విజయనగరం

డ్రైవర్లు మానసిక ప్రశాంతతను అలవర్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, ఏప్రిల్ 26: వాహనాలను నడిపే డ్రైవర్లు మానసిక ప్రశాంతతను అలవర్చుకోవాలని రవాణాశాఖా డిప్యూటీ కమిషనర్ కృష్ణవేణి కోరారు. జాతీయ రహదారి భద్రతావారోత్సవాలలో భాగంగా గురువారం స్థానిక లారీ యజమానుల సంఘం కార్యాలయంలో లారీ డ్రైవర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైవర్ ఉద్యోగం 100శాతం రిస్క్‌తో కూడికూన్నదన్నారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఏ విధమైన ఒత్తిళ్లకు గురికారాదన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. యోగా, ధాన్యాన్ని అలవర్చుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా వాహనాలను నడపాలన్నారు. ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. లారీలను నడిపేటప్పుడు ప్రథమ చికిత్సగాను పసుపు, తులసి పొడులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. లారీ యజమానులు డ్రైవర్ల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని డీటీసీ కృష్ణవేణి కోరారు. ఈ సదస్సులో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పివి గంగాధర్, లారీ యజమానుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గొర్లె మాదవరావు, ఏ అప్పారావు, ఐవి నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.