విజయనగరం

బాబు దీక్షకు ప్రజామోదం ఏదీ?: కోలగట్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షలకు ప్రజామోదం ఏదని వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం ఆయన గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం సాగిస్తుంటే, దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇపుడు దీక్షలు చేపట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం బంద్ చేపడితే దానిని విఫలం చేసేందుకు పోలీసు బలగాలను ఉపయోగించడం, మరోపక్క దీక్షలు చేపట్టడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రజాప్రయోజనాలు పట్టని చంద్రబాబునాయుడు అండ్ గ్యాంగ్ సాయంత్రం 4 గంటలకే దీక్షలు విరమించారని ఎద్దేవా చేశారు. మీ ప్రభుత్వ భరతం పట్టేందుకు వారంతా ఎదురు చూస్తున్నారని కోలగట్ల టీడీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. ఇదిలా ఉండగా జిల్లా అభివృద్ధి కోసం నాలుగేళ్లలో ఒక్కమాటైనా మాట్లాడని అశోక్‌గజపతిరాజు నేడు దీక్షల్లో పాల్గొనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి పోరాటం చేస్తున్న ఘనత తమదేనన్నారు. జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు దీక్షలను దొంగదీక్షలని ప్రజలు అంటున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అప్పలనర్సయ్య, బి.అప్పలనాయుడు, జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, సీనియర్ నాయకులు పి.సాంబశివరాజు, యడ్ల రమణమూర్తి, సూర్యనారాయణరాజు, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

రైతులు సహకరిస్తేనే వ్యవసాయాభివృద్ధి
లక్కవరపుకోట, ఏప్రిల్ 20: ప్రస్తుతం రైతులు చేస్తున్న వ్యవసాయ విధానంలో కొత్తగా వచ్చిన మార్పులను అణ్వయించేందుకు సహకరిస్తేనే ఈనాడు వ్యవసాయంలో అభివృద్ధి సాధించవచ్చు అని భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ ఎండీ ఎ.వి.రమణరావు అన్నారు. శుక్రవారం రైతుకోసం గ్రామసభ చందులూరులో పాల్గొని మాట్లాడారు. షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి నూతన పద్దతులు అవలంభిస్తున్నామని, చెరకు దిగుబడి పెంచేందుకు ప్రయోగశాలలో పెంచిన చెరకు విత్తనాలను రైతుల పొలం వద్దకే సబ్సిడిపై అందిస్తామని, చెరకు పంట విస్తీర్ణం పెంచవలసిన అవసరం ఎంతో ఉందని, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. చెరకు విస్తీర్ణం పెంచకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఫ్యాక్టరీ మూతపడే అవకాశం ఉందని, రైతులు ఈ విషయంలో మాకు సహకరించాలని, సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. వ్యవసాయ అధికారులు ముత్యాలనాయుడు, రమణ, పార్వతీలు మాట్లాడుతూ రైతులు పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రీయ ఎరువులు వాడటం వలన కృత్రిమ ఎరువులు వాడకం తగ్గించడం వలన భూసారం పెరగడంతోపాటు అధిక దిగుబడులు వస్తాయని అన్నారు. సాధరణ పంటలతోపాటు వాణిజ్య పంటలు వేయడం వలన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

రైతు ఆదాయం పెంచడమే ప్రభుత్వ ధ్యేయం
చీపురుపల్లి, ఏప్రిల్ 20: రైతులకు అన్ని కాలాల్లో తదనుగునంగా పంటలను వేయించి తద్వారా వారి ఆదాయాలను పెంచడమే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయశాఖ సహాయసంచాలకులు జీఎస్‌ఎన్‌ఎస్ లీలావతి అన్నారు. మండలంలోని పికె పాలవలస గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రైతుకోసం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు కూడా ఆధునిక వ్యవసాయ పద్దతులను వినియోగించుకోవడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చన్నారు.
ఇందుకు తమశాఖ పూర్తిస్థాయిలో సహకరిస్తుందన్నారు. తహాసీల్దార్ బి ముక్తేశ్వరరావు మాట్లాడుతూ రైతులు ముందుగా వారియొక్క భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేసుకొని సరిచేసుకుంటే ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని సౌకర్యాలు సకాలంలో అందుతాయన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి మోహన్, ఉద్యానవనశాఖ, వ్యవసాయశాఖ, మార్కెటింగ్ అధికారులు, ప్రాధమిక వ్యవసాయపరపతి సంఘాల అధికారులు రైతలకు పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖాధికారి రవీంద్ర, రెవిన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.