విజయనగరం

వైభవంగా అమ్మవారి యాత్ర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, ఫిబ్రవరి 18: ఉత్తరాంధ్ర కల్పవల్లి, చీపురుపల్లి గ్రామదేవత శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి 20వ యాత్రమహోత్సవం ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించేందుకు ఆదివారం తెల్లవారుజామన మూడు గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో దర్శనమిచ్చారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ముడుపులు, మొక్కులు, కానుకలుతో పాటు పసుపు కుంకాలను చెల్లించుకున్నారు. అనంతరం కోళ్లను, గొర్రెలను అమ్మవారికి దానమిచ్చారు. అమ్మవారి యాత్ర ఆదివారం ప్రారంభమై సోమవారం, మంగళవారంతో మూడురోజుల పాటు నిర్వహించి మంగళవారం సాయంత్రంతో ముగిస్తారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. అలాగే సందర్శకుల సౌకర్యార్ధం చీపురుపల్లి పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో నాలుగుచోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. సే వ్యాపార సముదాయాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. మొదటిరోజు యాత్రలో అమ్మవారి మండపంలో ఏర్పాటు చేసిన లలితాసహాస్రనామ పారాయణంలో శాసనసభ్యురాలు కిమిడి మృణాళిని పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్టన్రాయకుడు బొత్ససత్యన్నారాయణ, మాజీ ఎంపి బొత్సఝాన్సీలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వైకాపా నాయకులు బెల్లాన చంద్రశేఖర్, మజ్జి శ్రీనివాసరావు, చీపురుపల్లి, మెరకముడిదాం, గుర్ల మండలాలకు చెందిన పార్టీ నాయకులుతోపాటు చీపురుపల్లి ఎంపిపి రౌతు కాంతమ్మ దంపతులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొబ్బిలి డిఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో ఇద్దరు సి ఐలు, నలుగు ఎస్సైల ఆధ్వర్యంలో సుమారు 400 పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో భారీబందోభస్తును ఎటువంటి అవాంచనీయ సంఘటలు జరగకుండా ఏర్పాటుచేశారు.
------------
దళిత గ్రామాలకు ఎక్కువ నిధులు కేటాయించాలి

కొత్తవలస, ఫిబ్రవరి 18: మండలంలో దళితులు ఎక్కువగా ఉన్న గ్రామాలకు అధిక నిధులు కేటాయించాలని కోరుతూ ఆదివారం దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో తుమ్మికాపల్లిలో ర్యాలీ నిర్వహించారు. దళిత యువకులంతా మోటారు సైకిళ్లపై ఈశ్వర్ అప్పారావు ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి స్థానిక ఎమ్మెల్యేకు దళితుల సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. తుమ్మికాపల్లి గ్రామంలో ప్రచారానికి వెళ్లే మార్గంలో గడ్డెవాగుపై వంతెన కావాలని, అదే విధంగా అంబేద్కర్ సామాజికి భవనానికి 30సెంట్లు స్థలం కావాలని, దళిత వాడల్లో సిసి రోడ్లు, లైట్లు ఏర్పాటు చేయాలని వారు కోరారు.
మండలంలోని దళితులు అందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్లు నిర్మించుకునేవారికి ఎన్టీఆర్ గృహ పథకంలో ఇళ్లు మంజూరు చేయాలని ఈశ్వర్ అప్పారావు కోరారు. అలాగే అర్హత కలిగిన దళితులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలని, దళితులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకడుగు వేస్తున్నాయని, ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే బ్యాంకర్లతో మాట్లాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు