంలో నాయిబ్రాహ్మణులు 40వేల మంది వరకు ఉన్నారని వారికి సంగీత పాఠశాల నిర్మాణానికి స్థలం మంజూరు చేయాలని సంఘం ప్రతినిధులు ఆర్.రామారావు, బుజ్జిబాబు తదితరులు విన్నవించారు. సాలూరు పట్టణంలోని వినియోగదారుల మండలికి చెందిన సుదర్శనరావు తమకు ఐపిడిఎస్ విద్యుత్ పనులు ప్రారంభించాలని కోరారు. పట్టణంలో దండుమారమ్మ కాలనీకి అప్రోచ్ రోడ్డు మంజూరు చేయాలని స్థానికులు విన్నవించారు. అరబిందో, మైలాన్ పరిశ్రమలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, ఇతర ప్రాంతాలకు చెందిన వారికి యాజమాన్యాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా వీటితోపాటు పలువురు తమ వ్యక్తిగత సమస్యలపై కూడా మంత్రికి మొరపెట్టుకున్నారు.
అర్హులకు పధకాలు అందించడమే మా ధ్యేయం
ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలన్నదే తమ ధ్యేయమని మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. వ్యక్తిగతంగా అర్హులై ఉంది ప్రభుత్వ పథకాలు అందని వారు ఉంటే ఆ సమస్యలు మా దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఎక్కువగా భూ తగాదాలు, ఇతర రకాల ఇబ్బందుల గురించి ఫిర్యాదులు అందాయన్నారు. మరికొన్ని నిధులతో ముడిపడి ఉన్నవి ఉన్నాయన్నారు. వీటిలో ఆర్థిక అంశాలకు సంబంధించినవి జిల్లా స్థాయిలో పరిష్కరించగలిగినవి జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలో పరిష్కరించదగినవి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని మంత్రి సుజయ్‌కృష్ణ స్పష్టం చేశారు.

కార్యదర్శుల నియామకం పట్ల హర్షం
ఆంద్రభూమి బ్యూరో
విజయనగరం, డిసెంబర్ 13: రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించడం వల్ల పంచాయతీ కార్యదర్శుల పనిభారం తగ్గడమేగాకుండా సమర్ధవంతంగా పరిపాలన సాగించేందుకు వీలవుతుందని ఎన్జీవో సంఘం ప్రతినిధులు ఆర్‌వి రమణమూర్తి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం జెడ్పీ మినిస్టీరియల్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామాల్లో మంచినీటి సరఫరా, పారిశుద్ధ నిర్వహణ, వీధిదీపాల నిర్వహణ, పన్ను వసూళ్లు తదితర అంశాలపై దృష్టిసారించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా డివిజన్ స్థాయిలో డివిజనల్ అభివృద్ధి అధికారులను నియమించడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.

సాకేత్‌కు బంగారు పతకం
విజయనగరం, డిసెంబర్ 13: ఇటీవల జెన్‌ఎన్‌టియు కాకినాడ ఆధ్వర్యంలో టెక్కలిలో ఐతమ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్థానిక ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన జి.సాకేత్‌కు మొదటి బహుమతి కింద బంగారు పతకం లభించింది. కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన సాకేత్ బంగారు పతకం గెల్చుకోవడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవిఎల్ రాజు, అధ్యాపక సిబ్బంది అతనిని అభినందించారు.

పది కిలోల గంజాయి స్వాధీనం
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, డిసెంబర్ 13: పట్టణంలోని గూడ్స్‌షెడ్ వద్ద ఓ వ్యక్తి నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పీ ఎఎస్ చక్రవర్తి చెప్పారు. బుధవారం వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడ్స్‌షెడ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న గోపాల్ డెంగీ, దినేష్‌కుమార్‌లను అదుపులోకి తీసుకొని వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. తమకు అందిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి వారిని పట్టుకున్నామన్నారు. వీరిలో డెంగీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సూద్‌వాస గ్రామానికి చెందిన వారు కాగా, దినేష్‌కుమార్ హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాకు చెందినవారని వివరించారు. ఈ సమావేశంలో వన్‌టౌన్ సిఐ చంద్రశేఖర్, ఎస్సై ఎవి రమణలు ఉన్నారు.

ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చేయాలి

గజపతినగరం, డిసెంబర్ 13: ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రజలు సహకరించాలని స్థానిక ఎంపిడిఒ ఎస్.కృష్ణవేణమ్మ కోరారు. బుధవారం మధ్యాహ్నం మండలంలోని పాతశ్రీరంగరాజపురం గ్రామంలో పల్లెకుపోదాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ప్రతి వ్యక్తి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని వినియోగించుకున్నపుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. స్వచ్ఛత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామస్తులకు మరుగుదొడ్లు నిర్మాణంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. గ్రామాలలో నిర్మిస్తున్న డంపింగ్‌యార్డులకు చెత్తాచెదారాలను అందజేయాలని అన్నారు. అంతకుముందు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా పలువురు గ్రామస్తులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి జనార్థనరావు, ఎపిఒ కృష్ణవేణి, గ్రామ సర్పంచ్ ఏనుగుల శ్రీనివాసరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నైతిక విలువలు పెంపొందించుకోవాలి

గజపతినగరం, డిసెంబర్ 13: నైతిక విలువలు పెంపొందించుకోవడం ద్వారా మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుందని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర విద్యావిభాగం కన్వీనర్ డాక్టర్ సిఎ ప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక గురజాడ పాఠశాలలో జెవివి ఆధ్వర్యంలో దివంగత పల్లి తిరుపతిరావు 14వ వర్థంతిని పురస్కరించుకుని విద్యార్థులకు నైతిక విలువలు అనే అంశంపై జెవివి జాతీయ ఉపాధ్యక్షుడు గండ్రేటి లక్ష్మణరావు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుడు బోధించిన విలువలతో కూడిన విద్యను గుణాత్మక విద్యను అలవర్చుకోవాలని సూచించారు. మంచి నీతి కథలలోని ముఖ్యమైన సారాంశాన్ని అలవర్చుకోవడం ద్వారా మంచి విద్యార్థులగా తయారవుతారని అన్నారు. జెవివి సీనియర్ నాయకులు వెంకటరావు మాట్లాడుతూ ప్రణాళిక బద్దంగా చదివితే ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పారు. కష్టమైన విషయాలను ఇష్టంగా చదవాలని అన్నారు. అనంతరం గజపతినగరం శాఖా గ్రంథాలయ అధికారి మరడాన త్రినాథరావు దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండల సత్యనారాయణ, సలహా మండలిరాష్ట్ర సభ్యుడు గండ్రేటి అప్పలనాయుడు, సాంస్కృతిక విభాగం కన్వీనర్ జి.శ్రీను, జెవివి నాయకులు కర్రి సత్యనారాయణ, రోహిణీదేవి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుని మృతి

గజపతినగరం, డిసెంబర్ 13: మండలంలోని మధుపాడ గ్రామ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ విశాఖలోని కె.జి.హెచ్‌లో మృతిచెందాడు. శృంగవరపుకోటకు చెందిన డి.హేమంత్(18) ద్విచక్రవాహనంపై సాలూరు నుండి గజపతినగరం వైపు వస్తుండగా విశాఖ నుండి పార్వతీపురం వెళుతున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హేమంత్ మోటారుసైకిల్ అదుతప్పి రోడ్డును బలంగా ఢీకొట్టింది. హేమంత్ తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కెజిహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గజపతినగరం ఎస్సై పి.వరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పొగమంచుతో ప్రజలు అవస్థలు

కొత్తవలస, డిసెంబర్ 13: మండలంలో రెండవరోజు కూడా పొగమంచు విపరీతంగా కురిసింది. దీంతో మండలంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం, బుధవారం రెండు రోజులూ పొగమంచు కారణంగా ప్రయాణీకులు, ఉద్యావన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మామిడిపూతపై మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

సిబ్బంది కొరతను పై అధికారులకు నివేదిస్తాం

కొత్తవలస, డిసెంబర్ 13: వియ్యంపేట పిహెచ్‌సిలో బుధవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పి.రాము అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించేందుకు సిబ్బంది కొరత ఉందని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. గర్భిణీలకు, రోగులకు పూర్తిగా ఆరోగ్య తనిఖీలు నిర్వహించేందుకు కావాల్సిన సిబ్బంది లేకపోవడంతో వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. స్టాప్‌నర్సు ఉన్న సిబ్బందిలో కొంతమంది గైర్హాజరుకావడంపై చైర్మన్ మండిపడ్డారు. ఆసుపత్రి నిధులు సరైన వాటికి ఖర్చుచేయాలని, వృధా ఖర్చులు సహించనని రాము పేర్కొన్నారు. దోమతెరలపంపిణీ, చంద్రన్న ఆరోగ్య కిట్లు ప్రీగా అందుతున్నాయోలేదోనని చైర్మన్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

