విజయనగరం

స.హ. చట్టం స్ఫూర్తిని దెబ్బతీయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 29: సమాచార హక్కు చట్టం స్ఫూర్తిని కార్యకర్తలు దెబ్బతీయోద్దని రాష్టస్రమాచార హక్కు చట్టం కమిషనర్ పిజయబాబు సూచించారు. శుక్రవారం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో మూడు జిల్లాల అధికారులు, సహచట్టం కార్యకర్తల అవగాహ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చట్టం అమల్లోకి వచ్చి పదేశ్లు కావస్తున్నా అవగాహన లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.సమాచారం అడిగిన వారికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత అందరికి ఉందని స్పష్టం చేసారు. సామాన్యుడికి న్యాయం జరిగే విషయంలో చట్టపరిధిలో ఉద్యోగులు, కార్యకర్తలు వర్గాలుగా విడిపోవడం మేలు కాదని హితవు పలికారు. పారదర్శకంగా, జవాబుదారీ విధానం ఈచట్టం లో ముఖ్య అంశమని వివరించారు. విద్య, ఆరోగ్యం, ఇతర రంగాల్లో సామాన్యులు దోపిడీకి గురవుతున్న విధానాన్ని వేలెత్తి చూపారు. ఒక అవినీతిపరుడైన ఉద్యోగి వలన అందరికి చెడ్డపేరు రావడం మంచిది కాదని హితవుపలికారు.అటవంటి ఉద్యోగులను నిలదీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని వివరించారు. ప్రస్తుత సమాజంలో నెలకొన్న రుగ్మతలను, అవినీతి అంశాలను ఆయన ఈసందర్భంగాప్రస్తావించారు. ఈచట్టం భవిష్యత్తుతరాలకు భరోసాగా ఉంటుందని అన్నారు. కింది స్థాయి వారిని కాకుండా పై స్థాయిల్లో ఉండే అధికారులను కూడా ప్రశ్నించాల్సిన ధైర్యం సహచట్టం కార్యకర్తల్లో రావాలని తెలిపారు. సమచార హక్కు చట్టం చాలా శక్తివంతమైనది ఈ చట్టం స్ఫూర్తిని కొందరుకార్యకర్తలు దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అడిగిన వారిపట్ల తగువిధంగా మాట్లాడి సమాచారం లోపం లేకుండా ఇవ్వాలని తెలిపారు. చట్టం సూచించిన పరిధిలో అవగాహనతో చట్టం అమలుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని అన్నారు. జిల్లాలో నమోదు అయిన సహ చట్టం కేసుల్లో 137 పెండింగ్‌లో ఉన్నాయని కన్వీనర్ డి ఆర్వో జితేంద్ర వివరించారు. ఈకార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ నాగేశ్వరరావు, ఎ ఎస్పీ రమణ, జడ్పీ సి ఇ ఓ రాజకుమారి, సహచట్టం కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.