విజయనగరం

పూర్తి సమాచారం ఉండాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్),డిసెంబర్ 28: జన్మభూమి కార్యక్రమం జనవరి రెండునుండి జరగనుందని పౌరసరఫరాల అంశం ఈ జన్మభూమిలో కీలకంగా ఉం టుందని అధికారులు సమగ్ర సమాచారంతో గ్రామసభలకు హాజరు కావాలని రాష్ట్ర సివిల్ సప్లయిస్ సంచాలకులు రవిబాబు అధికారులకు ఆదేశించారు. సోమవారం ఆయన జెసి శ్రీకేష్ బాలాజీ లఠ్కర్‌తో కలిసి పౌరసరఫరాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మభూమి కార్యక్రమం ప్రారంభం రోజున జిల్లాలో పర్యటించనున్నారని ఈ నేపథ్యంలో అన్ని విషయాలతో అధఙకారులు సన్నద్ధంగా ఉండాలని చెప్పా రు. జన్మభూమికి వెళ్లేముందు ప్రతికార్డును సమీక్షించుకోవాలని సూచించారు. ఆధార్ లేదు రేషనురాదని చెప్ప డం కాకుండా ఆ లబ్ధిదారున్ని ఆధార్ కేంద్రానికి తీసుకుని వెళ్లి ఆధార్ చేయించాలని స్పష్టం చేసారు. రేషనుకార్డులపై రేషనుఅవసరంలేని కార్డుదారులు వాటిని ఇస్తే నే వారికి బెనిఫిట్ కార్డు ఇస్తామని చెప్పా రు.అటువంటి వారినుండి దరఖాస్తులు తీసుకోవాలని తెలిపారు. చౌకధరల దుకాణం వారీగా జాబితాలతో, డీలర్ వారీగా సమాచారంతో హాజరుకావలని అన్నారు. చంద్ర న్న సంక్రాంతి కానుకలు శతశాతం ఇ- పాస్ ద్వారా పంపిణీ చేయాలని, నాణ్యతగా ఉండాలని పౌరసరఫరాల జిల్లా మేనేజరు గణపతిరావును ఆయన ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ బాలాజీ లఠ్కర్ మాట్లాడుతూ 88శాతం సరకులు ఇ-పాస్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు. కొన్ని షాపుల్లో 99శాతం అమలు అవుతున్నదని తెలిపారు. జన్మభూమి నాటికి సమస్యలన్నీ పరిష్కరించుకుని వెళతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌ఒ నాగేశ్వరరావు,మార్కెటింగ్ ఎడి శ్రీనివాసరావు, పౌరసరఫరాల సిబ్బంది పాల్గొన్నారు.

2న సిఎం చంద్రబాబు రాక
బొండపల్లిలో బహిరంగ సభ
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే
బొండపల్లి, డిసెంబర్ 28: రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు జనవరి 2వ తేదీన మూడో విడత జన్మభూమి కార్యక్రమాన్ని బొండపల్లి గ్రామం లో ప్రారంభించనున్నారు. బొండపల్లిలో బహిరంగా సభను ఏర్పాటు చేసేందుకు సోమవారం గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కెఎ నాయుడు, జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్‌లు స్థల పరిశీలన చేసారు. తొలుత ఎమ్మెల్యే నాయుడు గజపతినగరం మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బుద్దరాజు నరసింహవర్మ, జడ్పీటీసీ బండారు బాలా జి, ఎంపిడిఒ కోరాడ రామచంద్రరావు బొండపల్లి హైస్కూల్ మార్గంలో గల స్థలాన్ని పరిశీలించారు. అలాగే జాతీయ రహదారి అనుకుని కోల్డ్ స్టోరేజికి ఎదురుగా ఉన్న సుమారు ఆరు ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. మధ్యహ్నం ఎమ్మెల్యే నాయుడు కలెక్టరు ఎంఎం నాయక్, ఎస్పీ నవదీప్ సింగ్ గ్రావెల్ హెలిప్యాడ్ ప్రదేశాన్ని, బహిరంగ సభ జరగాల్సిన ప్రదేశాన్ని నిశితంగా పరిశీలించారు. కార్యక్రమంలో గజపతినగరం, గంట్యాడ, బొండపల్లి, జడ్పీటీసీలు మక్కువ శ్రీ్ధర్, రమేష్, బండారు బాలాజి, మండల ఉపాధ్యక్షుడు బొడ్డురాము, మండల పార్టీ అధ్యక్షుడు కోరాడ కృష్ణ, డిఆర్‌డిఎ పిడి ఢిల్లీరావు, తహశీల్దార్ నీలకంఠరావు తదితరులు పాల్గొన్నారు.