విజయనగరం

చర్చలు సఫలం.. సమ్మెవాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 18: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయు) నాయకులు, ఉన్నతాధికారుల మధ్య ఆదివారం జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో మంగళవారం అర్థరాత్రి నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. చర్చలు సఫలం కావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే డిమాండ్లపై రాతపూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె వాయిదా వేస్తామని, ఆవిధంగా హామీ ఇవ్వకపోతే యథావిధిగా సమ్మె చేస్తామని ఎన్‌ఎంయు జోనల్ కార్యదర్శి శ్రీనివాసరాజు తెలిపారు. ఆర్టీసీ రీజనల్‌మేనేజర్ కార్యాలయంలో జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. రీజనల్‌మేనేజర్ పి.అప్పన్న, జోనల్ డిప్యూటీ పర్సనల్ మేనేజర్ వీరయ్యచౌదరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డిప్యూటీ చీఫ్‌ట్రాఫిక్ మేనేజర్లు ఎన్‌విఆర్ వరప్రసాద్, కుప్పిలి శ్రీనివాసరావు, ఆర్‌ఎం కార్యాలయం పర్సనల్ అధికారి బివిఎస్ నాయుడు, ఎన్‌ఎంయు జోనల్ కార్యదర్శి శ్రీనివాసరావుతోపాటు రీజనల్ అధ్యక్షుడు వై.అప్పయ్య, రీజనల్ కార్యదర్శి బిఎస్ రాములు, డివిజయన్ అధ్యక్షుడు చంద్రవౌళి, డివిజన్ కార్యదర్శి డిఎస్ రావుపాల్గొన్నారు.
యూనియన్ నాయకులు, అధికారుల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కనిపించడంతో సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించారు. అయితే డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇస్తేనే సమ్మె వాయిదా వేస్తామని, లేకపోతే సమ్మె చేస్తామని జోనల్ కార్యదర్శి శ్రీనివాసరాజు తెలిపారు. సమ్మె నోటీసును అందించినా కనీసం స్పందించలేదని చెప్పారు. రన్నింగ్ టైమ్ సరిపడని రూట్లలో రూట్ సర్వేలు చేయాలన్నారు. కార్మికులందరికీ లీవు సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు డిఎన్ రాజు, కార్యదర్శి ఎంఇ రావు, జివిఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.