విజయనగరం

త్వరలో అమలులోకి నిరుద్యోగభృతి: మంత్రి లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతానగరం, ఏప్రిల్ 26: రాష్ట్రంలో నిరుద్యోగ భృతిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పంచాయతీరాజ్, ఐటీశాఖామంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మండలంలోని జోగింపేట గిరిజన గురుకుల పాఠశాలలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ 45 నుంచి 60 రోజులలోపు ఈ పథకం అమలులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తుచేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్యను పరిష్కరించడంతోపాటు స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ద్వారా అపారిశుద్ధ్య నిర్మూలన, మరుగుదొడ్లు నిర్మాణాలకు చర్యలు చేపడుతున్నామన్నారు. గృహనిర్మాణశాఖకు సంబంధించిన బిల్లులపై విలేఖర్లు మంత్రిని ప్రశ్నించగా ఉపాధి హామీపథకం నుంచి రావల్సిన బిల్లుల్లో కొన్ని సమస్యలున్నాయని, ఇందుకు ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీలు ఉపాధి హామీపథకంపై అవినీతి ఆరోపణలు చేస్తు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వలన ఉపాధి హామీపథకంపై ఆడిట్లు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదాను నిర్లక్ష్యం చేస్తుందని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో టీడీపీ ప్రభుత్వం పోరాడుతుందన్నారు. టీడీపీ ఆధ్వర్యంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తనపై చేసిన ఆరోపణలకు స్పందిస్తు కొంతమంది స్వార్థరాజకీయ నాయకుల వలన పవన్‌కళ్యాణ్ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని, అయినప్పటికీ పవన్‌కళ్యాణ్ అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. నటీ శ్రీరెడ్డి వివాదంలో కూడా తన పేరును ప్రచారం చేయడం అసత్యమన్నారు. ఈ వివాదంలో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్నామన్నారు. ఈయనతోపాటు మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు, ఎమ్మెల్యే చిరంజీవులు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్‌లు ఉన్నారు.

ఉపాధి కూలీలు రెండు పూటలా పనులు చేయాలి
రామభద్రపురం, ఏప్రిల్ 26: మహాత్మగాంధీ జాయతీ ఉపాధి హామీపథకం కూలీలు రోజులో రెండు పూటలు పనులు చేయాలని ఏపీఓ విజయలక్ష్మి కోరారు. మండల పరిధిలోని కొండకెంగువ గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీపథకం పనులను గురువారం ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా కూలీలనుద్ధేశించి మాట్లాడుతూ రోజుకు రెండు పూటలు పనులు చేయడం వలన ప్రభుత్వం నిర్ధేశించి 195 రూపాయలు వేతనం లభిస్తుందని, ఈ అవకాశాన్ని ఉపాధి కూలీలు వినియోగించుకోవాలన్నారు. పనులు చేసేచోట కూలీలకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను అడిగితెలుసుకున్నారు. ఏప్రిల్ నెలలో పనులు చేసిన కూలీలకు అదనంగా కూలి రేట్లు చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ కోటేశ్వరరావును కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.