విజయనగరం

చివరికి జగన్ ఒక్కరే మిగులుతారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 29: ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోనరెడ్డిపై ఆపార్టీలో ఏ ఒక్కరికి నమ్మకం లేకపోవడంతోనే ఆ పార్టీ నేతలు టిడిపిలోకి క్యూ కడుతున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘనాథరెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం జడ్పీ అతిథిగృహంలో సహచర మంత్రిరాష్ట్రగ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడిమృణాళిని, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఎమ్మెల్యేలు చిరంజీవులు, కె ఎ నాయుడులతో కలిసి విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతగా జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. జగన్ పెద్ద స్వార్థపరుడుగా అభివర్ణించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన సొమ్మను నిలబెట్టుకోవ డానికే జగన్ రాజకీయాల్లో కొనసాగుతున్నారని ఆరోపించారు. జగన్ నియంతృత్వ విధానాలతో విసిగిపోయి స్వచ్ఛందంగా పలువురు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి చేరుతున్నారని, అయితే దీనికి ఎమ్మెల్యేలను టిడిపి నేతలు కొనుగోలు చేస్తున్నట్లు చేస్తున్న ఆరోపణలు తగవన్నారు. బాధ్యతగల ప్రతిపక్షనేతగా గడచిన రెండేళ్లలో ప్రజల సమస్యలపై ఏనాడు సభలో ప్రస్తావించలేదని, ప్రజల సమస్యకన్నా ఆయనకు రోజా సమస్య ముఖ్యమని మంత్రి విమర్శించారు. పెద్ద అవినీతి పరుడు ఏముఖం పెట్టుకుని ఢిల్లీకి పోయారని ఎదురు దాడికి చేసారు. లక్ష కోట్ల అక్రమార్జనలో 45 వేల కోట్లను ఇప్పటికే దర్యాప్తు సంస్థలు అటాచ్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుపై ఆయన తండ్రి హయాంలో వేసిన విచారణలో ఏ ఒక్కటి నిరూపితం చేయలేక పోయారని అన్నారు. జగన్ వ్యవహార శైలితో విసిగిపోయిన వారంతా టిడిపిలోకి వస్తున్నారని చెపుతూ ఆయన పార్టీలో షర్మిళ కూడా ఉండరని , చివరికి జగన్ ఒక్కరే మిగులుతారని జోస్యం చెప్పారు. ఈసమావేశంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపిరాజు పాల్గొన్నారు.