బడి రుణం తీర్చుకున్నారు
* కంప్యూటర్లు అందజేసిన పూర్వ విద్యార్థులు

గజపతినగరం, డిసెంబర్ 13: గజపతినగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుని ప్రస్తుతం ఉన్నత ఉద్యోగాలలో ఉన్న ముగ్గురు పూర్వ విద్యార్థులు బడి రుణం తీర్చుకున్నారు. ఆరవ తరగతినుంచి పదవ తరగతి వరకు ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వవిద్యార్థులు డాక్టర్ బుగత సురేంద్ర కుమార్, ఎన్‌ఆర్‌ఐలు ముక్కవల్లి ఉదయభాస్కర్, కె. చైతన్యకుమార్‌లు లక్ష రూపాయలు విలువచేసే నాలుగు కంప్యూటర్ సెట్లను ప్రధానోపాధ్యాయుడు కె.వి.బి. ఆచార్యులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో డాక్టర్ సురేంద్రకుమార్ మాట్లాడుతూ పాఠశాలకు ఎన్నో ఏళ్ల తరువాత రావడం మధురానుభూతి కలిగిస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థి పైస్థాయికి వెళ్లగానే చదువుకున్న పాఠశాలను, గురువులను మరచిపోవద్దని అన్నారు. తోచిన సాయం చదువుకున్న పాఠశాలకు చేస్తే ఆతృప్తి వేరే అని అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మోహన్, ప్రదీప్‌కుమార్, శ్రీనివాసరావు, రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
* జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 13: జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన నాగమణిని ఎపిటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎ.సదాశివరావు, జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వరరావు,ప్రధాన కార్యదర్శి జెసి రాజు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా జెసి రాజు మాట్లాడుతూ జిల్లాలో విద్యా రంగ సమస్యలతోపాటు ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాగమణిని కోరారు. అదేవిధంగా పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన నాగమణి మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగ సమస్యలతోపాటు ఉపాథ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యాప్రణామాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, డ్రాప్‌అవుట్ లేకుండా చూడాలని, బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని ఈ సందర్భంగా ఆమె ఎపిటిఎఫ్ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, మధు, చినసత్యం తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
* ఆర్టీసీ ఇయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 13: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెదమజ్జి సత్యనారాయణ తెలిపారు. రెండురోజుల ధర్నాలో భాగంగా బుధవారం స్థానిక ఆర్టీసీ జోనల్ వర్క్స్‌షాపులో ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాకపోయినప్పటికీ బస్సులు తగ్గింపు, కార్మికుల కుదింపే లక్ష్యంగా యాజమాన్యం వ్యవహరిస్తుందన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులను డిజెంగేజ్ చేశారని తెలిపారు. ఈ విషయాల గురించి గుర్తింపుకార్మిక సంఘమైన ఎన్‌ఎంయు కనీసం పట్టించుకోవడం లేదని చెప్పారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుచేసి తొలగించిన కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లను వెంటనే విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడపాలన్నారు. విజయవాడలో నిర్మిస్తున్న కేంద్ర ఆసుపత్రిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆర్టీసీ ఆస్తులను లీజుకు ఇచ్చే విధానాన్ని మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జోనల్ అధ్యక్షుడు సిహెచ్.వెంకటరావు, నాన్ ఆపరేషన్ రీజనల్ కార్యదర్శి వి.ఎర్రినాయుడు, యూనియన్ నాయకులు అప్పలరాజు, అప్పారావు, వెంకటరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి విద్యార్థి సత్ప్రర్తన కలిగి ఉండాలి
* ఎయు కేంపస్ ప్రత్యేకఅధికారి ప్రొఫెసర్ అప్పారావు

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 13: ప్రతి విద్యార్థి మంచి సత్ప్రవర్తన కలిగి ఉండి, నైతిక విలువలను పెంపొందించుకోవాలని ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రాంగణం (ఎయుకేంపస్) ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ చౌదరి అప్పారావుకోరారు. స్థానిక ఎయు ప్రాంగణంలో కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగంలో బుధవారం జరిగిన ప్రెషర్స్‌డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అప్పారావుమాట్లాడుతూ విద్యార్థులు మితిమీరిన స్నేహానికి, వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా జీవితంలో మంచి ఎత్తుకు ఎదగవచ్చునని తెలిపారు. జీవితంలో ఉన్న శిఖరాలను అధిరోహించేందుకు ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పచుకోవాలని, దాని సాధనకు నిరంతరం శ్రమించాలని చెప్పారు. జీవితంలో ఏదీ ఈజీ కాదని, ప్రయత్నిస్తే కష్టమేమి కాదని అన్నారు.. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ సానుకూల ధృక్పధాన్ని అలవర్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ విభాగాధిపతి డాక్టర్ పొదిలాపు హనుమంతరావు, నీరజారతన్, డాక్టర్ బివి సుబ్బయ్య, డాక్టర్ రంజిత్‌కుమార్, కిరణ్, ప్రయాంక తదితరులు పాల్గొన్నారు.