విజయనగరం

చందాల దందాపై వ్యాపారులలో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, ఏప్రిల్ 26: పట్టణంలో ప్రధాన గ్రామదేవత కొత్తమ్మతల్లి పండగ వచ్చేనెల 6,7,8వ తేదీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈమేరకు అధికారపార్టీ నాయకులు కమిటీ పేరుతో చేస్తున్న వసూళ్ల తీరుపై సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నాయి. పట్టణానికి చెందిన జమిందార్ విక్రం చంద్రసన్యాసిరాజు ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ పండగ ఏర్పాట్లుకు చర్యలు చేపడుతున్నారు. నిర్వహణకు అయ్యే ఖర్చుల నిమిత్తం ప్రజలు, వ్యాపారుల వద్ద నుంచి చందాలను వసూళ్లు చేస్తున్నారు. 185మంది సభ్యులతో పండగ కమిటీ ఏర్పడినప్పటికీ వారిలో అధికంగా టీడీపీ నాయకులే ఈ కమిటీలో ఉన్నారని తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా కమిటీ సభ్యులు పట్టణంలోని వ్యాపారులు, ప్రముఖుల నుంచి చందాలను వసూళ్లు చేస్తున్నారు. చిరువ్యాపారులను సైతం ఫోన్లు ద్వారా బెదిరిస్తు అధిక మొత్తంలో చందాలను డిమాండ్ చేయడం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నచిన్న పాన్‌షాపుల యజమానులు, కిరాణా యజమానుల నుంచి బలవంతంగా చందాలను వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము ఎంత కోరితే అంత చందా రాయల్సిందేనని అధికార పార్టీ కమిటీ సభ్యులు దౌర్జన్యం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్తమ్మతల్లి పండగకే పెద్దపెద్ద మొత్తాలలో వసూళ్లు చేపడితే వచ్చే ఏడాదిలో జరగబోయే శ్యామలాంబ పండగకు ఎంతెంత వసూళ్లు చేస్తారోనని చిరువ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ఫుట్‌పాత్ వ్యాపారులను కూడా వదలడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పండగ కమిటీలో ఎమ్మెల్సీ జి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజుదేవ్, ఎమ్మెల్యే రాజన్నదొర, మున్సిపల్ ఛైర్‌పర్సన్ విజయకుమారిలు కూడా ఉన్నారు. అధికారపార్టీ నాయకుల అండతోనే కమిటీ సభ్యులు చందాలదందా కొనసాగిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
దౌర్జన్యంగా వసూళ్లు చేయరాదు: ఎమ్మెల్యే రాజన్నదొర
పండగ పేరుతో చిరువ్యాపారులను బెదిరించి అధిక మొత్తాలలో చందాలను వసూళ్లు చేయడం తగదని ఎమ్మెల్యే రాజన్నదొర విలేఖర్లకు తెలిపారు. ప్రజలు, వ్యాపారులు సంతృప్తితో ఇచ్చే చందాలను తీసుకుంటే మంచిదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.