విజయనగరం

ప్రత్యేక హోదా సాధనలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఏప్రిల్ 20: ప్రత్యేక హోదా సాధనలో తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందని మాజీ కేంద్ర మంత్రి, విజయనగరం ఎంపీ పూసపాటి అశోక్‌గజపతిరాజు స్పష్టం చేశారు. చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు సంఘీభావంగా ఎమ్మెల్యే నాయుడు చేస్తున్న దీక్షా శిబిరాన్ని అశోక్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అశాస్ర్తియంగా జాతీయ పార్టీలు రెండూ ఆ నాడు విభజించి రాష్ట్రాన్ని ఇపుడు నడిరోడ్డుమీద వదిలేశారన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్రంపైనే ఉందన్నారు. గత ఆరునెలలుగా విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు రాజీలేని పోరాటం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా లేకపోయినప్పటికీ సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా పథకాలను కొనసాగిస్తూ దేశంలోనే అత్యధిక గ్రోత్ సాధిస్తోందన్నారు. తాను మంత్రిగా పనిచేసిన విమానయాన రంగం ప్రపంచంలోనే అత్యధికంగా గ్రోత్ సాధించిందన్నారు. రాజధాని, కేంద్ర విద్యాలయాల ఏర్పాటు కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చినప్పటీకీ కేంద్రం మాత్రం నిధులు విడుదల చేయలేదన్నారు. కేంద్రం 12 విద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ నాలుగేళ్ళల్లో కనీసం మూడు విద్యాలయాలు అయినా పూర్తి చేయలేదన్నారు. జిల్లాకు కేటాయించిన గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయించలేదన్నారు. ప్రతి పక్ష నాయకుడు ప్రతి వారం కోర్టుకు వెళుతూ అధికార పార్టీపై ఆధారంలేని ఆరోపణలు చేయడం తగదన్నారు. రూ. 43 వేల కోట్ల అవినీతిలో ముద్దాయి ప్రత్యేక హోదా కోసం మాట్లాడడం సబబు కాదంటూ జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలని వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, ఎంపీపీలు గంట్యాడ శ్రీదేవి, బెజవాడ రాజేశ్వరి, జడ్పీటీసీలు మక్కువ శ్రీధర్, బండారుబాలాజీ, కె.రమేష్, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రావి శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ బుద్దరాజు నర్సింహవర్మ, సిహెచ్‌సి చైర్మన్ మిత్తిరెడ్డివెంకటరమణ, టీడీపీ మండల కన్వీనర్లు గండ్రేటి అప్పలనాయుడు, కొండపల్లి భాస్కరరావు, కోరాడ కృష్ణ పాల్గొన్నారు.