విజయనగరం

ప్రజాపోరాటంతోనే ప్రత్యేక హోదా సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, మార్చి 21: ప్రజాపోరాటాల ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యమని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ అన్నారు. బుధవారం సాయంత్రం తాడ్డి జశ్వంత్‌నాయుడు చేపడుతున్న నిరవధిక నిరాహారదీక్షకు మద్దతు తెలిపేందుకు ఆయన గజపతినగరం విచ్చేశారు. దీక్షా శిబిరం వద్దకు వచ్చి జశ్వంత్‌నాయుడుకు పూలదండ వేసి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల వలన సాధ్యంకాదని, ప్రజా ఉద్యమాలవలనే సాధ్యపడుతుందని అన్నారు. ప్రజలు స్వచ్చందంగా పోరాటాలకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. జశ్వంత్ నాయుడు వంటి యువతతోనే దేశ, రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని, యువతరం పోరాటాలకు ముందుకురావాలని కోరారు. 2016లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్యాకేజీకి ఒప్పుకోవడం వలనే హోదా నినాదం మరుగున పడిందని అన్నారు. ఆనాడే వై ఎస్సార్ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్దపడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని, నియంతులు కాలగర్భంలో కలసిపోక తప్పదని హెచ్చరించారు. తిరుపతి వెంకన్నసాక్షిగా వచ్చిన ఏ ఒక్క హామీని మోడీ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. మోడీ ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రి వలే వ్యవహరిస్తున్నారని, దేశ ప్రధానినని మరచిపోతున్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్ తప్పా మరే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే విధంగా మోడీ వ్యవహారశైలి ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు భాగావెనుకబడి ఉన్నాయని, ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ద్వారా ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి అన్ని పార్టీల రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకతాటిపైకి వస్తే కేంద్రప్రభుత్వం మెడలు వంచి హోదా సాధించుకోవచ్చు అని అన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట మాడుగుల నియోజకవర్గ ఉత్తరాంధ్ర చర్చావేదిక వి.వి.రావుకూడా ఉన్నారు.

రామతీర్థాన్ని అభివృద్ధి చేయాలి
నెల్లిమర్ల, మార్చి 21: రామతీర్థం దేవస్థానానికి ప్రభుత్వం మరిన్ని నిధులు మంజూరుచేసి అభివృద్దిచేయాలని ఉత్తరాంధ్ర సాధుసంప్ పరిషత్ అధ్యక్షులు సమతానంద స్వామి డిమాండ్ చేశారు. రామతీర్థంలో బుధవారం సాధు సంప్ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమతానంద స్వామి మాట్లాడుతూ రామతీర్థాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ మూడు సంవత్సరాల క్రితం నుంచే ఉద్యమాన్ని చేపట్టామని వెల్లడించారు. ఆందోళన కార్యక్రమాలపై స్పందిన ప్రభుత్వం ఆనాటి నుంచి నవమి ఉత్సవాలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ ఆలయం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించి ఆలయాన్ని అభివృద్దిచేయడానికి చర్యలు చేపట్టకుంటే స్వామివారికల్యాణం రోజే ప్రజాప్రతినిధులను నిలదీస్తామని హెచ్చరించారు. ఆలయానికి కావాల్సిన నిధులును మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు మరచిపోయారని అన్నారు. ఆలయ అభివృద్ధిని విస్మరిస్తే వచ్చే సార్వాత్రిక ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో స్రవణ చైతన్య చిన్నస్వామి, రామానందస్వామి, బ్రహ్మానందస్వామి, సత్యానందస్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

వైభవంగా సీతారామస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు
గంట్యాడ, మార్చి 21: మండలంలోని కొటారుబిల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామస్వామి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహప్రతిష్ట మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గురువారం జరగనుంది. ఈ నేపథ్యంలో మహోత్సవంలో రెండవరోజు అయిన బుధవారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. మంగళవాయిధ్యాలు, వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ సీతారాముల విగ్రహ మూర్తులకు క్షీరాభిషేకం నిర్వహించారు. అలాగే నిత్యార్చనలు, ప్రధాన హోమం కార్యక్రమాలను వేదపండితులు నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమంలో మహిళలు తులసి అర్చన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఆవాహిత దేవతామూర్తులు, గ్రామప్రదక్షిణ కార్యక్రమాలు జరిపి సాయంత్రం గ్రామ పురవీధుల్లో ఉత్సవ మూర్తులను ఊరేగించారు. కొత్తవెలగాడ గ్రామానికి చెందిన సి.హెచ్.గంగునాయుడు ఆధ్వర్యంలో భవానీ శంకర్ బృందం వారిచే కోలాట ప్రదర్శనలతో భక్తులు రామభజనలు చేసుకుంటూ రామనామ సంకీర్తనలతో ఉత్సవమూర్తుల ఊరేగింపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.